మౌలిక వసతుల కల్పనతో మారనున్న నవ్యాంధ్ర ముఖచిత్రం

మౌలిక వసతుల కల్పనతో మారనున్న నవ్యాంధ్ర ముఖచిత్రం

ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు
ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు

ఇన్‌ఫ్రా ప్రాజెక్టులతో ఇండియాలో నెంబర్‌వన్

సమీక్షా సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు

ఆంధ్రప్రదేశ్‌లో పెద్దఎత్తున  మౌలిక సదుపాయాలను కల్పించడం ద్వారా భవిష్యత్ లో  అన్నారు.   రాష్ట్ర ముఖచిత్రమే మారిపోతుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు.  రాష్ట్రంలో  చేపట్టిన ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులన్నీ సకాలంలో పూర్తయ్యేలా క్షేత్రస్థాయిలో పర్యవేక్షించి ఎప్పటికప్పుడు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆయన  అధికారులకు ఆదేశించారు. ఇంధన, సహజవాయు ప్రాజెక్టులు, ఓడరేవులు, అంతర్జాతీయ, దేశీయ విమానాశ్రయాలు, రెండు కొత్త విశ్వవిద్యాలయాలు, అంతర్జాతీయ విద్యాసంస్థలు, కన్వెన్షన్ సెంటర్లు, తొలి దశ ఫైబర్ గ్రిడ్, లాజిస్టిక్ పార్కులు, గ్రీన్ ఫీల్డ్ బీచ్ క్యారిడార్లు, స్పోర్ట్స్ కాంప్లెక్సుల పనుల పురోగతిపై శుక్రవారం మధ్యాహ్నం లేక్‌వ్యూ క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. దేశం యావత్తూ ఇప్పుడు ఏపీ వైపు చూస్తోందని, విభజన దరిమిలా ఈ రాష్ట్రం పడి లేచి ఎలా అభివృద్ధికి బాటలు వేస్తోందో ఆసక్తిగా గమనిస్తోందని సీయం అన్నారు. 13 జిల్లాల సమగ్ర అభివృద్ధికి ఒక నిర్ధిష్టమైన ప్రణాళికతో ముందుకువెళ్తున్నామని, 2022 నాటికి దేశంలోని మూడు అగ్రగామి రాష్ట్రాలలో ఒకటిగా నిలవాలనే లక్ష్యాన్ని సాధించాలంటే మౌలిక సదుపాయల కల్పన కూడా అంతేవేగంగా సాగాలని చెప్పారు.
రాష్ట్రంలో చేపట్టిన ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులపై తొలుత ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి శ్రీ అజయ్‌జైన్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. ఇంధన రంగంలో రానున్న 9 ముఖ్య ప్రాజెక్టుల గురించి వివరించారు. అనంతపురంలో ఎన్టీపీసీ ఆధ్వర్యంలో నెలకొల్పుతున్న 250 మెగావాట్ల సామర్ధ్యం గల సౌర విద్యుచ్ఛక్తి ప్లాంటు తొలిదశ పనులు వచ్చే మాసాంతంలోగా పూర్తవుతాయని తెలిపారు. 750 మెగావాట్ల రెండవదశ పనులకు సంబంధించి టెండర్లను ఆహ్వానించామని, ఇందులో 625 మెగావాట్ల పనులకు మళ్లీ టెండర్లను పిలవడం జరుగుతోందని చెప్పారు. ప్లాంటు కోసం కేటాయించిన ప్రభుత్వ, అస్సెయిన్డ్, పట్టా భూముల్ని ఇప్పటికే ఏపీ సోలార్ పవర్ కార్పొరేషన్‌కు బదలాయించామని తెలిపారు. తాడిపత్రిలో మరో 500 మెగావాట్ల సామర్ధ్యం గల సోలార్ పార్కును ఏపీ జెన్‌కో ఆధ్వర్యంలో నెలకొల్పుతున్నారని అజయ్ జైన్ వివరించారు. ఈ ప్లాంటుకు సంబంధించిన భూ సేకరణ జరుగుతోందని చెప్పారు. జేఎన్‌ఎస్‌ఎం కింద ఎన్టీపీసీ ఆధ్వర్యంలో తలపెట్టిన కర్నూలులోని 1000 మెగావాట్ల సోలార్ పార్కు కోసం 4 సంస్థలు ముందుకొచ్చాయని, ఇందులో సన్ ఎడిసన్ 500 మెగావాట్లు, ఎస్ బీ ఎనర్జీ 350 మెగావాట్లు, అజూర్ పవర్ 100 మెగావాట్లు, అదానీ గ్రూపుకు చెందిన ప్రయత్న కంపెనీ మరో 50 మెగావాట్లు చొప్పున ఇక్కడ విద్యుదుత్పాదనకు ముందుకొచ్చాయని తెలిపారు.

ఏపీ ట్రాన్స్‌కో నిర్వహణలో జరుగుతున్న పనులను ఈ ఏడాది సెప్టెంబరు నాటికి పూర్తిచేస్తామని వివరించారు. ఈ ప్లాంటుకు అవసరమైన భూములను ఇప్పటికే కేటాయించామని, వచ్చే ఏడాది మార్చి నాటికి ప్రాజెక్టు ఆరంభమవుతుందని తెలిపారు.
కడప గాలివీడు, మైలవరంలలో చేపట్టిన సోలార్ పార్కుల పురోగతిని కూడా అజయ్ జైన్ ప్రెజెంటేషన్‌లో వివరించారు. గాలివీడులో 500 మెగావాట్లు, మైలవరంలో 1000 మెగావాట్లు చొప్పున ప్లాంటులను నెలకొల్పుతున్నామని అన్నారు.

గాలివీడులో 1700 ఎకరాల భూమిని ఇప్పటికే కేటాయించామని, మైలవరంలో 6462 ఎకరాలకు మరో 3 మాసాలలో భూసేకరణ పూర్తిచేస్తామని చెప్పారు. ఏపీ జెన్‌కో ఆధ్వర్యంలో కృష్ణాజిల్లా విజయవాడలో, నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో ధర్మల్ ప్లాంట్ల పనులు పురోగతిలో వున్నాయని తెలిపారు. విశాఖపట్నం పూడిమడకలో ఎన్టీపీసీ ఆధ్వర్యంలో చేపట్టిన సూపర్ క్రిటికల్ విద్యుత్ ప్లాంటు నిర్మాణంపై పబ్లిక్ హియరింగ్ నిర్వహించామని, పర్యావరణ అనుమతులకోసం వేచి చూస్తున్నామని, ఉత్పత్తికి అవసరమైన బొగ్గును దిగుమతి చేసుకోవడం లేదా దేశీయ బొగ్గును వినియోగించుకోవడంపై తుది నిర్ణయం తీసుకోవాల్సివున్నదని తెలిపారు.
శ్రీకాకుళం జిల్లా పోలకిలో ఏపీ జెన్‌కో ఆధ్వర్యంలో చేపట్టే ఆల్ట్రా సూపర్ క్రిటికల్ ప్లాంటుపై నెడో డీపీఆర్ సిద్ధం చేస్తోందని, మార్చిలోగా నివేదిక ఇస్తుందని అజయ్ ‌జైన్ తెలిపారు. నరసన్నపేట మండలం పోలకి గ్రామంలో 2400 ఎకరాల స్థలాన్ని ఈ ప్లాంటుకోసం గుర్తించామని వివరించారు. డీపీఆర్, పర్యావరణ అనుమతులు మొత్తం వచ్చాక ప్రాజెక్టుకు సంబంధించిన బిడ్స్ ఆహ్వానిస్తామని అన్నారు.
10 క్లష్టర్లుగా ‘వేస్ట్ టు ఎనర్జీ’ ప్రాజెక్టు

వ్యర్థాల నుంచి ఇంధనాన్ని ఉత్పత్తిచేసే ప్లాంటులను రాష్ట్రంలోని 12 జిల్లాలలో 10 క్లష్టర్లుగా నెలకొల్పుతున్నామని అజయ్‌జైన్ ముఖ్యమంత్రికి వివరించారు. ఈ 10 క్లష్టర్లకు సంబంధించి ఇప్పటికే బిడ్డింగ్ పూర్తయిందని తెలిపారు. విశాఖపట్నంలో 15 మెగావాట్లు, గుంటూరులో 15 మెగావాట్లు, తిరుపతిలో 6 మెగావాట్లు, తాడేపల్లిగూడెంలో 5 మెగావాట్లు, కడపలో 5 మెగావాట్లు, విజయనగరంలో 4 మెగావాట్లు, మచిలీపట్నంలో 4 మెగావాట్లు, అనంతపురంలో 4 మెగావాట్లు, నెల్లూరులో 4 మెగావాట్లు, కర్నూలులో ఒక మెగావాట్ చొప్పున ప్లాంట్లను నెలకొల్పుతారు. వేస్టు టు ఎనర్జీ ప్లాంట్ల నుంచి ఉత్పత్తి అయ్యే విద్యుత్‌కు యూనిట్‌ ఒక్కింటికీ రూ.6.165 నుంచి రూ.7.50 చొప్పున టారిఫ్‌ నిర్ణయించారు.
ఫైబర్ కేబుల్ సర్వీసులు భేష్..
ఇటీవలే ఉత్తరాంధ్రలో ప్రారంభించిన ఆప్టికల్ పైబర్ కేబుల్ ప్రాజెక్టుకు సంబంధించి ప్రజల నుంచి సంతృప్తికర ఫలితాలు వస్తున్నాయని ముఖ్యమంత్రి సంతోషం వెలిబుచ్చారు. రూ.149కే 15 ఎంబీపీఎస్ వేగంతో బ్రాడ్‌బ్యాండ్ అందించడమే కాకుండా కేబుల్ టీవీ ప్రసారాలను, టెలిఫోన్ ద్వారా మాట్లాడుకునే సదుపాయాన్ని అందివ్వడం దేశంలోనే అపూర్వమని అన్నారు. దేశం ఇప్పుడు దీని గురించే మాట్లాడుకుంటోందని, ఏపీ ఈ విషయంలో ఒక రోల్ మోడల్‌గా నిలవడం తనకు గొప్ప సంతృప్తిని ఇచ్చిందని అన్నారు.
ఈ సక్సెస్ స్టోరీకి కొనసాగింపుగా దేశమంతటా సేవల్ని విస్తరించేందుకు అవసరమైన సహాయాన్ని అందివ్వడానికి సంసిద్ధంగా వుండాలని ముఖ్యమంత్రి అధికారులకు చెప్పారు. కేంద్రం దీనిపై మన సహకారాన్ని ఆశిస్తోందని, పైబర్ గ్రిడ్ కార్పొరేషన్‌ను పూర్తిస్థాయి వాణిజ్య సంస్థగా మార్చి మిగిలిన రాష్ట్రాలకు సేవల్ని విస్తరించాలని యోచిస్తున్నామని సీయం తెలిపారు.
ఫైబర్, క్లౌడ్, టవర్ మేనేజ్‌మెంట్ మూడు విభాగాలను ఒకే గొడుగు కిందకు తీసుకురావాలని నిర్ణయించినట్టు ముఖ్యమంత్రి చెప్పారు. క్లౌడ్ డేటాను కూడా ఒక ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌గా గుర్తిస్తున్నామని అన్నారు. ఆప్టిక్ ఫైబర్ కేబుల్ ప్రాజెక్టులో భాగస్వామ్యం అవడానికి నిక్సీ అమెజాన్, మైక్రోసాఫ్ట్ వంటి అంతర్జాతీయ సంస్థలు ముందుకొచ్చాయని, క్లౌడ సర్విస్ పార్ట్‌నర్లుగా చేరేందుకు ఎంఎస్ అజూర్, ఎడబ్లుఎస్, పై డేటా వంటి సంస్థలు ఆసక్తి కనబరుస్తున్నాయని అన్నారు.
ట్రిపుల్ ప్లే పరికరంతోనే విద్యుత్, వాటర్ రీడింగ్ కూడా..
ఫైబర్ కేబుల్ ట్రిపుల్ ఫ్లే డివైస్‌ను విద్యుత్ రీడింగ్, గ్యాస్, వాటర్ మీటర్లకు అనుసంధానం చేయాలని ముఖ్యమంత్రి ఈ సమావేశంలో అధికారులకు సూచించారు. రానున్న రోజులలో ఒకే ఒక్క యుటిలిటీ డివైస్‌తో ఇంట్లోని అన్ని విద్యుత్ ఉపకరణాల రీడింగ్ జరిగేలా చూడాలన్నారు. ఇటు విద్యుత్ మీటర్, అటు వాటర్, గ్యాస్ మీటర్ల రీడింగ్ అంతా ఆప్టిక్ ఫైబర్ కేబుల్ ట్రిపుల్ ప్లే డివైస్ ద్వారా ఆన్‌లైన్‌కు అనుసంధానం చేయాలని చెప్పారు. దీనికోసం అవసరమైన సాంకేతిక పరిశోధన చేయాలని అన్నారు.
ఆప్టికల్ ఫైబర్ కేబుల్ 3 జిల్లాలలో పూర్తయిందని, మిగిలిన జిల్లాలలో ఇప్పటికి 40శాతం పనులు జరిగాయని అజయ్‌జైన్ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువచ్చారు. మొత్తం 23,687 కిలోమీటర్లకు గాను 9675 కిలోమీటర్ల మేర కేబులింగ్ పూర్తయిందని తెలిపారు. పీవోపీ పనులు 2 జిల్లాలలో సంపూర్ణంగా జరిగాయని చెప్పారు. మొత్తం 2,449 పీవోపీలకు గాను 885 పీవోపీలు పూర్తయ్యాయని వివరించారు. ప్రాజెక్టుకు సంబంధించి సర్విస్ ట్యాక్స్ నెంబర్ సమకూరిందని, ఇంటర్నేషనల్ గేట్‌వే సమకూర్చుకోవడం పూర్తయ్యిందన్నారు.

“ఆప్టిక్ ఫైబర్ కేబుల్ ప్రాజెక్ట్ కు జులై లో సర్వీస్ డెలివరి
ఆప్టిక్ ఫైబర్ కేబుల్ ప్రాజెక్టుకు సంబంధించి జులై నాటికి రాష్ట్రమంతటా సర్విస్ డెలివరీ ఆరంభిస్తామని ముఖ్య కార్యదర్శి చెప్పారు. ఈ ట్రిపుల్ ప్లే ప్రాజెక్టులో భాగంగా వున్న టెలిఫోన్ సర్విసులకు ప్రత్యేక నెంబర్ సీక్వెన్స్ ఇస్తున్నారని ఆయన తెలిపారు. ఇలావుంటే, ఈ ఆప్టిక్ ఫైబర్ కేబుల్ ప్రాజెక్టులో భాగస్వామ్యం చేయడం కోసం త్వరలో బ్రాడ్ కాస్టర్లతో ఒక సమావేశాన్ని నిర్వహించాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో తను స్వయంగా పాల్గొని బ్రాడ్ కాస్టర్లకు వున్న సందేహాలను నివృత్తి చేస్తానని తెలిపారు.
ఫ్లోటింగ్ స్టోరేజ్ మరియు రీగ్యాసిఫికేషన్ యూనిట్‌ (ఎఫ్‌ఎస్‌ఆర్‌యూ)కు సంబంధించిన పర్యవరణ అనుమతి (ఈసీ) అందిస్తూ ఫిబ్రవరి 9న లేఖ వచ్చిందని ముఖ్య కార్యదర్శి తెలిపారు. ప్రాజెక్టు జియో టెక్నికల్ సర్వే వర్క్ కోసం సర్విస్ ఆర్డర్ ఇచ్చారని, పోర్టు సర్విస్ అగ్రిమెంట్ తుది దశలో వున్నదని చెప్పారు. 2017 జూన్ నాటికి ప్రాజెక్టు పూర్తవుతుందని, ఎఫ్‌ఎస్‌ఆర్‌యూ వెండర్లతో సంస్థ సాంకేతిక బృందం లండన్‌లో సాంకేతిక వాణిజ్య అంశాలపై చర్చలు జరుపుతోందని తెలిపారు. బిడ్డర్ల నుంచి మొత్తం ఆరు ప్రతిపాదనలు అందాయన్నారు. కాకినాడ-విశాఖపట్నం పైప్‌లైన్ టెండర్ ఈనెల 31న ప్రకటిస్తామని, అలాగే, సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ కోసం ఏప్రిల్ మాసాంతంలోగా టెండర్ ప్రకటన వెలువడుతుందని తెలిపారు.

పైప్‌లైన్ కోసం డిటైల్డ్ రూట్ సర్వే పనులు పురోగతిలో వున్నాయన్నారు. రెవిన్యూ రికార్డులకు సంబంధించిన స్థల పరిశీలన పూర్తయ్యిందని, తూర్పుగోదావరి జిల్లాలోని 4 మండలాలలో మొత్తం 18 గ్రామాలకు సంబంధించిన 😔1) నోటిఫికేషన్ సిద్దమైందని వివరించారు. ఇంకా నేషనల్ బోర్డ్ ఆఫ్ వైల్డ్ లైఫ్ (ఎన్‌బీడబ్లుఎల్) నుంచి క్లియరెన్స్ రావాలంటూ, ఇంకా, గ్యాస్ సరఫరా కాంట్రాక్టు గురించి షెల్ అధికారులతో ముఖ్యమంత్రి ఒక ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించి ప్రాజెక్టు పురోగతిపై చర్చించాలని కోరారు.
ఈ ఏడాది నుంచే 2 వర్శిటీలు ప్రారంభం
అనంతపురం జిల్లా పెనుకొండలో 150 ఎకరాలలో ఎనర్జీ యూనివర్శిటీ, కాకినాడలో 90 ఎకరాలలో లాజిస్టిక్ యూనివర్శిటీ ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నాయని ఈ సమావేశంలో అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. త్వరలో ఈ రెండు యూనివర్శిటీలకు అడ్వయిజరీ బోర్డు ఏర్పాటు చేయాల్సవుందని చెప్పారు.

లాజిస్టిక్ యూనివర్శిటీకి సంబంధించిన అడ్వయిజరీ బోర్డులో రైల్వే, ఎయిర్‌పోర్ట్, పోర్టు, ఇన్‌ల్యాండ్ వాటర్‌ వేస్ రంగాల్లో నిపుణులను ఎంపిక చేయాలని సమావేశంలో నిర్ణయించారు. సర్టిఫికేట్ కోర్సులతో 2017-18 విద్యా సంవత్సరం నుంచే ఈ యూనివర్శిటీలలో కార్యకలాపాలు ప్రారంభం అవుతాయని అధికారులు తెలిపారు. 2118-19 విద్యా సంవత్సరం నుంచి ఎట్టి పరిస్థితుల్లోనూ రెండు విశ్వవిద్యాలయాల్లో పూర్తిస్థాయి బోధన మొదలవ్వాలని సీయం స్పష్టంచేశారు.
రాష్ట్రీయ విమానాశ్రయాల అభివృద్ధికి అధారిటీ
రాష్ట్రంలో అభివృద్ధి చేయనున్న స్థానిక విమానాశ్రయాల కోసం ప్రత్యేక సంస్థను ఏర్పాటుచేయాలని ముఖ్యమంత్రి ఈ సమావేశంలో ప్రతిపాదించారు. ‘ఎయిర్ పోర్టు అధారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్‌’ను ఏర్పాటుచేసి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలలో విమానాశ్రయాల అభివృద్ధి, నిర్వహణ బాధ్యతలను అప్పగించాలని సూచించారు. ఎయిర్‌పోర్ట్ అధారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ద్వారా స్థానిక విమానాశ్రయాలను అభివృద్ది చేయాలని, డొమెస్టిక్ సర్విసులను మరింత పెంచాలని సీయం చెప్పారు. అలాగే, ఎయిర్‌పోర్టు అధారిటీ ఆఫ్ ఆంద్రప్రదేశ్‌లో టూరిజం శాఖను భాగస్వామ్యం చేసి రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయాల్సివుందని అన్నారు.
విశాఖ ఎయిర్‌పోర్ట్ నుంచి దేశంలోని మరిన్ని నగరాలకు కనెక్టివిటీ వుండేలా సర్విసులను పెంచాలని అధికారులను కోరారు. ముఖ్యంగా, కోయంబత్తూర్, రాయ్‌పూర్, గౌహతి నగరాలకు, అలాగే, హాంకాంగ్, లండన్ వంటి అంతర్జాతీయ డెస్టినేషన్లకు సర్విసులు ఆరంభించాలని అన్నారు. అంతర్జాతీయ యాత్రికుల రద్దీ వుండే తిరుపతి విమానాశ్రయం నుంచి మరిన్ని సర్విసులు నడిచేలా చర్యలు తీసుకోవాలని కూడా సీయం ఆదేశించారు.

రాష్ట్రంలోని అన్ని విమానాశ్రయాల్లో నిర్వహణ అత్యద్భుతంగా వుండేలా చూడాలని, అప్పుడే అంతర్జాతీయ పర్యాటకులు వచ్చేందుకు ఆస్కారం వుంటుందని అన్నారు. కొన్ని విమానాశ్రయాల్లో నిర్వహణ ఏమంత గొప్పగా లేదని సీయం ఈ సందర్భంగా గుర్తుచేశారు. ప్రాంతీయ విమానాశ్రయాల నుంచి కనెక్టివిటీ బాగా పెరగాలని అభిప్రాయపడ్డారు. ఎయిర్‌పోర్టు ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను ఆశించిన స్థాయిలో అభివృద్ధి చేస్తేనే మనుగడ వుంటుందని అన్నారు. తిరుపతి తర్వాత అంత విశేషత కలిగిన ఆధ్యాత్మిక ప్రాంతం శ్రీశైలంలో ఒక విమానాశ్రయాన్ని ఏర్పాటుచేసే అంశాన్ని పరిశీలించాలని కోరారు. దగదర్తి, ఓర్వకల్లు స్థానిక విమానాశ్రయాల్ని గ్రీన్ ఫీల్డ్ ఎయిర్‌పోర్టులుగా అభివృద్ధి చేయాలన్నారు.
అలాగే, పుట్టపర్తిలో ఏర్పాటుచేయనున్న ఫ్లయింగ్ స్కూల్‌లో జాతీయ, అంతర్జాతీయ ఫ్లయింగ్ స్కూళ్ల మేనేజ్‌మెంట్లను భాగస్వాముల్ని చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నిర్ధేశించారు.

12 జిల్లాలలొ వ్యర్ధాల ఆధారంగా  ఇంధనం  ఉత్పత్తి చేసే ప్రాజెక్టులు
వ్యర్థాల నుంచి ఇంధనాన్ని ఉత్పత్తిచేసే ప్లాంటులను రాష్ట్రంలోని 12 జిల్లాలలో 10 క్లష్టర్లుగా నెలకొల్పుతున్నామని అజయ్‌జైన్ ముఖ్యమంత్రికి వివరించారు. ఈ 10 క్లష్టర్లకు సంబంధించి ఇప్పటికే బిడ్డింగ్ పూర్తయిందని తెలిపారు. విశాఖపట్నంలో 15 మెగావాట్లు, గుంటూరులో 15 మెగావాట్లు, తిరుపతిలో 6 మెగావాట్లు, తాడేపల్లిగూడెంలో 5 మెగావాట్లు, కడపలో 5 మెగావాట్లు, విజయనగరంలో 4 మెగావాట్లు, మచిలీపట్నంలో 4 మెగావాట్లు, అనంతపురంలో 4 మెగావాట్లు, నెల్లూరులో 4 మెగావాట్లు, కర్నూలులో ఒక మెగావాట్ చొప్పున ప్లాంట్లను నెలకొల్పుతారు. వేస్టు టు ఎనర్జీ ప్లాంట్ల నుంచి ఉత్పత్తి అయ్యే విద్యుత్‌కు యూనిట్‌ ఒక్కింటికీ రూ.6.165 నుంచి రూ.7.50 చొప్పున టారిఫ్‌ నిర్ణయించారు.
ఫైబర్ కేబుల్ సర్వీసులు భేష్..
ఇటీవలే ఉత్తరాంధ్రలో ప్రారంభించిన ఆప్టికల్ పైబర్ కేబుల్ ప్రాజెక్టుకు సంబంధించి ప్రజల నుంచి సంతృప్తికర ఫలితాలు వస్తున్నాయని ముఖ్యమంత్రి సంతోషం వెలిబుచ్చారు. రూ.149కే 15 ఎంబీపీఎస్ వేగంతో బ్రాడ్‌బ్యాండ్ అందించడమే కాకుండా కేబుల్ టీవీ ప్రసారాలను, టెలిఫోన్ ద్వారా మాట్లాడుకునే సదుపాయాన్ని అందివ్వడం దేశంలోనే అపూర్వమని అన్నారు. దేశం ఇప్పుడు దీని గురించే మాట్లాడుకుంటోందని, ఏపీ ఈ విషయంలో ఒక రోల్ మోడల్‌గా నిలవడం తనకు గొప్ప సంతృప్తిని ఇచ్చిందని అన్నారు.
ఈ సక్సెస్ స్టోరీకి కొనసాగింపుగా దేశమంతటా సేవల్ని విస్తరించేందుకు అవసరమైన సహాయాన్ని అందివ్వడానికి సంసిద్ధంగా వుండాలని ముఖ్యమంత్రి అధికారులకు చెప్పారు. కేంద్రం దీనిపై మన సహకారాన్ని ఆశిస్తోందని, పైబర్ గ్రిడ్ కార్పొరేషన్‌ను పూర్తిస్థాయి వాణిజ్య సంస్థగా మార్చి మిగిలిన రాష్ట్రాలకు సేవల్ని విస్తరించాలని యోచిస్తున్నామని సీయం తెలిపారు.
ఫైబర్, క్లౌడ్, టవర్ మేనేజ్‌మెంట్ మూడు విభాగాలను ఒకే గొడుగు కిందకు తీసుకురావాలని నిర్ణయించినట్టు ముఖ్యమంత్రి చెప్పారు. క్లౌడ్ డేటాను కూడా ఒక ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌గా గుర్తిస్తున్నామని అన్నారు. ఆప్టిక్ ఫైబర్ కేబుల్ ప్రాజెక్టులో భాగస్వామ్యం అవడానికి నిక్సీ అమెజాన్, మైక్రోసాఫ్ట్ వంటి అంతర్జాతీయ సంస్థలు ముందుకొచ్చాయని, క్లౌడ సర్విస్ పార్ట్‌నర్లుగా చేరేందుకు ఎంఎస్ అజూర్, ఎడబ్లుఎస్, పై డేటా వంటి సంస్థలు ఆసక్తి కనబరుస్తున్నాయని అన్నారు.
ట్రిపుల్ ప్లే పరికరంతోనే విద్యుత్, వాటర్ రీడింగ్ కూడా..
ఫైబర్ కేబుల్ ట్రిపుల్ ఫ్లే డివైస్‌ను విద్యుత్ రీడింగ్, గ్యాస్, వాటర్ మీటర్లకు అనుసంధానం చేయాలని ముఖ్యమంత్రి ఈ సమావేశంలో అధికారులకు సూచించారు. రానున్న రోజులలో ఒకే ఒక్క యుటిలిటీ డివైస్‌తో ఇంట్లోని అన్ని విద్యుత్ ఉపకరణాల రీడింగ్ జరిగేలా చూడాలన్నారు. ఇటు విద్యుత్ మీటర్, అటు వాటర్, గ్యాస్ మీటర్ల రీడింగ్ అంతా ఆప్టిక్ ఫైబర్ కేబుల్ ట్రిపుల్ ప్లే డివైస్ ద్వారా ఆన్‌లైన్‌కు అనుసంధానం చేయాలని చెప్పారు. దీనికోసం అవసరమైన సాంకేతిక పరిశోధన చేయాలని అన్నారు.
ఆప్టికల్ ఫైబర్ కేబుల్ 3 జిల్లాలలో పూర్తయిందని, మిగిలిన జిల్లాలలో ఇప్పటికి 40శాతం పనులు జరిగాయని అజయ్‌జైన్ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువచ్చారు. మొత్తం 23,687 కిలోమీటర్లకు గాను 9675 కిలోమీటర్ల మేర కేబులింగ్ పూర్తయిందని తెలిపారు. పీవోపీ పనులు 2 జిల్లాలలో సంపూర్ణంగా జరిగాయని చెప్పారు. మొత్తం 2,449 పీవోపీలకు గాను 885 పీవోపీలు పూర్తయ్యాయని వివరించారు. ప్రాజెక్టుకు సంబంధించి సర్విస్ ట్యాక్స్ నెంబర్ సమకూరిందని, ఇంటర్నేషనల్ గేట్‌వే సమకూర్చుకోవడం పూర్తయ్యిందన్నారు.
ఆప్టిక్ ఫైబర్ కేబుల్ ప్రాజెక్టుకు సంబంధించి జులై నాటికి రాష్ట్రమంతటా సర్విస్ డెలివరీ ఆరంభిస్తామని ముఖ్య కార్యదర్శి చెప్పారు. ఈ ట్రిపుల్ ప్లే ప్రాజెక్టులో భాగంగా వున్న టెలిఫోన్ సర్విసులకు ప్రత్యేక నెంబర్ సీక్వెన్స్ ఇస్తున్నారని ఆయన తెలిపారు. ఇలావుంటే, ఈ ఆప్టిక్ ఫైబర్ కేబుల్ ప్రాజెక్టులో భాగస్వామ్యం చేయడం కోసం త్వరలో బ్రాడ్ కాస్టర్లతో ఒక సమావేశాన్ని నిర్వహించాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో తను స్వయంగా పాల్గొని బ్రాడ్ కాస్టర్లకు వున్న సందేహాలను నివృత్తి చేస్తానని తెలిపారు.

2019 జూన్ నాటికి ఫ్లోరింగ్ స్టోరేజ్  యూనిట్

ఫ్లోటింగ్ స్టోరేజ్ మరియు రీగ్యాసిఫికేషన్ యూనిట్‌ (ఎఫ్‌ఎస్‌ఆర్‌యూ)కు సంబంధించిన పర్యవరణ అనుమతి (ఈసీ) అందిస్తూ ఫిబ్రవరి 9న లేఖ వచ్చిందని ముఖ్య కార్యదర్శి తెలిపారు. ప్రాజెక్టు జియో టెక్నికల్ సర్వే వర్క్ కోసం సర్విస్ ఆర్డర్ ఇచ్చారని, పోర్టు సర్విస్ అగ్రిమెంట్ తుది దశలో వున్నదని చెప్పారు. 2017 జూన్ నాటికి ప్రాజెక్టు పూర్తవుతుందని, ఎఫ్‌ఎస్‌ఆర్‌యూ వెండర్లతో సంస్థ సాంకేతిక బృందం లండన్‌లో సాంకేతిక వాణిజ్య అంశాలపై చర్చలు జరుపుతోందని తెలిపారు. బిడ్డర్ల నుంచి మొత్తం ఆరు ప్రతిపాదనలు అందాయన్నారు. కాకినాడ-విశాఖపట్నం పైప్‌లైన్ టెండర్ ఈనెల 31న ప్రకటిస్తామని, అలాగే, సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ కోసం ఏప్రిల్ మాసాంతంలోగా టెండర్ ప్రకటన వెలువడుతుందని తెలిపారు. పైప్‌లైన్ కోసం డిటైల్డ్ రూట్ సర్వే పనులు పురోగతిలో వున్నాయన్నారు. రెవిన్యూ రికార్డులకు సంబంధించిన స్థల పరిశీలన పూర్తయ్యిందని, తూర్పుగోదావరి జిల్లాలోని 4 మండలాలలో మొత్తం 18 గ్రామాలకు సంబంధించిన 😔1) నోటిఫికేషన్ సిద్దమైందని వివరించారు. ఇంకా నేషనల్ బోర్డ్ ఆఫ్ వైల్డ్ లైఫ్ (ఎన్‌బీడబ్లుఎల్) నుంచి క్లియరెన్స్ రావాలంటూ, ఇంకా, గ్యాస్ సరఫరా కాంట్రాక్టు గురించి షెల్ అధికారులతో ముఖ్యమంత్రి ఒక ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించి ప్రాజెక్టు పురోగతిపై చర్చించాలని కోరారు.
ఈ ఏడాది నుంచే 2 వర్శిటీలు ప్రారంభం

పెనేగొండలో ఎనర్జీ యునివర్సిటీ
అనంతపురం జిల్లా పెనుకొండలో 150 ఎకరాలలో ఎనర్జీ యూనివర్శిటీ, కాకినాడలో 90 ఎకరాలలో లాజిస్టిక్ యూనివర్శిటీ ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నాయని ఈ సమావేశంలో అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. త్వరలో ఈ రెండు యూనివర్శిటీలకు అడ్వయిజరీ బోర్డు ఏర్పాటు చేయాల్సవుందని చెప్పారు. లాజిస్టిక్ యూనివర్శిటీకి సంబంధించిన అడ్వయిజరీ బోర్డులో రైల్వే, ఎయిర్‌పోర్ట్, పోర్టు, ఇన్‌ల్యాండ్ వాటర్‌ వేస్ రంగాల్లో నిపుణులను ఎంపిక చేయాలని సమావేశంలో నిర్ణయించారు. సర్టిఫికేట్ కోర్సులతో 2017-18 విద్యా సంవత్సరం నుంచే ఈ యూనివర్శిటీలలో కార్యకలాపాలు ప్రారంభం అవుతాయని అధికారులు తెలిపారు. 2118-19 విద్యా సంవత్సరం నుంచి ఎట్టి పరిస్థితుల్లోనూ రెండు విశ్వవిద్యాలయాల్లో పూర్తిస్థాయి బోధన మొదలవ్వాలని సీయం స్పష్టంచేశారు.
రాష్ట్రీయ విమానాశ్రయాల అభివృద్ధికి అధారిటీ
రాష్ట్రంలో అభివృద్ధి చేయనున్న స్థానిక విమానాశ్రయాల కోసం ప్రత్యేక సంస్థను ఏర్పాటుచేయాలని ముఖ్యమంత్రి ఈ సమావేశంలో ప్రతిపాదించారు. ‘ఎయిర్ పోర్టు అధారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్‌’ను ఏర్పాటుచేసి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలలో విమానాశ్రయాల అభివృద్ధి, నిర్వహణ బాధ్యతలను అప్పగించాలని సూచించారు. ఎయిర్‌పోర్ట్ అధారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ద్వారా స్థానిక విమానాశ్రయాలను అభివృద్ది చేయాలని, డొమెస్టిక్ సర్విసులను మరింత పెంచాలని సీయం చెప్పారు. అలాగే, ఎయిర్‌పోర్టు అధారిటీ ఆఫ్ ఆంద్రప్రదేశ్‌లో టూరిజం శాఖను భాగస్వామ్యం చేసి రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయాల్సివుందని అన్నారు.
విశాఖ ఎయిర్‌పోర్ట్ నుంచి దేశంలోని మరిన్ని నగరాలకు కనెక్టివిటీ వుండేలా సర్విసులను పెంచాలని అధికారులను కోరారు. ముఖ్యంగా, కోయంబత్తూర్, రాయ్‌పూర్, గౌహతి నగరాలకు, అలాగే, హాంకాంగ్, లండన్ వంటి అంతర్జాతీయ డెస్టినేషన్లకు సర్విసులు ఆరంభించాలని అన్నారు. ఇక్కడి నుంచి కౌలాలంపూర్, సింగపూర్, దుబాయ్ వంటి అంతర్జాతీయ నగరాలకు ఇప్పటికే సర్విసులు నడుస్తున్నట్టు అధికారులు తెలిపారు. అంతర్జాతీయ యాత్రికుల రద్దీ వుండే తిరుపతి విమానాశ్రయం నుంచి మరిన్ని సర్విసులు నడిచేలా చర్యలు తీసుకోవాలని కూడా సీయం వారిని ఆదేశించారు. రాజమండ్రి నుంచి ఏప్రిల్ నాటికి నిత్యం చెన్నయ్ నగరానికి సర్విసులు ఆరంభమవుతాయని అధికారులు తెలిపారు. విజయవాడ-హైదరాబాద్ మధ్య మరిన్ని సర్విసుల్ని నడపడానికి స్పైస్ జెట్ సమాయత్తమయ్యిందని చెప్పారు.
ఈ ఏడాది ఎయిర్ ట్రాఫిక్ తిరుపతి విమానాశ్రయం నుంచి 49 శాతం పెరిగిందని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. రాజమండ్రి నుంచి 39శాతం, విశాఖపట్నం నుంచి 62 శాతం, విజయవాడ నుంచి75 శాతం చొప్పున పెరిగిందని అధికారులు తెలియజేశారు. ఏపీలో మొత్తం 60శాతం పెరుగుదల నమోదైతే, అదే దేశం మొత్తం మీద 17శాతంగా వున్నదని తెలిపారు.
రాష్ట్రంలోని అన్ని విమానాశ్రయాల్లో నిర్వహణ అత్యద్భుతంగా వుండేలా చూడాలని, అప్పుడే అంతర్జాతీయ పర్యాటకులు వచ్చేందుకు ఆస్కారం వుంటుందని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా అన్నారు. కొన్ని విమానాశ్రయాల్లో నిర్వహణ ఏమంత గొప్పగా లేదని సీయం ఈ సందర్భంగా గుర్తుచేశారు. ప్రాంతీయ విమానాశ్రయాల నుంచి కనెక్టివిటీ బాగా పెరగాలని అభిప్రాయపడ్డారు. ఎయిర్‌పోర్టు ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను ఆశించిన స్థాయిలో అభివృద్ధి చేస్తేనే మనుగడ వుంటుందని అన్నారు. తిరుపతి తర్వాత అంత విశేషత కలిగిన ఆధ్యాత్మిక ప్రాంతం శ్రీశైలంలో ఒక విమానాశ్రయాన్ని ఏర్పాటుచేసే అంశాన్ని పరిశీలించాలని కోరారు. దగదర్తి, ఓర్వకల్లు స్థానిక విమానాశ్రయాల్ని గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టులుగా అభివృద్ధి చేయాలన్నారు.

అలాగే, పుట్టపర్తిలో ఏర్పాటు చేయనున్న ఫ్లయింగ్ స్కూల్‌లో జాతీయ, అంతర్జాతీయ ఫ్లయింగ్ స్కూళ్ల మేనేజ్‌మెంట్లను భాగస్వాముల్ని చేయాలని ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబునాయుడు నిర్ధేశించారు. తిరుపతి, రాజమండ్రి, విజయవాడ విమానాశ్రయాల విస్తరణ పనుల పురోగతిని వివరించారు. విజయవాడలో తాత్కాలిక టెర్మినల్ భవన నిర్మాణం చురుగ్గా సాగుతోందని అన్నారు. విస్తరణ కోసం అవసరమైన భూమిని గుర్తించడం జరిగిందని, ఏలూరు కాలువ డైవర్షన్ కోసం కూడా భూములను గుర్తించామని తెలిపారు. 450 ఎకరాల భూమిని ల్యాండ్ పూలింగ్ స్కీమ్ కింద బదలాయించామని, మిగిలిన 800 ఎకరాల భూమిని ఏప్రిల్ మాసాంతానికి సమీకరించడం జరుగుతుందని చెప్పారు.
ఇన్‌ల్యాండ్ వాటర్ వేస్‌పై ఐడబ్లుఎఐ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మధ్య ఏప్రిల్ 14న జరిగే మేరిటైమ్ ఇండియా సమ్మిట్-2016లో ఎంవోయూ కుదుర్చుకోబోతున్నట్టు అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మాణాల పురోగతిని కూడా వివరించారు. తిరుపతిలో టీటీడీ, విశాఖలో స్టీల్ ప్లాంట్, పోర్టు ట్రస్టు, ఇతర పారిశ్రామిక సంస్థలను భాగస్వాముల్ని ఈ నిర్మాణాల్లో భాగస్వాముల్ని చేయాలని సమావేశంలో నిర్ణయించారు. అమరావతిలో రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మాణం చేపట్టనున్నారు.
విశాఖపట్నం , కృష్ణపట్నం, కాకినాడల్లో లాజిస్టిక్ పార్కులను ఏర్పాటుచేస్తున్నారు. వాటి పనుల పురోగతిని సమావేశంలో వివరించారు. కాకినాడ నుంచి భోగాపురం వరకు గ్రీన్ ఫీల్డ్ బీచ్ రోడ్ నిర్మాణం చేపట్టాలని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా అధికారులను ఆదేశించారు. టూరిజం క్యారిడార్‌గా నిలిచేలా డైనమిక్‌గా వుండేలా గ్రీన్ ఫీల్డ్ రోడ్డు నిర్మాణం జరగాలని సూచించారు.
రణదీప్ సూడాన్ సహకారం

ఇ-ప్రగతిపై సీఎమ్ సమీక్ష
ఈ సమావేశం తరువాత ఐటీ మంత్రి, ఉన్నతాధికారులు, ముఖ్యులతో ‘ఇ-ప్రగతి’పై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సమీక్షించారు. ముఖ్యంగా ‘పీపుల్ హబ్’ పేరుతో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలు కోసం డిజైన్ చేస్తున్న ఆధార్ బేస్డ్ ఎకో సిస్టమ్ గురించి అధికారులు ముఖ్యమంత్రికి ప్రెజెంటేషన్ ఇచ్చారు. ‘ఇ-ప్రగతి’పై ప్రభుత్వాధికారుల సామర్ధ్యం పెంపు కోసం వచ్చేనెలలో రెండురోజుల శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు అధికారులు ఈ సమావేశంలో తెలిపారు. ప్రజలు శాశ్వతంగా గుర్తుపెట్టుకునే పనులు చేసి ఫలితాలు సాధించాలన్న తపనతో రేయింబవళ్లూ పనిచేస్తున్నానని ముఖ్యమంత్రి అన్నారు. ప్రజలకు మెరుగైన జీవన ప్రమాణాలు అందివ్వడానికి సంతోష సూచికల్ని ముందు పెట్టుకుని లక్ష్యసాధన కోసం అహర్నిశలు శ్రమిస్తున్నానని చెప్పారు.
పారదర్శక విధానాలను అమలు చేసి ప్రభుత్వంలో ఏ స్థాయిలోనూ అవినీతి కనిపించకుండా ప్రయత్నం చేస్తున్నామని, ఇ గవర్నెన్స్ అందులో భాగమేనని ముఖ్యమంత్రి అన్నారు. ఇ-ప్రగతి కార్యక్రమానికి సహకరించాలని ప్రపంచబ్యాంక్‌ ప్రాక్టీస్ మేనేజర్‌గా సేవలందిస్తున్న సీనియర్ ఐఎఎస్ అధికారి రణదీప్ సూడాన్‌ను ముఖ్యమంత్రి కోరారు. గతంలో తనకు తోడుగా సూడాన్ హైదరాబాద్‌లో ఐటీ అభివృద్ధికి సహకరించిన వైనాన్ని ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు.

ఏపీ ప్రభుత్వానికి ఐటీ అంశాలలో సహకరించేందుకు సీనియర్ ఐఎఎస్ అధికారి రణదీప్ సూడాన్ ఈ సమావేశంలోనే తన అంగీకారాన్ని తెలియజేశారు. బ్రాడ్‌బ్యాండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, మొబైల్ నెట్‌వర్క్స్, డిజిటల్ సర్విసెస్, ఐసీటీ ఇండస్ట్రీ అభివృద్ధి కోసం అభివృద్ధి చెందుతున్న దేశాలకు ప్రపంచబ్యాంక్ తరుపున ఈ సీనియర్ ఐఎఎస్ అధికారి పాలసీలను రూపొందిస్తూ వివిధ కార్యక్రమాల్ని అమలుచేస్తున్నారు. సమీక్షా సమావేశాల్లో మంత్రి శ్రీ పల్లె రఘునాధరెడ్డి, కార్యదర్శులు అజయ్‌జైన్, సతీశ్ చంద్ర, సాయిప్రసాద్, రాజమౌళి, ప్రద్యుమ్న, ఉన్నతాధికారులు కమలాకర్ బాబు, ఫణికిశోర్ ప్రభరుతులు పాల్గొన్నారు.

NO COMMENTS

Leave a Reply