ఎమ్మెల్యే రోజాపై ఏడాది సస్పెన్షన్‌కు సిఫార్సు

ఎమ్మెల్యే రోజాపై ఏడాది సస్పెన్షన్‌కు సిఫార్సు

రోజాపై ఏడాది సస్పెన్షన్‌కు సిఫార్సు చేసిన కమిటీ

చిత్తూరు జిల్లా నగిరి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా
చిత్తూరు జిల్లా నగిరి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా

వైసీపీ ఎమ్మెల్యే ఆర్కేరోజా, మరికొందరుసభ్యుల వ్యవహారశైలిపై ఏపీ శాసన సభా హక్కుల సంఘం తమవిచారణ పూర్తైన అనంతరం ఏపీ శాసనసభ స్పీకర్‌ కోడెల శివప్రసాదరావుకు నివేదికను సమర్పించగా, కోడెల ఆ నివేదికను సోమవారం సభలో ప్రవేశపెట్టారు. సభాహక్కుల సంఘం నివేదికపై కాసేపట్లో శాసనసభలో చర్చ జరగనుంది. ఎమ్మెల్యే రోజాపై ఏడాదిపాటు సస్పెన్షకు కమిటీ సిఫార్సు చేసింది. విచారణ కమిటీ ఎదుట ఏదో ఒక సాకు చూపి రోజా గైర్హాజరవడాన్ని కమిటీ తప్పుబట్టింది. జ్యోతుల నెహ్రూ, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డిలపై మందలింపుతో సరిపెట్టాలని కమిటీ అభిప్రాయపడింది. కొడాలి నానిపై చర్య తీసుకునే అధికారాన్ని కమిటీ సభకే ప్రతిపాదించింది.

NO COMMENTS

Leave a Reply