Thursday - February 20, 2020
Blog

0 4334

 • ‘యుఎస్‌ఐబీసీ ట్రాన్స్‌ఫోర్మెటివ్ ఛీఫ్ మినిస్టర్’ చంద్రబాబు
 • కాలిఫోర్నియాలో మే8న ప్రదానం

అమరావతి :  ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు మరో ప్రతిష్ఠాత్మకమైన అంతర్జాతీయ పురస్కారం లభించింది. యు.ఎస్. ఇండియా బిజినెస్ కౌన్సిల్ (యు.ఎస్.ఐ.బి.సి) ఆయనకు ‘ట్రాన్స్‌ఫోర్మెటివ్ ఛీఫ్ మినిస్టర్’ పురస్కారాన్ని ప్రకటించింది. మే 8 తేదీన కాలిఫోర్నియాలో జరగనున్న రెండో వార్షిక పశ్చిమ తీర సదస్సు (సెకండ్ యాన్యువల్ వెస్ట్ కోస్ట్ సమ్మిట్‌)లో ఈ పురస్కారాన్ని ప్రదానం చేస్తారు. అవార్డు స్వీకరణ తర్వాత కీలకోపన్యాసం ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబును యుఎస్ ఇండియా బిజినెస్ కౌన్సిల్ చైర్మన్ జాన్ ఛాంబర్స్ ఆహ్వానించారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కార్యాలయానికి ఆహ్వానం అందింది.
కాలిఫోర్నియాలోని మెన్లోపార్క్ (Menlo Park) లో భారీస్థాయిలో ఏర్పాటయ్యే ఈ సదస్సుకు అమెరికాలోని ఆర్ధిక సేవలు, శుద్ధ ఇంధనం, ఆరోగ్య పరిరక్షణ, మౌలిక సదుపాయాలు, ఉత్పాదక పరిశ్రమలకు చెందిన దిగ్గజ పారిశ్రామికవేత్తలు హాజరవుతారు. అమెరికా మాజీమంత్రి డా. కండోలిజా రైస్, ఫిన్‌టెక్, ఐఓటీ పారిశ్రామికాధిపతులు, అమెరికాలో భారత్ రాయబారి నవతేజ్ సర్న తదితరులు పాల్గొంటారు. ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ కార్యదర్శి అరుణా సుందరరాజన్‌కు ఇదే సదస్సులో ‘ట్రాన్స్‌ఫార్మేటివ్ లీడర్‌షిప్’ అవార్డు ప్రదానం చేస్తారు.
రెండో వార్షిక పశ్చిమ తీర సదస్సు సందర్భంగా ప్రతిష్ఠాత్మక కంపెనీలు సిస్కో, గూగుల్, ఫేస్‌బుక్, లింకిడ్ ఇన్, ఎడోబ్, ఇన్‌టెల్, ఎయిర్ బి.ఎన్.బిలతో వ్యాపార, వాణిజ్య అవకాశాలపై యు.ఎస్.ఐ.బి.సి రౌండ్ టేబుల్ సమావేశాలు ఏర్పాటు చేయనుంది. ఆయా కంపెనీల కార్యాలయాలు సందర్శించే వీలు కల్పిస్తారు. మే 8వ తేదీన మధ్యాహ్నం వరకు సదస్సు కొనసాగుతుంది. ఆతర్వాత తర్వాత రెండు రోజుల పాటు పారిశ్రామికవేత్తలతో సమావేశాలు ఉంటాయి.

0 3022

 

అమరావతి :  స్మార్ట్ గ్రామం, స్మార్ట్ వార్డ్ తరహాలో స్థానిక పాలనలో సాధికారతను పెంచే వినూత్న ఆలోచనలు తమనెంతో ఆకర్షించాయని నార్వే రాయబారి నీల్స్ రాగ్నర్ (Nils Ragnar) చెప్పారు. శుక్రవారం సాయంత్రం శాసనసభ వాయిదా అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబుతో సమావేశమైన నార్వే రాయబారి ఏపీలో కల సానుకూలాంశాల గురించి మాట్లాడారు. ఏపీ ప్రభుత్వం చేపట్టిన స్మార్ట్ గ్రామం, స్మార్ట్ వార్డ్ అమలుతీరును తెలుసుకున్న నార్వే రాయబారి ఈ కార్యక్రమం కోసం రాష్ట్రంతో కలిసి పనిచేసే అంశాన్ని పరిశీలిస్తామని తెలిపారు. సమాజంలోని అన్ని వర్గాల వారు సుస్థిర, సమ్మిళిత అభివృద్దిని సాధించేందుకు ఈ కార్యక్రమం ఎంతో దోహద పడుతుందన్నారు.
సముద్రం, సముద్ర గర్భానికి సంబంధించిన విజ్ఞానంలో నార్వే బలీయంగా ఉందని, చమురు, సహజ వాయువుల వెలికితీతలో తమ దేశం బలమైన శక్తిగా ఉందని నార్వే రాయబారి తెలిపారు. సముద్ర గర్బ కార్యకలాపాలకు సంబందించిన సాంకేతికతలో నార్వే ప్రపంచంలో రెండో స్థానంలో ఉందని ముఖ్యమంత్రికి చెప్పారు. నౌకా నిర్మాణ కార్యకలాపాల్లో, సముద్ర ఆధారిత వ్యవహారాల్లో, ఓడ రేవుల నిర్వహణకు సంబంధించిన అత్యున్నత సాంకేతిక పరిష్కారాలలో నార్వే పేరెన్నిక గన్న దేశమని చెప్పారు. సముద్ర ఆహార ఉత్పత్తుల ఎగుమతుల్లో తమ దేశం ప్రపంచంలోనే ద్వితీయ స్థానంలో ఉందన్నారు. దీనిపై స్పందించిన ముఖ్యమంత్రి నార్వేతో ఆంధ్రప్రదేశ్‌కు ఎన్నో సారూప్యతలు ఉన్నాయని అన్నారు. 15 శాతం వృద్ది రేటుతో ఈ ఆర్ధిక సంవత్సరలో దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా నిలవాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నామని చెప్పారు. సముద్ర ఆధారిత కార్యకలాపాల్లో నార్వే సహకారం తీసుకుంటామని చెప్పారు.
అత్యదిక ఆదాయ సముపార్జనకు అవకాశం ఉన్న సముద్ర ఆధారిత వాణిజ్య కార్యకలాపాలపై ఇప్పుడు అత్యదిక శ్రద్ధ పెడుతున్నామని, నార్వే సహకారంతో ఈ రంగంలో సత్వర వృద్ది సాధించగలమన్న నమ్మకం ఉందని ముఖ్యమంత్రి చెప్పారు. కొత్త రాష్ట్ర అభివృద్దిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి దార్శనికతను ప్రత్యక్షంగా చూస్తున్నామని నార్వే రాయబారి ఈ సందర్భంగా ప్రశంశించారు.
ఈ సమావేశంలో వ్యవసాయ మంత్రి పత్తిపాటి పుల్లారావు, ప్రభుత్వ సలహాదారు డా. పరకాల ప్రభాకర్, ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శి సాయి ప్రసాద్, పశు సంవర్ధక శాఖ ముఖ్య కార్యదర్శి మన్మోహన్ సింగ్, ముఖ్యమంత్రి అదనపు కార్యదర్శి ఏవి రాజమౌళి పాల్గొన్నారు.

పూర్తిస్థాయిలో వాటర్ ఆడిటింగ్ వ్యవస్థ
అవసరమైన జిల్లాలకు రెయిన్‌గన్ల సర్దుబాటు
తుఫాన్ల కంటే కరువు ప్రమాదకరం
వీడియో కాన్ఫరెన్స్‌లో సీఎం చంద్రబాబు
రాష్ట్రంలో ప్రతి నీటి బొట్టును సద్వినియోగం చేసుకునేలా లెక్కుండాలని, ఇందుకు అనుగుణంగా పూర్తిస్థాయిలో రియల్‌టైమ్ వాటర్ ఆడిటింగ్ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నట్టు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ప్రకటించారు.

రాష్ట్రంలో లభ్యమవుతున్న జలవనరుల తాజా సమాచారాన్ని అందిస్తామని, టెక్నాలజీని వినియోగించుకుని పంటలు కాపాడటమే లక్ష్యంగా పెట్టుకోవాలని అధికారులకు ముఖ్యమంత్రి నిర్దేశించారు. తుఫాన్ కంటే, కరువు ప్రమాదకరమని, కరువును జయించేందుకు అందరూ కదిలిరావాలన్న ముఖ్యమంత్రి, వర్షాభావ పరిస్థితులపైనా వేగంగా స్పందించాల్సిన అవసరం వుందన్నారు.
ఇటీవల

నవ్యాంధ్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు
నవ్యాంధ్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు

విజయవాడలోని తన కార్యాలయంలో వ్యవసాయ పనుల పురోగతి-‌నీటి వనరుల లభ్యత, వర్షాభావ పరిస్థితులపై ముఖ్యమంత్రి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రెయిన్‌గన్లు వినియోగం ద్వారా పంటలు కాపాడటం దేశంలోనే కొత్త ప్రయోగమని, దీనిని విజయవంతం చేసి రాష్ట్రాన్ని ఆదర్శంగా నిలపాలన్నారు. ఆరుగాలం కష్టించిన రైతు ఎట్టిపరిస్థితుల్లోనూ నష్టపోవడానికి వీల్లేదన్నదే తన ఆశయమన్నారు. ఒక్క రెయిన్‌గన్ కూడా నిరుపయోగంగా వుంచకుండా పొలాలకు తడి అందాచాలని స్పష్టం చేశారు. ప్రస్తుతం అందుబాటులో వున్న రెయిన్‌గన్లు, స్రింక్లర్లతో రోజుకు కనీసం 30 నుంచి 40 వేల ఎకరాలకు నీరందించేలా కృషి చేయాలని చెప్పారు.
రెయిన్‌గన్ల వాడకం ద్వారా నాలుగు రోజుల్లో సాధారణ పరిస్థితులు నెలకొనేలా చేయాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. వర్షాభావ పరిస్థితులు ఎక్కువుగా వున్న అనంతపురం, చిత్తూరు, కడప జిల్లాలకు అవసరమయ్యే రెయిన్‌గన్లను అదనంగా సర్దుబాటు చేయాలని సూచించారు.
ఇప్పటివరకు రాష్ట్రంలో 6,191 రెయిన్ గన్లను ఉపయోగించి 56,400 హెక్టార్లలో పంటలకు నీరందించినట్టు ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు. ప్రతి రోజూ ఎన్ని రెయిన్‌గన్లను వినియోగిస్తున్నది, ఎన్ని ఎకరాలను కాపాడింది తదితర వివరాలను జిల్లాలవారీగా అందించాలని ముఖ్యమంత్రి చెప్పారు.

వర్షాలు పడని ప్రాంతాల్లో యుద్ధప్రాతిపదికన పంటతడి
ట్యాంకర్లు, రెయిన్ గన్స్‌ను పూర్తిస్థాయిలో వినియోగించాలి
అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు టెలికాన్ఫరెన్స్
ఎండిపోతున్న వేరు శనగతో సహా, ఇతర ప్ర్దానమైన పంటలను కాపాడేందుకు యుద్ధప్రాతిపదికన పంటతడి

అందించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి  నారా చంద్రబాబు నాయుడు అధికారులను  ఆదేశించారు. అనంతపురం నుంచి ఆయన ఇటీవల  క్షేత్రస్థాయిలో జలవనరులు, వ్యవసాయం, రెవెన్యూ శాఖల అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.
వర్షాలు పడటం ఎంతో సంతోషించదగ్గ అంశమని, అయితే అంతమాత్రాన  ఉదాశీన వైఖరి తగదని, వర్షాలు లేని ప్రాంతాల్లో పంట ఎండిపోకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. ఎకరం పంటకూడా ఎండిపోకుండా కరవుపై చేస్తున్న యుద్ధంలో ఇది తొలిఅంకమేనని, ముందుముందు ఒకవేళ కరవు పరిస్థితులు ఏర్పడిన పక్షంలో ఇప్పుడు కరవును ఎదుర్కొన్న విధానం ఆదర్శం అవుతుందని ముఖ్యమంత్రి అన్నారు.

“పంట సంజీవని”ని  తేలిగ్గా తీసుకోవద్దు

‘పంటసంజీవని’ని తేలిగ్గా తీసుకోవద్దని తాను మొదటి నుంచి చెబుతున్నానని, ఇప్పుడు కష్టకాలంలో రైతాంగానికి ‘పంటసంజీవని’పై భరోసా ఏర్పడిందని, రెయిన్ గన్స్ పై విశ్వాసం కుదిరిందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఎండిపోతున్న పంటలను ‘పంటసంజీవని’ ద్వారా కాపాడుతున్న అంశంపై రైతాంగంలో అవగాహన అవసరమని చెప్పారు.
ఇందుకు వ్యవసాయ శాఖ సిబ్బంది అవిశ్రాంతంగా పనిచేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కోరారు. పంటలు ఎండకుండా, భూమిలో తడి ఇంకిపోకుండా ప్రభుత్వం చేయగలిగిన స్థాయిలో పనిచేస్తున్నదని, స్వచ్ఛంద సంస్థలు కరవునివారణలో భాగస్వాములు కావాలని

రైతన్నలతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు
రైతన్నలతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు

చంద్రబాబు పిలుపునిచ్చారు. విశ్వవిద్యాలయాల ప్రొఫెసర్లు, ఇంజనీరింగ్ విద్యార్ధులు క్షేత్ర స్థాయి పర్యటనకు వెళ్లాలని, రైతాంగంలో చైతన్యం తీసుకురావాలి, కరవు నివారణ చర్యలై అధ్యయనం చేసి తగిన సూచనలు చేయవచ్చని సీఎం చెప్పారు. వివిధ జిల్లాలలో వినియోగించిన రెయిన్ గన్స్, ట్యాంకర్లు, ఆయిల్ ఇంజన్ల సంఖ్యపై ప్రతిరోజూ రియల్ టైమ్ సమాచారం ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. వర్షపాత అంతరాయాలపై ప్రభుత్వం అన్నిచర్యలు తీసుకుందన్న భావన రైతుల్లో రావాలని అన్నారు. పనిలో వేగం వుండాలని, ఫలితం రాబట్టాలని, సకాలంలో సమాచారం అందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కోరారు.

  0 1631
  నవ్యాంద్ర మంత్రిమండలి samaavesam
  నవ్యాంద్ర  ముఖ్యమంత్రి నారా చందబాబు నాయుడు  అధ్యక్షతన మంగళవారం  అమరావతిలో జరిగిన రాష్ట్ర మంత్రిమండలి సమావేశం

   

   0 1574

   నీళ్లులేక పంటలు ఎండిపోవటం ఇకపై ఉండకూడదు
   వర్షపాత అంతరాయాలలో పంటల్ని కాపాడటంలో మనం ఆదర్శం
   రెయిన్ గన్స్ విధానంతో మన కృషికి సర్వత్రా ప్రశంసలు
   టెలీ కాన్ఫరెన్స్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు
   నవ్యాంధ్ర లో నీళ్లులేక పంటలు ఎండిపోవడమనేది ఇకపై జరగకూడదని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. వర్షపాత అంతరాయాలలో పంటలను కాపాడటం(డ్రైస్పెల్ మిటిగేషన్)పై గురువారం అనంతపురం నుంచి వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాయలసీమలో వర్షాభావ పరిస్థితిని ఆరురోజుల్లో అదుపులోకి తెచ్చామని, సకాలంలో రక్షక తడులిచ్చి పంటలు కాపాడినట్లు తెలిపారు. అవసరాన్ని బట్టి ఆయా ప్రాంతాలలో మరో రెండు, మూడు తడులివ్వాలని అధికారులను ఆదేశించారు.
   రెయిన్ గన్స్ టెక్నాలజీ ద్వారా నూతన శకం
   రెయిన్ గన్ టెక్నాలజీ ద్వారా వ్యవసాయ రంగంలో నూతన శకం ప్రారంభించామని, పంటకుంటలు, ట్యాంకర్లు, ఆయిల్ ఇంజిన్లు, రెయిన్ గన్స్ ద్వారా రక్షక తడులు ఇచ్చి పంటలు కాపాడటం దేశంలోనే సరికొత్త చరిత్ర అని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. పంటలు కాపాడటంలో అన్ని శాఖలు సమన్వయంగా పనిచేయడం శుభ పరిణామమని తెలిపారు. సరైన అంచనాలు, చక్కని అవగాహనతో ఈ ప్రక్రియను ముందుకు తీసుకెళ్లాలన్నారు. వర్షపాత అంతరాయాలలో పంటలను కాపాడే విధానాన్ని దేశ, విదేశాలకు ఆదర్శమన్నారు.

   కరవును తరిమికొట్టడంలో మన రాష్ట్రం ఒక రోల్ మోడల్
   కరవును తరిమికొట్టడంలో ఈ విధానం ఒక ‘రోల్ మోడల్ ’ అని చెప్పారు. వర్షాభావంలోనూ పంట కాపాడుకునే ధీమా రైతులకు వచ్చిందని, ధైర్యంకలిగిందని, ఇందుకోసం నిర్విరామంగా పనిచేసిన అధికారులకు, సిబ్బందికి చంద్రబాబు కృతజ్ఞతలు తెలిపారు. రెయిన్ గన్లతో వర్షాభావాన్ని, కరవును ఎదుర్కొన్న తీరు అద్భుతమన్న ప్రశంసలు వస్తున్నాయని, పర్యటనల్లో తాను ఎక్కడికెళ్లినా రైతుల కళ్లల్లో ఆనందం చూస్తున్నానని, తనకెంతో సంతోషంగా ఉందని అన్నారు.
   ఎండిపోతున్న పంటలను కాపాడటం చూసి అందరూ ఆశ్చర్యపోయారని, మీడియా కూడా ఆశ్చర్యపోయిందని సీఎం తెలిపారు. ప్రతిపక్షాల వాళ్లు కూడా ఇకపై నోరు తెరవలేరంటూ, వర్షాభావాన్ని సమర్ధంగా ఎదుర్కొన్నందుకు మీడియా తనకు ధన్యవాదాలు చెప్పడం గొప్ప విషయమని చంద్రబాబు తెలిపారు.

   ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు
   ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు

   వర్షపాత అంతరాయాలలో పంటలను కాపాడటం (డ్రైస్పెల్ మిటిగేషన్) తొలిదశ ఆపరేషన్ పూర్తిచేసినట్లు రేపటికల్లా కర్నూలులో ప్రకటిస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. రాయలసీమ నాలుగు జిల్లాలను ఒకదాని తర్వాత మరొకటి ‘స్ట్రెస్ ఫ్రీ’ గా ప్రకటిస్తామన్నారు. డ్రైస్పెల్ మిటిగేషన్, స్ట్రెస్ మేనేజిమెంట్ లో అన్నీశాఖలూ ఒక టీముగా పనిచేసి, అద్భుత ఫలితాలు సాధించారంటూ, ఈ కృషిలో భాగస్వాములైన అందరికీ అభినందనలు తెలిపారు. ఈ ‘టీం స్పిరిట్’ ను భవిష్యత్తులో కూడా కొనసాగించాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. ఉత్పాదన పడిపోకుండా ఈవిధంగా రక్షక తడులిచ్చి పంటలు కాపాడటం అపూర్వమని, ఇతర దేశాలకు కూడా ఇదొక నమూనా అని సీఎం చెప్పారు.

    0 1341

    పంటలబీమా పథకంలో మార్పులు రావాలి

    ముఖ్యమంత్రి చంద్రబాబు 

    ముఖ్యమంత్రి నారా చంద్ర బాబు నాయుడు
    ముఖ్యమంత్రి నారా చంద్ర బాబు నాయుడు

     

    పంటలబీమా పథకంలో సమూల మార్పులు తీసుకురావాల్సి ఉందని నవ్యాంధ్ర ముఖ్యమంత్రి  నారా  చంద్రబాబు నాయుడు  అన్నారు. పంటబీమా విధానం రైతులకు లాభదాయకంగా ఉండేలా తీర్చిదిద్దాల్సి ఉంద న్నారు. కాంట్రాక్టర్ లోపం వల్లనే పంటలు కాపాడటంలో 15రోజులు వెనుకబడ్డామని, పరికరాలను సమకూర్చుకోవడంలో కొంత జాప్యం జరిగిందని అంటూ, భవిష్యత్తులో పంటలకు ఆరుతడి నిర్వహణలో (స్ట్రెస్ మేనేజిమెంట్)లో ఈలోపాలు జరగకూడదని ముఖ్యమంత్రి హెచ్చరించారు.
    అక్యురసీ, ప్రిడిక్షన్ ఇన్ అడ్వాన్స్ రెండూ అత్యంత ప్రధానం
    అనంతపురం, కర్నూలు,చిత్తూరు, కడప, ప్రకాశం జిల్లాలలో వర్షాలు పడటం శుభపరిణామమని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. అయితే భవిష్యత్తులో పంటలకు ఆరుతడి నిర్వహణలో మరింత అప్రమత్తంగా ఉండాలని చంద్రబాబు అన్నారు. వర్షపాతం ముందస్తు అంచనాల్లో కచ్చితత్వం ఉండాలని, ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, ‘అక్యురసీ’, ‘ప్రిడిక్షన్ ఇన్ అడ్వాన్స్’ రెండూ అతి ప్రధానమైనవిగా వివరించారు. వర్షాభావంతో తేమ ఆరిపోయిన పైర్లు ఉన్న ప్రాంతాలలో 100% నాణ్యమైన విద్యుత్ ను 24 గంటలు సరఫరా చేయాలని ఆదేశించారు.
    విద్యుత్ శాఖాధికారులు, సిబ్బంది ఏమాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించరాదన్నారు. వ్యవసాయం, అనుబంధ రంగాలు, జలవనరులు, విద్యుత్, రెవిన్యూ, ప్లానింగ్ శాఖల అధికారులంతా కలిసి కూర్చుని ఆరుతడి పండల నిర్వహణపై ప్రభుత్వ కృషిని అధ్యయనం చేయలని సీఎం సూచించారు. భవిష్యత్తులో ఇంకా మెరుగైన నిర్వహణకు కార్యాచరణ ప్రణాళిక సిధ్ధంచేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కోరారు.

    పంటరక్షక తడులలో మిషన్-1 పూర్తి
    4 లక్షల ఎకరాలకు తడులు
    ఇక డ్రోన్ల ద్వారా హాంద్రీ-నీవా, గండికోట పనుల పరిశీలన

    రెండేళ్లలో 4 విజయాలు సాధించాం
    టెలికాన్ఫరెన్స్ లో ముఖ్యమంత్రి చంద్రబాబు
    పంటరక్షక తడుల కార్యక్రమంలో మిషన్-1 పూర్తయ్యిందని నవ్యాంధ్ర ముఖ్యమంత్రి  నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. మొత్తం 4 లక్షల ఎకరాలకు పంటరక్షక తడులను ఇచ్చినట్లు వివరించారు. రాష్ట్రంలో కరవు పరిస్థితుల నివారణపై శుక్రవారం అనంతపురం నుంచి అధికారులు, సిబ్బంది, ప్రజాప్రతినిధులతో ఆయన టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.
    రక్షకతడులిచ్చి పంటలు కాపాడటంతో ప్రభుత్వ ప్రతిష్ట పెరిగిందని, అధికార యంత్రాంగం గౌరవం ఇనుమడించిందని చంద్రబాబు వివరించారు. రాయలసీమ నాలుగు జిల్లాలలో పంటలు ఎండిపోకుండా కాపాడటంలో రాత్రింబవళ్లు కృషిచేసిన అధికారులు, సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు.
    ‘పంటరక్షక తడులు మిషన్-1’ ను శుక్రవారంతో పూర్తిచేస్తున్నట్లు ప్రకటిస్తూ.. ఒక బృందంగా సమన్వయంతో పనిచేసి విజయం సాధించామని, ఈ కృషిలో భాగస్వాములైన అందరికీ అభినందనలు తెలిపారు.
    టెక్నాలజీతో వైపరీత్యాలను ఎదుర్కోవచ్చు
    తరతరాలుగా కరవుతో సతమతమవుతున్న రాయలసీమ రైతులకు రెయిన్ గన్స్ ద్వారా ఒకదారి చూపామన్నారు. వర్షాభావాన్ని కూడా టెక్నాలజీ ద్వారా ఎదుర్కోవచ్చనే భరోసా రైతుల్లో నింపామన్నారు. కరవులో ఏమీ చేయలేమనే నిస్సహాయ పరిస్థితి నుంచి రైతాంగాన్ని బయటవేశామని, ఏదైనా చేయగలమనే విశ్వాసం కలిగించామని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు.
    పంటలు కాపాడినందుకు త్వరలో సత్కారం
    పంటలు ఎండిపోకుండా కాపాడటంలో సహకరించిన అధికారులు, సిబ్బంది, స్వచ్ఛంద సంస్థల సభ్యులకు త్వరలోనే అభినందన సత్కారం ఉంటుందని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. ప్రకృతి వైపరీత్యాలను కూడా టెక్నాలజీ ద్వారా సమర్ధంగా ఎదుర్కొనడం గొప్పవిషయంగా పేర్కొన్నారు.
    అన్ని శాఖల అధికారులు, సిబ్బంది అందరూ సహకరిస్తేనే, కష్టపడితేనే ఇది సాధ్యం అయ్యిందన్నారు. అవసరాన్ని బట్టి రెయిన్ గన్ టెక్నాలజీని ఇతర జిల్లాలకు విస్తరించి వర్షపాత అంతరాయాల నుంచి పంటలు ఎండకుండా కాపాడాలని సీఎం సూచించారు.
    4 లక్షల ఎకరాల్లో పంటలకు రక్షక తడులు
    రక్షక తడులు మిషన్ వన్ కింద రాయలసీమ నాలుగు జిల్లాలలో ఇప్పటివరకు 3,27,008 ఎకరాలలో పంటలను కాపాడామని ముఖ్యమంత్రి తెలిపారు. గుంటూరు, ప్రకాశం, శ్రీకాకుళం జిల్లాలను కూడా కలిపితే 3,74,800 ఎకరాలలో పంటలకు రక్షకతడులు ఇచ్చామన్నారు. శుక్రవారం మరో 25వేల ఎకరాలకు రక్షకతడులు ఇస్తున్నారని, దీంతో కలిపి గత వారం రోజులుగా మొత్తం 4లక్షల ఎకరాలలో పంటలకు రక్షక తడులు ఇచ్చినట్లు అవుతుందని చెప్పారు.

    దేశానికే ఆదర్శం
    ఒక మంచి ఆలోచన ప్రపంచాన్నే మార్చేస్తుందనడానికి పంట రక్షక తడులే ఉదాహరణ అని ముఖ్యమంత్రి చంద్రబాబు

    నవ్యాంధ్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు
    నవ్యాంధ్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు

    అన్నారు. నిన్నటి ఆలోచన, నేటి ఆచరణ, రేపటి భరోసాకు బాటలు వేస్తుందన్నారు. ‘పంటలు కాపాడటంలో అందరూ సహకరించారు, అందరూ కష్టపడ్డారు, అందుకే విజయం సాధించారు’ అని ప్రశంసించారు. ‘డ్రైస్పెల్ మిటిగేషన్’ పై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుసరించిన విధానాలకు దేశవిదేశాల్లో ప్రశంసలు లభిస్తున్నాయని, ఆంధ్రప్రదేశ్‌లో అనుసరించిన రెయిన్ గన్ టెక్నాలజీ విధానం ఇతర రాష్ట్రాలకు మార్గదర్శకమని అన్నారు.
    డ్రోన్ల ద్వారా హంద్రి-నీవా, గండికోట పనుల పర్యవేక్షణ
    రెయిన్ గన్స్ ద్వారా తాత్కాలిక పరిష్కారం చూపామని, ఇకపై శాశ్వత పరిష్కార మార్గాలపై అధికార యంత్రాంగం దృష్టి పెట్టాలన్నారు. ఇప్పటివరకు చేసిన పనులన్నీ డాక్యుమెంటేషన్ చేయాలన్నారు, సమాచారం ప్రజలకు తెలియజేయాలని,కేంద్రానికి నివేదిక పంపాలని సూచించారు. హంద్రీ-నీవా, గండికోట రిజర్వాయర్ పనులను డ్రోన్ల ద్వారా ఎప్పటికప్పుడు పరిశీలిస్తామని, జాప్యం జరగకుండా చర్యలు తీసుకుంటామని అన్నారు.
    సమష్టితత్వంతోనే నాలుగు విజయాలు
    సమష్టితత్వం, పరస్పర సమన్వయంతో ఈ రెండేళ్లలో నాలుగు గొప్పవిజయాలు సాధించామని ముఖ్యమంత్రి తెలిపారు. 1)హుద్ హద్ తుపాన్,2) గోదావరి పుష్కరాలు, 3)కృష్ణా పుష్కరాలు,4) పంట రక్షక తడులు మిషన్ వన్ లో వివిధ శాఖల సమన్వయంతో, ప్రజా సహకారంతో విజయం సాధించామన్నారు.

    నూరు శాతం సంతృప్తి
    మూడింటిలో ప్రజలలో 95% సంతృప్తిరాగా, పంట రక్షకతడులు అందించడంలో మాత్రం 100% సంతృప్తి వచ్చిందన్నారు. వ్యవసాయ శాస్త్రవేత్తలు, వాతావరణ నిపుణులు రేపటినుంచి వర్షాభావ పరిస్థితులను ముందస్తుగా విశ్లేషించాలని, ‘రియల్ టైమ్ అనాలిసిస్’ చేయాలని ఆదేశించారు. మండలాలలో అదనపు రెయిన్ గేజ్ లను నెలకొల్పే అంశం పరిశీలించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కోరారు. ప్రస్తుతం ఉన్న ‘రెయిన్ గేజ్’ లు సక్రమంగా పనిచేస్తోంది లేనిది ఎప్పటికప్పుడు తనిఖీలు చేయాలన్నారు.

    0 1475
    ????????????????????????????????????

     

    Vijayawada: Minister for Information and Public Relations Palle Raghunatha Reddy said that the state government is ahead in implementing various welfare programmes despite of financial crisis. He expressed confidence that the state would achieve first place in the country by 2029. Inaugurating I&PR Minister’s chamber at fourth block in new secretariat complex in Velagapudi village today, the minister said that the state government is successful in winning the confidence of farmers, as Chief Minister N Chandrababu Naidu, camping in Anantapur personally monitored the dry spell mitigation programme to save crops in lakhs of acres. Commissioner, I&PR S Venkateswar, director of cultural affairs D Vijaybhaskar, Secretary Minority welfare P Ushakumari and Commissioner, Minority welfare Md Iqbal were present. Photo: Minister for Information and Public Relations Palle Raghunatha Reddy offering puja before inaugurating Minister’s chamber at new secretariat complex at Velagapudi village on Friday.

    STATE NEWS

    0 4334
    ‘యుఎస్‌ఐబీసీ ట్రాన్స్‌ఫోర్మెటివ్ ఛీఫ్ మినిస్టర్’ చంద్రబాబు కాలిఫోర్నియాలో మే8న ప్రదానం అమరావతి :  ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు మరో ప్రతిష్ఠాత్మకమైన అంతర్జాతీయ పురస్కారం లభించింది. యు.ఎస్. ఇండియా బిజినెస్ కౌన్సిల్...