చంద్రన్న విజయాలు

చంద్రన్న విజయాలు

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు

 చంద్రన్న విజయాలు

ముఖ్యమంత్రి చంద్రబాబు ఆలోచనలతో …….

విజయ పథంలో పరుగిడుతున్న  

విద్యా వైజ్ఞానిక రంగం

 

నవ్యాంధ్ర ప్రదేశ్ లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సారధ్యంలో విద్యా, వైజ్ఞానిక రంగం కొత్త పుంతలు తొక్కుతొక్కుతూ…అంతర్జాతీయ స్థాయిలో    దూసుకుపోతోంది.     నాణ్యమైన, ఉన్నత విద్యా  ప్రమాణాలతో  ఒక అగ్రగామి  రాష్ట్రంగా  నవ్యాంధ్ర ముందుకు పరుగులిడుతోంది. రాష్ట్ర విభజన తర్వాత ఏర్పాటైన నవ్యాంధ్ర…  విద్యా, వైజ్ఞానిక రంగాలలో పైలెట్ గా ఉండాలన్న లక్ష్య సాధనతో ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రాన్ని “విజ్ఞాన కేంద్రం” గా తీర్చి దిద్దాలని  కంకణం కట్టుకున్నారు.  విదేశీయులంతా మన రాష్ట్రంలో అమలవుతున్న విద్యా విధానంపై ఆసక్తి కనపరిచేలా మన  విద్యా ప్రమాణాలను మరింత మెరుగుపరచాలని ముఖ్యమంత్రి నిర్ణయించి ఆ దిశగా  చర్యలు తీసుకుంటున్నారు. విద్యా రంగంలో మన రాష్ట్రం ఒక నమూనాగా పేరొందాలన్న సత్సంకల్పంతో విద్యాభివృద్ధికి నిరంతరం పాటుపడుతున్నారు.

పునర్విభజన చట్టం ప్రకారం  మనకు కేంద్రం నుంచి రావలసిన ఉన్నత విద్యా సంస్థ లన్నీ  వచ్చేలా కేంద్రంపై గట్టిగా ఒత్తిడి తెచ్చి, విజయం సాధిస్తున్నారు. ఎలక్ట్రానిక్స్ ,  ఐటి  రంగాలలో  ఐదు లక్షలకు  పైచిలుకు  ఉద్యోగాలు కల్పించేదిశాగా కృషి చేస్తున్నారు. “మన ఉద్యోగాలు, మన ఉపాధి” అనే నినాదంతో ఉపాధి మార్గాలు మనమే సృష్టించుకోవాదానికి తీవ్రంగా కృషి చేస్తున్నారు. కొత్త రాష్ట్రంలో ఎన్నో సమస్యలు ఉన్నా ముఖ్యమంత్రి చొరవతో  అభివృద్ధి పథంలో ముందుకు దూసుకెళుతోంది.

రాష్ట్ర   రాష్ట్ర మానవవనరుల అభివృద్ధిశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు నాయకత్వంలో నాలెడ్జ్ స్టేట్ గా, ఎడ్యుకేషన్ హబ్ గా రూపాంతరం చెందుతోంది. అంతర్జాతీయ స్థాయిలో విద్యాలయాలకు ఖ్యాతి తెచ్చేలా ప్రభుత్వం నిరంతరం అనేక చర్యలను చేపడుతోంది. నాణ్యత ప్రమాణాలను పాటించేలా విద్యాసంస్థలను ఆదేశిస్తోంది. అలా చేపట్టని వాటిపై వేటు వేసేందుకు ప్రభుత్వం వెనుకంజ వేయడం లేదు. రాష్ట్రంలో విద్యా ప్రమాణాలు మెరుగు పరిచేందుకు ప్రైవేటు విశ్వవిద్యాలయాలు తీసుకురావాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం ఈ క్రమంలోనే నిర్ణయం తీసుకొంది. ఇదే సందర్భంలో విశ్వవిద్యాలయాల్లో విప్లవాత్మకమైన మార్పులను తీసుకొచ్చేందుకు శ్రీకారం చుట్టింది.  విశ్వవిద్యాలయాలు ఉపాధికి నిలయాలుగా, అంతర్జాతీయ స్థాయిలో పోటీని తట్టుకొనేలా మారాలని  మంత్రి గంటా అధికారులను ఆదేశించారు.

ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం 21 విశ్వవిద్యాలయాలు ఉండగా, ఇందులో ప్రభుత్వ వర్శటీల్లో ఆర్థిక వనరులు, బోధన, బోధనేతర సిబ్బంది, సరైన మౌలిక వసతులు కొన్నింటిలో పూర్తి స్థాయిలో ఉన్నా మరికొన్నింటిలో లేవు. వీటికి  పూర్తి స్థాయిలో మౌలిక సదుపాయాలు కల్పించే దిశగా చర్యలు  చేపడుతోంది. విశ్వవిద్యాలయాలు నాలెడ్జి సెంటర్లు, ఎడ్యుకేషన్ హబ్ లుగా అవతరించాలని    ముఖ్యమంత్రి  చంద్రబాబు పట్టుదలతో కృషి చేస్తున్నారు. అందుకే విశ్వవిద్యాలయాలకు ప్రస్తుత బడ్జెట్లో రూ.1,050.64 కోట్లు కేటాయించారు. ఇందులో పది సంప్రదాయ విశ్వవిద్యాలయాలకు రూ.712.14 కోట్లు కేటాయించి ప్రభుత్వం విద్యపై తనకున్న ప్రాధాన్యాన్ని చాటుకొంది.

విద్యారంగంలో నాణ్యత ప్రమాణాలను మెరుగుపరచడంలో భాగంగా ఖాళీగా ఉన్న వైస్ చాన్సలర్ పోస్టులను ప్రభుత్వం దశలవారీగా భర్తీ చేస్తోంది. ఈ క్రమంలోనే రాయలసీమ, విక్రమసింహపురి, జెఎన్ టియూ –కాకినాడ వర్శిటీలకు వైస్ చాన్సలర్ నియామకం చేపట్టారు. మిగతా వర్శటీలకు కూడా వైస్ చాన్సలర్ లను నియమించేందుకు ప్రభుత్వం సెర్చ్ కమిటీలను ఏర్పాటు చేసింది. సరైన నిర్ణయాలు తీసుకొనేందుకు దోహదపడే పాలకమండళ్లను నియమించేందుకు పూర్తిస్థాయి కసరత్తును కూడా ప్రభుత్వం పూర్తి చేసింది. త్వరలోనే వీటిని భర్తీ చేయనుంది. మరోవైపు కీలకమైన ప్రైవేటు యూనివర్శిటీల ఏర్పాటుకు సంబంధించిన ముసాయిదా బిల్లు కూడా సిద్ధం అవుతోంది. దీనికి సంబంధించి నిపుణుల కమిటీ తుది నివేదిక ఇప్పటికే సమర్పించింది.

విద్యార్థులను సమర్థ మానవ వనరులుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా భారీస్థాయిలో ఉన్నత విద్యపై నిధులు ఖర్చు చేసే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. భవిష్యత్తులో దేశంలోని విద్యార్థులంతా విద్య కోసం ఆంధ్రప్రదేశ్ కు వచ్చేలా విద్యావ్యవస్థను రూపుదిద్దాలన్నదే  ప్రభుత్వం తన ధ్యేయంగా పెట్టుకున్నది.  ఈ ఏడు ఎంసెట్, ఐసెట్, పీజీసేట్, ఇసెట్, ఎడ్సెట్, లాసెట్, పీసెట్ తదితర ప్రవేశపరీక్షలను సైతం   ఆరోపణలకు తావులేకుండా విజయవంతంగా నిర్వహించగ లిగారు. విద్యార్థులను మరింతగా ప్రోత్సహించాలనే ఉద్దేశంతో విద్యారంగంలో ప్రతిభ కనబరిచిన 2374 మంది విద్యార్థులకు ప్రతిభ అవార్డులు అందజేశారు.  ప్రతిభ అవార్డు అందుకొన్న ఒక్కొక్కరికి 20 వేల రూపాయాల నగదుతో పాటు, సర్టిఫికేట్స్ ను అందజేశారు. ట్యాబ్ లు కూడా వీరికి అందజేయనున్నారు.

రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులలో  నైపుణ్యం పెంచడం ద్వారా ఉపాధి అవకాశాలు మెరుగుపరిచే చర్యలు చేపట్టింది. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ ను లాంఛనంగా ఏర్పడింది.  2014-15 సం.నికి గాను 41 కేంద్రాల్లో 5,520 మంది విద్యార్థులకు స్కిల్ డెవలప్ మెంట్ పై శిక్షణ ఇచ్చారు. 120 జవహార్ నాలెడ్జ్ సెంటర్ల ద్వారా 19,256 మందికి కార్పోరేట్ ఉద్యోగాలు పొందే ప్రామాణిక స్కిల్స్ ను నేర్పించారు. ఈ కేంద్రాల పరిధిలో   జాబ్ డ్రైవ్స్ ను నిర్వహించి 4437 మందికి వివిధ కంపెనీల్లో ఉద్యోగవకాశాలు కల్పించారు. ప్రభుత్వ కళాశాలల్లో ఇంగ్లీషు ల్యాబ్ లను ఏర్పాటు చేస్తున్నారు.

ఉన్నత విద్యారంగంలో నవ్యాంధ్ర మన  దేశంలోనే ప్రధాన భూమిక వహించేలా ముఖ్యమంత్రి చంద్రబాబు  చర్యలు తీసుకుంటున్నారు. అందుకే  ఆంధ్రప్రదేశ్ నాలెడ్జ్ మిషన్ కూ  ప్రభుత్వం అంకురార్పణ చేసింది..     ఇందులో భాగంగా కేంద్ర విద్యాసంస్థలతో పాటు ఎడ్యుకేషన్ సిటి అనే వినూత్న పథకాన్ని ప్రభుత్వం అమల్లోకి తీసుకురానుంది. సుమారు 500 ఎకరాలు విస్తీర్ణంలో ఇది ఏర్పాటు కానున్నది.

విదేశీ విద్యాసంస్థలతో వివిధ రకాలైన అంశాలకు సంబంధించి సహకారం తప్పనిసరిగా ఉండటం వల్ల విద్యార్థులకు ప్రయోజనం చేకూరుతుంది. ఎడ్యుకేషన్ సిటీలు ప్రస్తుతం భారతదేశంలో రెండు మాత్రమే ఉన్నాయి. ఒకటి హర్యానా లో ఉండగా, మరొకటి చంఢీఘర్ లో ఉంది. హర్యానాలోని ఎడ్యుకేషన్ సిటీలు కార్యకలాపాలు మొదలుకాగా, చంఢీఘడ్ ఎడ్యుకేషన్ సిటీలు కార్యకలాపాలు మొదలు కావాల్సి ఉంది.

ఇవే కాకుండా రాష్ట్రంలో కొత్తగా 11 ఉన్నత స్థాయి  విద్యాసంస్థల ఏర్పాటులో భాగంగా తమ క్యాంపస్ లను రాష్ట్రంలో ఏర్పాటు చేయదానికి    అవసరమైన్  చర్యలు ఊపందుకున్నాయి  వీటికి సంబంధించి కొన్నింటిలో ఇప్పటికే తరగతులు కూడా తాత్కాలిక భవనాల్లో మొదలయ్యాయి.  కొన్న ప్రధాన సంస్థల వివరాలు…

 విశాఖపట్నంలో ఐఐఎమ్

ఐఐఎమ్ సంస్థను   విశాఖపట్నం కూ దగ్గరలోగంభీరం గ్రామం వద్ద  రాబోతోంది. కేంద్ర మానవవనరనుల అభివృద్ధి శాఖమంత్రి స్మ్రతి ఇరానీ దీన్ని జనవరిలో ప్రారంభించారు. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో 2015-16 విద్యా సంవత్సరానికి గాను తాత్కాలికంగా తరగతులు ప్రారంభమయ్యాయి.  బెంగళూరు ఐఐఎమ్ మెంటార్ గా వ్యవహరిస్తోంది.

తిరుపతిలో ఐఐటి

ఐఐటి విద్యా సంస్థను చిత్తూరు జిల్లా తిరుపతి సమీపంలోని మేర్లపాకలో 590 ఏకరాల విస్తీర్ణంలో ఏర్పాటు కానుంది. ప్రస్తుతం దీని భవన నిర్మాణ పనులు చురుకుగా సాగుతున్నాయి. ప్రస్తుతానికి రేణిగుంటలోని కృష్ణతేజ విద్యాసంస్థలో తాత్కాలికంగా తరగతులు ప్రారంభమయ్యాయి. 2015-16 విద్యాసంవత్సరానికి బి.టెక్ (సివిల్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రికల్, మెకానికల్ ఇంజనీరింగ్) నాలుగు బ్రాంచీతో  తరగతులు నిర్వహిస్తోంది. ఐఐటి మద్రాస్ మెంటార్ గా వ్యవహరిస్తోంది.

తిరుపతి వద్ద ఐఐఎస్ఈఆర్ సంస్థ

 

చిత్తూరు జిల్లా తిరుపతి సమీపంలో ప్రతిష్టాకరమైన ఐఐఎస్ఈఆర్ సంస్థ ఏర్పాటు కానుంది. ప్రస్తుతానికి అన్నమాచార్య ఇంజనీరింగ్ కళాశాలలో దీని తరగతులు ప్రారంభమయ్యాయి. ఐఐఎస్ఈఆర్ పుణే మెంటార్ గా వ్యవహరిస్తోంది.

విజయనగరంలో గిరిజన వర్సిటీ

విజయనగరం జిల్లాలో గిరిజన విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేస్తున్నారు. విజయనగరం జెఎన్ టియూలో ప్రస్తుతానికి తరగతులు నిర్వహిస్తారు. గుర్తించిన కొన్ని కోర్సులను ఆంధ్ర విశ్వవిద్యాలయ ఫ్యాకల్టీ సహకారంతో నిర్వహిస్తారు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో అమరకాంత్ గిరిజన వర్శిటీ మెంటార్ గా వ్యవహరిస్తోంది.

అనంత లో కేంద్రీయ విశ్వవిద్యాలయం

కరువు ప్రాంతమైన అనంతరపురము  జల్లాలో కేంద్రీయ విశ్వవిద్యాలయం ఏర్పాటు కానుంది. అనంతపురంలోని  సెయింట్ మార్టిన్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కళాశాలలో ప్రస్తుతానికి తత్కాలికంగా తరగతులు నిర్వహిస్తారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శటీ మెంటార్ గా వ్యవహరిస్తోంది. స్థల సేకరణ జరుగుతోంది.

ప.గో.జిల్లాలో ఎన్ఐటీ

 

ప్రతిష్టాత్మకమైన నేషనల్ ఇన్సిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సంస్థ తన 31 వ బ్రాంచ్ ని పశ్చిమగోదావరి జిల్లాలోని ఏలూరు దగ్గరలో ఏర్పాటవుతోంది. దీనికోసం 350 ఎకరాలను ప్రభుత్వం సమకూర్చింది. తత్కాలిక తరగతులు సిఆర్ రెడ్డి కళాశాలల ప్రారంభమయ్యాయి. వరంగల్ నిట్ మెంటార్ గా వ్యవహరిస్తోంది.  ముఖ్యమంత్రి చంద్రబాబు  చొరవతో  480 సీట్లు దీనికి కేటాయించారు. ఇంతవరకు ఎన్నడూ దేశంలో తొలిసారి  ప్రారంభమైన నిట్ లలో ఇంత పెద్ద సంఖ్యలో సీట్లను ఇవ్వలేదు.

కర్నూలు లో  ఐఐఐటి

ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించి అత్యున్నతమై ఐఐఐటి సంస్థ క్యాంపస్ కర్నూలు జిల్లాలో ఏర్పాటుకానుంది. కర్నూలు 124 ఇందుకోసం కేటాయించారు. క్యాంపస్ నిర్మాణం అయ్యేంతవరకు తరగతులు ఐఐఐటి(డి అండ్ ఎమ్) కాంచీపురంలో జరగనున్నాయి. తమిళనాడులో ఐఐఐటి(డి అండ్ ఎమ్) కాంచీపురం దీనికి మెంటార్ గా వ్యవహరిస్తోంది.

ఈ విద్యా సంస్థలతోపాటు మరిన్ని  కొత్త విద్యాసంస్థలను కుడా  రాష్ట్రంలో ప్రారంభించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. రాష్ట్రాన్ని విజ్ఞాన కేంద్రంగా తీర్చి దిద్దే    క్రమంలో  విద్యా ప్రమాణాల నాణ్యత విషయంలోనూ రాజీ పడకూడదని ప్రభుత్వం నిర్ణయించింది.  నాణ్యమైన విద్యనందించి తద్వారా దేశ వ్యాప్తంగా ఉన్న విద్యార్థులకు ఆంధ్రప్రదేశ్ ను ప్రధాన కేంద్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా  ప్రభుత్వం  ముందుకుసాగుతోంది. రాష్ట్రంలోని విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడం ద్వారా ఉద్యోగాల్లోనూ రాణించేందుకు ఆయన తీవ్రంగా కృషి చేస్తూ రాష్ట్రంలో విద్యారంగాన్ని పటిష్టం చేస్తున్నారు.

ప్రగతి పదంలో పాఠశాల విద్య

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పాఠశాల విద్యావ్యవస్థలో వినూత్నమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఐఐటి, ఎన్ఐటి, ఐఐఐటి, ఎంసెట్ లాంటి పరీక్షల్లో నెగ్గే విధంగా ప్రభుత్వ పాఠశాలల్లో చదివే 8,9,10 వ తరగతి విద్యార్థులకు ఫౌండేషన్ కోర్సును అందించనున్నాం. అత్యున్నత పోటీ పరీక్షలను సమర్థవంతంగా ఎదుర్కొని రాణించేందుకు ఈ కోర్సు పాఠశాల  స్థాయిలోనే పునాది వేస్తుంది. ప్రైవేటు, కార్పోరేట్ విద్యాసంస్థల్లో శిక్షణ పొందలేని  ఆర్థికంగా వెనుకబడిన వారికి ఇది ఎంతగానో దోహదపడుతుంది. 2016-17 విద్యాసంవత్సరానికి తొలి విడతగా పైలెట్ ప్రాజెక్టు ప్రాతిపదికన విశాఖ పట్నం జిల్లాలోని 50 ప్రభుత్వ పాఠశాలల్లో ఈ పథకాన్ని అమలు చేయబోతున్నారు. ఈ ఫౌండేషన్ కోర్సుకు ఒక్కో పాఠశాల నుంచి 100 నుంచి 120 మంది విద్యార్థులను ఎంపిక  చేస్తారు.   సంబంధిత పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఫౌండేషన్ కోర్సు కో-ఆర్డినేటర్ గా వ్యవహరిస్తారు. ఆయా జిల్లాల్లో ఈ కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించే బాధ్యత డిఈఓలదే భాద్యత.

 

ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలలను  ఉదయం 9 గంటల   నుంచి సాయంత్రం 4.15 గంటల వరకు నిర్వహిస్తున్నారు. అందువల్ల  ఫౌండేషన్ కోర్సులను నిర్వహించేందుకు, ప్రస్తుత షెడ్యూల్ దెబ్బతినకుండా ఉదయం 7 గంటల నుంచి 9 గంటల వరకు  పెట్టారు. సాయంత్రం 5.15 నుంచి 7 గంటల దాకా ఫౌండేషన్ కోర్సు ఉంటుంది. 4.15 నుంచి 5.15 వరకు  60 నిమిషాల పాటు యోగా, స్పోర్ట్స్ అండ్ గేమ్స్ ఉంటాయి. ఫిజికల్ అండ్ నేచురల్ సైన్స్ ,  గణితం, ఆంగ్లంలో ప్రావీణ్యత కలిగిన అధ్యాపకులు బోధించేందుకు ప్రతి పీరియడ్ కు రూ.250 ల రెమ్యూనరేషన్ ఇస్తున్నారు.

ప్రతి స్కూల్ కు ఈ ప్రత్యేక ఫౌండేషన్ కోర్సు నిర్వహించేందుకు నాలుగు తరగతులకు గాను మొత్తం రూ.1000లు రోజూకు ఖర్చవుతుంది. పైలెట్ ప్రాతిపదికన 50 స్కూళ్లకు మొత్తం రొజుకు 50 వేల రూపాయాలు అదేవిధంగా 220 పని రోజులకు మొత్తం 11 కోట్ల రూపాయాలు ఇందుకు ఖర్చవుతుంది. ఇందుకోసం పాఠశాల విద్యాశాఖ బడ్జెట్ నుంచి నిధులు విడుదల చేయాల్సి ఉంటుంది. వేసవి సెలవుల్లో కూడా ఈ ఫౌండేషన్ కోర్సును ఒక సెషన్ నిర్వహించాలని ప్రభుత్వం ప్రణాళికలు వేస్తోంది.

విద్యార్థుల ముందు తరగతుల అకడమిక్ రికార్డులు, ఫౌండేషన్ కోర్సుల్లో చేరేందుకు వారి సమ్మతి మేరకు ప్రకారం విద్యార్థుల ఎంపిక జరుగుతుంది. ఎంపిక చేసిన విద్యార్థులకు మధ్యాహ్న భోజనంతో పాటు అదనంగా ఉదయం, సాయంత్రం స్నాక్స్ అందిస్తారు.  ఇందుకు ఏడుకోట్లు  ఖర్చు కానుంది.  ఈ ఫౌండేషన్ కోర్సునే రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్ర ప్రదేశ్ ఆశ్రమ విద్యా సంస్థల పరిధిలోని  జూనియర్ కళాశాలల్లో రానున్న విద్యా సంవత్సరంలో ప్రవేశ పెట్టాలని యోచిస్తోంది.

ఉర్దూ విశ్వవిద్యాలయం

ముస్లింలు అన్ని రంగాల్లోఎదిగేందుకు, వారిని ప్రదాన స్రవంతి  కోర్సుల్లో తీసుకొచ్చేందుకు,  హ్యుమానిటీస్, సోషియల్ సైన్స్, కామర్స్, సైన్స్, టెక్నికల్ , ప్రొఫెషనల్ తదితర కోర్సుల్లో ముస్లింలు రాణించేందుకు ఉర్దూ విశ్వవిద్యాలయం దోహదం చేయనుంది. కర్నూలు, కడప, అనంతపురం, గుంటూరు జిల్లాలో ఎక్కువ శాతం ఉన్న ముస్లింలకు అందుబాటులో ఉండేలా ఉర్దూ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి నిర్ణయించడం అభినందనీయం.   ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడిన ఉర్దూ మీడియం విద్యార్థుల ఎదుగుదలకు ఈ వర్శటీ ఎంతగానో దోహదపడనుంది. సంప్రదాయ, సంప్రదాయేతర కోర్సులను చదవిన వారికి కూడా ఇది ప్రధాన స్రవంతి విద్యను అందివ్వనుంది. ముస్లింలకు ఈ వర్శటీ ద్వారా ప్రధాన స్రవంతి విద్య అందివ్వడం వల్ల వారి సామాజిక, ఆర్థిక పరిస్థితులు ఘణనీయంగా మెరుగవుతాయి.

కర్నూలులో వర్శటీ తాత్కాలిక భవనాలు

ప్రభుత్వం 2016-17 విద్యా సంవత్సరం నుంచే ఈ ఉర్దూ  వర్శటీని ప్రారంభించేందుకు చక చకా  అడుగులు వేస్తోంది. ఇందుకోసం కర్నూలులోని ఉస్మానియా కళాశాల తాత్కాలిక భవనంగా వినియోగించుకోవాలని నిర్ణయించారు.

= డబ్బీరు రామకృష్ణ పట్నాయక్ ,

అసోషియేట్ ఎడిటర్,

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మాస పత్రిక,

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు
ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు
ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు

హైదరాబాద్.

 

 

 

NO COMMENTS

Leave a Reply