ఫిజికల్ లిటరసీతోనే హ్యాపీనెస్ ఇండెక్స్

ఫిజికల్ లిటరసీతోనే హ్యాపీనెస్ ఇండెక్స్

0 757

ఫిజికల్ లిటరసీతోనే హ్యాపీనెస్ ఇండెక్స్
-కళలు, క్రీడలే వెలుతురు గవాక్షాలు
-సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు
ఆనందదాయకమైన సమాజ ఆవిర్భావం కోసం ఫిజికల్ లిటరసీని ఒక ప్రజాఉద్యమంలా ముందుకు తీసుకువెళ్లాల్సివున్నదని ముఖ్యమంత్రి

క్రీడల అభివృద్ధిపై జరిగిన సమావేశంలో మాట్లాడుతున్నా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు
క్రీడల అభివృద్ధిపై జరిగిన సమావేశంలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి నారా  చంద్రబాబు నాయుడు

నారా చంద్రబాబు నాయుడు అభిప్రాయపడ్డారు. క్రీడాశాఖ దీనిపై తక్షణం ఒక కార్యాచరణ రూపొందించాలని, ప్రముఖ క్రీడాకారుడు పుల్లెల గోపీచంద్ దీనిపై చొరవ తీసుకోవాలని ఆయన సూచించారు. శుక్రవారం సాయంత్రం ముఖ్యమంత్రి ఫిజికల్ లిటరసీ కార్యక్రమంపై సమీక్ష జరిపారు.
చదువుసంధ్యలతో పాటు కళలు, క్రీడలు కూడా సమాజానికి వెలుతురు గవాక్షాలని, వీటికి మన సంస్కృతి సంప్రదాయాలను మేళవించి వాటిని సమ్మిళితం చేయడం ద్వారా పిల్లలు, ప్రజలలో ఆసక్తి పెంచేందుకు ప్రయత్నించాలని ముఖ్యమంత్రి నిర్దేశించారు. రాష్ట్ర క్రీడావిభాగం దీనిపై దృష్టి కేంద్రీకరించాలని, విద్యాశాఖతో సమన్వయం చేసుకుని ఈ విద్యా సంవత్సరం నుంచే ఫిజికల్ లిటరసీని గ్రామ, మండల, డివిజన్, జిల్లా, రాష్ట్ర స్థాయిలలో అమలు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. దీనిని విజయవంతం చేసేందుకు విద్యా, క్రీడా, సాంస్కృతిక, దేవాదాయ శాఖలు సమన్వయంతో ముందుకు సాగాలని సూచించారు. అందులో భాగంగా స్థానిక సంప్రదాయ క్రీడలైన కోకో, కబడ్డీ, బిళ్ళంగోడు, ఏడు పెంకులు, వాలీబాల్ తదితర గ్రామీణ క్రీడలకు ఆదరణ కల్పించాలని, దాంతోపాటే కూచిపూడి, యోగా, మెడిటేషన్ లాంటి మానిసికోల్లాస అంశాలను చేర్చాలని చెప్పారు. ఇవన్నీ ప్రజల జీవన విధానంలో అంతర్భాగమయ్యేలా ప్రోత్సహించాలన్నారు. ఇటువంటి విధానాలతో ఆంధ్రప్రదేశ్‌ను హ్యాపీనెస్ ఇండెక్స్‌లో అగ్రభాగంలో నిలపాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి యల్‌వీ సుబ్రహ్మణ్యం, ముఖ్యమంత్రి అదనపు కార్యదర్శి అడుసుమిల్లి రాజమౌళి,  సంధ్యారాణి, కెనడా క్రీడా మానసిక నిపుణుల బృంద సభ్యులు పాల్గొన్నారు.

NO COMMENTS

Leave a Reply