అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణానికి ప్రణాళిక

అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణానికి ప్రణాళిక

0 1068

 
ఆర్ అండ్ బి అధికారులకు ముఖ్యమంత్రి ఆదేశాలు

 

అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణానికి సంబంధించి ప్రణాళికను తయారు చేయాలని ముఖ్యమంత్రి

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు

నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. ఆదివారం రాత్రి సీఎంఓలో రోడ్లు, భవనాల శాఖ పనితీరును సమీక్షించారు. రాష్ట్రంలో రహదారుల విస్తరణ, రెండు వరుసల రహదారులను నాలుగు వరుసల రహదారులుగా మార్చే ప్రక్రియను వేగవంతం చేయాలని కోరారు. రాష్ట్రంలో పన్నెండు వందల ఐదు కిలో మీటర్ల రాష్ట్ర రహదారిని జాతీయ రహదారిగా తయారు చేసే ప్రక్రియను వేగవంతం చేయాలని, త్వరగా పనులను ప్రారంభించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.
విజయవాడ-మచిలీపట్నం నాలుగు లేన్ల రహదారి నిర్మాణాన్ని 18 నెలల్లో పూర్తిచేయాలని కోరారు. అలాగే జాతీయ రహదారి ప్రాధికార సంస్థ ప్రాంతీయ కార్యాలయాన్ని విజయవాడలో ఏర్పాటు చేస్తే రహదారుల విస్తరణ, కొత్త రహదారుల నిర్మాణ పనులు వేగవంతమవుతాయన్నారు. ఇందుకు కృషి చేస్తామన్నారు. విజయవాడ-గుండుగొలను రోడ్డు విస్తరణ పనులను వీలయినంత త్వరగా పూర్తిచేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను కోరారు. రోడ్లు, భవనాల శాఖాధికారులు, కలెక్టరు సమన్వయంతో పనిచేసి పర్యవేక్షించాలని సూచించారు. ఇబ్బందులు ఎదురైతే తన దృష్టికి తేవాలని చంద్రబాబు చెప్పారు.
విశాఖ జిల్లా ఆనందపురం- అనకాపల్లి జాతీయ రహదారి విస్తరణ పనులను వేగవంతం చేయాలని, భూసేకరణ షెడ్యూల్ ను కలెక్టర్ కు అందజేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అత్యధిక ట్రాఫిక్ ఉన్న రెండు లైన్ల జాతీయ రహదారులను 4 లైన్లుగా మార్చే ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. రాష్ట్రం నుంచి 684 కి.మీ రహదారులను భారత జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ(ఎన్ హెచ్ ఏఐ) ద్వారా పూర్తిచేయాలని చంద్రబాబు కోరారు.
రహదారుల సుందరీకరణకు అత్యధిక ప్రాధాన్యతనివ్వాలని, ఇందుకు సవివర పథక నివేదిను సమర్పించాలని కలెక్టర్ ను ఆదేశించారు. పంచాయతీరాజ్ నుంచి ఆర్.అండ్.బీకి బదలాయించిన సుమారు 5 వేల కి.మీ రహదారిని అభివృద్ధి చేసేందుకు అవసరమైన నిధుల సమీకరణకు అందుబాటులో ఉన్న అన్ని మార్గాలను అన్వేషించాలని ఎపీ ఎస్ ఆర్ డీసీకి ముఖ్యమంత్రి ఆదేశించారు.
సమావేశంలో మంత్రులు శిద్ధారాఘవరావు, యనమల రామకృష్ణుడు, పి.నారాయణ, సీఎంఓ ముఖ్యకార్యదర్శి  సతీష్ చంద్ర, సహాయ కార్యదర్శి  అడుసుమల్లి రాజమౌళి, ఆర్ అండ్ బి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి  బి. శ్యాంబాబు తదితరులు పాల్గొన్నారు.

NO COMMENTS

Leave a Reply