చంద్రన్న విజయాలు

చంద్రన్న విజయాలు


చంద్రన్న విజయాలు

నవ్యాంధ్ర రధసారధి,  నూతన రాజధాని అమరావతి సృష్టికర్త, నవ్యాంధ్ర సమగ్రాభివృద్ధికి, ప్రజల సంక్షేమానికి  నిర్విరామంగా  కృషి చేస్తున్న  నారా చంద్రబాబు నాయుడుకు  అభినందనలు.  ఆయన సారధ్యంలో  గత  రెండేళ్ళ పరిపాలనలో ప్రభుత్వం   సాధించిన విజయాలపై – ఆంధ్రప్రదేశ్ – ప్రభుత్వ మాసపత్రిక సహ సంపాదకుడు  డబ్బీరు రామకృష్ణ  పట్నాయక్ రాసిన ప్రత్యేక కధనం

 

అంతర్జాతీయ పర్యాటకానికి వేదిక కాబోతున్న నవ్యాంధ్ర  

ముఖ్యమంత్రి చంద్రన్న సారధ్యంలో ఇక పర్యాటక వెలుగులు

 

ప్రపంచ స్థాయిలో పర్యాటకులను ఆహ్లాద లోకాల దరి చేర్చేందుకు  నవ్యాంధ్ర ప్రదేశ్ లో  అనేక పర్యాటక ప్రదేశాలున్నాయి. ఒక పక్క భక్తులను అలరించే  పుణ్య క్షేత్రాలు , ఆధ్యాత్మిక దామాలకు కొదవలేదు. రాష్ట్రంలో  54 ప్రధానమైన పర్యాటక కేంద్రాలున్నాయి. నదులు, ఆలయాలు, కళకళలాడే  సాగర తీరాలు, ఆకట్టుకునే ప్రకృతి  అందాలు, వీటన్నింటికీ మించి గణమైన చారిత్రక, సాంస్కృతిక వారసత్వం మనకున్నది.మన భవిష్యత్ పర్యాటక చిత్ర పటంలో మన రాష్ట్రం చంద్రబాబు సారధ్యంలో తిరుగులేని శక్తిగా రూపాంతరం చెందనున్నది. భౌద్ధం విలసిల్లిన నెల మన సొంతం. బుద్ధుడు కాలచక్రాన్నిప్రభోదించిన  “అమరావతి” ప్రజారాజదాని సమీప భవిష్యత్ లో  విశ్వనగరంగా అభివృద్ధి చెందబోతోంది.  అందుకే భౌద్ధ పర్యాటకం నవ్యాంధ్ర ప్రగతిపై అనేక ఆశలు కల్పిస్తోంది.

నాగార్జున సాగర్ (విజయపురి సౌత్) నుంచి శ్రీకాకుళం వరకు బౌద్ధ పర్యాటక అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేసి, ఆ దిశగా ముందడుగు వేస్తున్నారు.  తెలుగు సంస్కృతికి  వన్నెలద్దుతున్న కళాప్రాంగణం కూచిపూడి. నాట్యం నేర్చుకునే చిన్నారులు ఇక్కడ ఆలయంలో గజ్జె కట్టించాలన్న ఆశయంతో  కూచిపూడిలో రాష్ట్ర ప్రభుత్వం నాట్యారామం ఏర్పాటుచేసింది.సందేశాత్మక కళా రూపం కూచిపూడి. ప్రభుత్వ కార్యక్రమాల సందేశాలతో కూడిన సొగసైన నృత్య రూపకాలతో కూచిపూడి కి  ప్రాచుర్యం కల్పించాలని  ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించి ఆ దిశగా చర్యలు తీసుకుంటున్నారు. అలాగే పర్యాటక సాంస్కృతిక శాఖల సమన్వయంతో సంప్రదాయ గిరిజన నృత్యరీతులను  ప్రోత్సహించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఉత్సవాలు, వేడుకల నిర్వహణతో ఈ కోవకు చెందినా కళా రూపాలకూ ప్రాధాన్యం కల్పించాలని నిర్ణయించారు. రాష్ట్రంలో అత్యంత సుందరమైన సాగర తీరాలు కూడా ఉన్నాయి. అంతేగాక పుష్ప వనాల రమణీయ ప్రకృతి మన సొంతం.  పర్యాటక ప్రదేశాలుగా అభివృద్ధి చేయగల  పర్వత శ్రేణులు కూడా ఉన్నాయి.

ఈ నేపధ్యంలో  ముఖ్యమంత్రి  నారా చంద్రబాబునాయుడు  అనేక బృహత్తర  కార్యాచరణ ప్రణాళికలు

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు

అమలు చేస్తూ, పర్యాటక రంగాన్ని శరవేగంతో అభివృద్ధి చేయడానికి కంకణబద్దులయ్యారు. దేశ,విదేశీ పర్యాటకులను పెద్ద ఎత్తున ఆకర్షించేందుకు, భారీ ఎత్తున పెట్టుబడులు సమీకరించేందుకు …   గత రెండేళ్లుగా  అవిశ్రాంతంగా కృషి చేస్తున్నారు.    వృద్ధి రేటులో పర్యాటకాన్ని  ముఖ్యమైన వనరుగా మార్చి, రెండంకెల వృద్ధి రేటును సాధించేందుకు,   అందివచ్చే అవకాశాలన్నీ సద్వినియోగం చేసుకోవడానికి పాటుపడుతున్నారు. అందుకే ముఖ్యమంత్రి సారధ్యంలో మన రాష్ట్రం పర్యాటక రంగంలో పరుగులు పెడుతోంది.

కొన్ని దేశాల ఆర్ధిక వ్యవస్థల రూపురేఖలనే  మార్చేయగల సత్తా ఒక్క పర్యాటక రంగానికే వుంది. అందువల్లే  ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ రంగాన్ని ప్రదాన ఆదాయ వనరుగా గుర్తించి, ఆ మేరకు  పర్యాటక అభివృద్ధికి శతవిదాలా కృషి చేస్తున్నారు. కొత్తగా ఏర్పాటైన నవ్యాంధ్ర ను ఆర్ధిక ఇబ్బందుల నుంచి విముక్తి కలిగించేందుకు పర్యాటక రంగం ఆదాయాన్ని గణనీయంగా పెంపొందించుకోవాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు.   ఈ రంగం సంపద సృష్టికి, ఉపాధి అవకాశాలకు ఎన్నో ఆశలు కల్పిస్తోంది. నవ్యాంధ్ర లో అనేక భిన్నమైన పర్యాటక ప్రదేశాలు ఉండడం వల్లే దేశ, విదేశీ యాత్రీకులను ఎంతగానో ఆకర్షిస్తోంది.

రాష్ట్ర వృద్ధి రేటులో పర్యాటక రంగాన్ని కీలకమైన వనరుగా తీర్చి దిద్దాలని ముఖ్యమంత్రి  కంకణం కట్టుకున్నారు. ఇందుకోసం కల్చర్, ఫుడ్, హ్యాండీక్రాఫ్ట్స్ వంటి ఆకర్షణలతో నవ్యాంధ్ర ను  ఒక  ప్రఖ్యాత పర్యాటక గమ్యస్థానంగా రూపుదిద్దాలని ముఖ్యమంత్రి ఇటీవల సంబంధిత  అధికారులకు మార్గనిర్దేశం చేశారు.
రాష్ట్రంలోని పర్యాటక ఆకర్షణీయ ప్రాంతాలను ఐదు హబ్‌లుగా విభజించి సమర్ధులైన ఐదుగురు అధికారులను బాధ్యులుగా నియమించారు. దీంతో రాష్ట్ర పర్యాటక రంగానికి మరింత జవసత్వాలు కల్పించినట్టయ్యింది.     ఏడాది తిరిగేసరికి రాష్ట్ర పర్యాటక రంగం గురించి దేశమంతటా మాట్లాడుకునే స్థాయిలో అభివృద్ధి జరగాలని  ముఖ్యమంత్రి పట్టుదలతో కృషి చేస్తున్నారు. పర్యాటకానికి ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యం వల్ల రాష్ట్రవ్యాప్తంగా మరిన్ని స్టార్ హోటళ్లు వస్తున్నాయి. పర్యాటక అవసరాలకు తగినట్టుగా హోటల్ గదులు పెద్దసంఖ్యలో పెరగబోతున్నాయి. హాస్పటాలిటీ ఒక ముఖ్య ఆదాయ వనరుగా మార్చుకోవాలని , శ్రీలంక తరహా ఆతిధ్య సేవలు రాష్ట్రానికి పరిచయం చేయాలని, అలాగే  పేయింగ్ గెస్టు కల్చర్‌ను అలవాటు చేసేలా ప్రోత్సహించాలని    ముఖ్యమంత్రి నిర్ణయించారు.

యాత్రీకుల భద్రత కోసం ప్రత్యేకంగా ప్రత్యేక పోలీసు దళాన్ని ఏర్పాటు చేసే దిశగా అడుగులు వేస్తోంది. ఈ సందర్భంగా తమకు  సరైన భద్రతా ఉందన్న భరోసా… యాత్రీకుల్లో కలిగించేందుకు పకడ్బ౦దీ చర్యలు చేపడుతున్నారు. ఇందుకోసం ప్రత్యేక పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకుంటున్నారు. 24×7 కాల్ సెంటర్లు కూడా నెలకొల్పబోతున్నారు. నవ్యాంధ్ర లో పర్యాటకాభివృద్ధి కోసం   అందిస్తున్న  అనేక నూతన  ప్రోత్సాహక విధానాలతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాబోయే నాలుగేళ్ళలో  రూ.10వేల కోట్లు పెట్టుబడుల సమీకరణ లక్ష్యంతో  ప్రణాళికలు సిద్ధం చేసి అమలు దిశగా దూసుకుపొతున్నారు. మన రాష్ట్రం ఒక టూరిజం హబ్ గా అభివృద్ధి చెందబోతోంది. దేవాలయ పర్యాటకానికి  మరింత ప్రాధాన్యం ఇస్తున్నారు. రాష్ట్రంలో ప్రధానమైన దేవాలయాలను  ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నారు. ఇప్పటికే అనేక ప్రణాళికలు అమలుతో ముందడుగు వేస్తున్నారు. మొత్తం మీద ఈ పర్యాటక ప్రాజెక్టుల అభివృద్ధి కోసం  వచ్చే 2029నాటికి   రూ. 20 కోట్లకు పెట్టుబడులు  పెరిగేలా ప్రణాళికల అమలుకు శ్రీకారం చుట్టారు.

తొలిదశలో రూ. 2,933తో 160 ప్రాజెక్టులు  

ఇప్పటి వరకు వివిధ రకాలైన  160 పర్యాటక  ప్రాజెక్టులకు పెట్టుబడులు పెట్టేందుకు ప్రతిపాదనలు రాగా, వీటిలో రూ.2,933కోట్ల మేరకు ప్రాజెక్టుల పనులు మొదలయ్యాయి. వీటిలో కొన్ని పూర్తి కావడానికి సిద్ధంగా ఉన్నాయి.  వీటి పురోగతిపై ముఖ్యమంత్రే స్వీయ పర్యవేక్షణ చేయడం అభినందనీయం. కాగా ప్రభుత్వ రంగానికి సంబంధించి 92ప్రాజెక్టులు దాదాపు పూరతి కావడానికి సిద్ధంగా ఉన్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యాటక  అభివృద్ధిపై ప్రత్యెక దృష్టి పెట్టడం వల్ల స్వదేశీ పర్యాటకుల సంఖ్య ఈ ఏడు 36.7 మిలియన్లకు పెరిగింది. అంటే 45 శాతం వృద్ధిని సాధించగలిగారు. అదే విదేశీ పర్యాటకుల సంఖ్య ఈ ఏడాదికి 26వేల నుంచి 47వేలకు అంటే 81 శాతం పురోగతి సాధించారు. పెరుగుతన్న యాత్రీకుల రద్దీని దృష్టిలో పెట్టుకుని పబ్లిక్, ప్రైవేట్ బాగాస్వామ్యంతో ఇంకా అనేక రకాల నక్షత్ర హోటళ్లు, రిసార్టులు, ఇతర పర్యాటక కేంద్రాలు  రాబోతున్నాయి. మొత్తం మీద ఈ రంగంలో జీఎస్ డిపి  రూ.7 వేల కోట్ల నుంచి రూ.40వేల కోట్లకు వృద్ధి చెందే దిశగా మన రాష్ట్రం ముందడుగు వేస్తోంది.

మరో ఆరు బీచ్ లు 

విశాఖపట్నంలో  ప్రస్తుతం ఉండే  బీచ్‌ల తో పాటు కొత్తగా మరో ఆరు  బీచ్‌లను అభివృద్ధి చేయాలని  ముఖ్యమంత్రి నిర్ణయించారు. విశాఖపట్నంలో రెండు అతిపెద్ద టూరిజం ప్రాజెక్టులు నెలకొల్పాలని ప్రభుత్వం నిర్ణయించింది.  ట్రైబల్ మ్యూజియం అన్నిహంగులతో సిద్ధంగా వుండగా, ఐఎన్ఎస్ విరాట్ త్వరలో రాష్ట్రానికి వస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. విశాఖపట్నంలోని కంభాలకొండ, కైలాసగిరి ప్రాంతాలను హిల్ స్టేషన్లుగా, సాహసక్రీడలకు అనువైన ప్రాంతంగా తీర్చిదిద్దాలని సీయం  అధికారులకు నిర్దేశించారు.
శ్రీశైలంలో టైగర్ సఫారీ, కుప్పంలో ఎలిఫెంట్ సఫారీ, నేలపట్టు, కొల్లేరు, పులికాట్ వంటి ప్రాంతాలలో బర్డ్స్ శాంక్చురీలను అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.

జల పర్యాటకం పై ప్రత్యేక దృష్టి

జల పర్యాటక అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. దిండి, పాపికొండలు, భవానీద్వీపం తదితర నదీ ప్రాంతాలలో ఇప్పటికే హౌస్ బోట్ల సర్వీసులు  నడుపుతున్న విషయం తెలిసిందే. భవిష్యత్తులో వీటి సంఖ్య మరింత పెంచదానికి ముఖ్యమంత్రి కృషి చేస్తున్నారు. గోదావరి తీరంలో నిత్యహారతి కార్యక్రమాన్ని మరింత శోభాయమానంగా, పవిత్రంగా నిర్వహించాలని, అలాగే, నెల్లూరులో రొట్టెల పండగను పర్యాటకశాఖ తరుపున ఘనంగా జరపాలని ప్రభుత్వం నిర్ణయించి, ఆ మేరకు ముందడుగు వేస్తున్నది. తూర్పు గోదావరి జిల్లా, రాజమండ్రిలో రోడ్ కమ్ రైల్ వంతెనకు అత్యాధునిక ఎల్ఈడీ లైటింగ్ సిస్టమ్‌ను అమర్చి పర్యాటక ఆకర్షణీయంగా మలచాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. రాజమండ్రిలో నిరుపయోగం వున్న హావలాక్ బ్రిడ్జిని అప్పగించడానికి భద్రతా కారణాల దృష్ట్యా రైల్వేశాఖ అంగీకరించడం లేదని అధికారులు చెప్పగా, తాను రైల్వేమంత్రితో మాట్లాడతానని ముఖ్యమంత్రి భరోసా ఇచ్చారు.

ఫుడ్ కల్చర్ పై  ప్రత్యేక దృష్టి

రాష్ట్రంలో అతిముఖ్యమైన ఆకర్షణీయ అంశంగా వున్న ఫుడ్ కల్చర్‌ను పర్యాటక శాఖ ప్రత్యేక దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.  ప్రతి ప్రాంతంలో ప్రత్యేకంగా వుండే వంటకాలను అన్ని ప్రాంతాలకు పరిచయం చేసి ఇకనుంచి జరిగే ప్రతి ఈవెంట్‌లోనూ ఫుడ్ ఫెస్టివల్ నిర్వహించాలని ఆయన ఆదేశించారు.  అన్ని హోమ్ సైన్స్ కళాశాలల్లో వంటల పోటీలు నిర్వహించాలని సూచించారు. విస్తృత ఉపాధి అవకాశాలు వున్న పాకశాస్త్ర రంగంలో కళాశాల విద్యార్థిని విద్యార్థులను ప్రోత్సహించాలని, యువకుల్లో నలభీములు తయారయ్యేలా వారిలో కుకింగ్ హాబీ ప్రోత్సహించాలని నిర్ణయించారు.  విజయవాడ, విశాఖపట్నం లలో ఈట్ స్ట్రీట్స్ ఏర్పాటుచేయాలన్నారు. స్థానిక వంటల నుంచి అంతర్జాతీయ వంటల వరకు అన్ని రకాల ఫుడ్స్ అందుబాటులో వుండేలా చూడాలని నిర్ణయించారు.

గిరిజన సంప్రదాయ నృత్యాలకు ప్రాధాన్యం
ప్రతి ఈవెంట్‌లో గిరిజన సంప్రదాయ నృత్యాలు, కూచిపూడి నృత్యరీతులు వుండేలా ఏర్పాట్లు చేసుకోవాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.  ప్రతి విద్యాలయాల్లో కూచిపూడిని పాఠ్యాంశంగా చేర్చాలని సూచించారు. అలాగే, హస్తకళలకు సొంతమైన ఏపీలో లభించే నర్సాపురం లేసులు, ఉప్పాడ చీరలు, మంగళగిరి చేనేత వస్త్రాలు, ఏటికొప్పాక, కొండపల్లి బొమ్మలకు అంతర్జాతీయ ప్రాచుర్యం కల్పించాలని చంద్రబాబు నిర్దేశించారు. ఉప్పాడ చీరలు లక్షన్నర దాటి ఖరీదు చేస్తున్నాయి. అలాగే  మంగళగిరి చీరను పశ్చిమబెంగ ముఖ్యమంత్రి మమతా బెనర్జీలాంటివారు ధరిస్తున్నారంటే  మన చీరాల ఉత్పత్తికి బయట కూడా ఎంత గిరాకీ ఉన్నదో అర్ధమవుతోంది.

విశాఖపట్నం  జూ అభివృద్ధికి చర్యలు 

విశాఖపట్నం, తిరుపతిలో ప్రస్తుతం జంతు ప్రదర్శనశాలలను మరింత ఆకర్షణీయంగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. నూతన రాజధాని అమరావతి ప్రాంతంలో మరో జంతుప్రదర్శనశాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ప్రతిపాదించారు. విశాఖపట్నం , తిరుపతి, అమరావతి నగరాల్లో బొటానికల్ గార్డెన్లను నెలకొల్పాలని  అధికారులకు  ఆయన  సూచించారు. అన్నవరం ప్రాంతాన్ని వెడ్డింగ్ డెస్టినేషన్ టౌన్‌గా తీర్చిదిద్దాలని, అక్కడ నోచుకునే సత్యనారాయణ వ్రతాలకు ఉత్తర భారతదేశంలో కూడా ప్రాచుర్యం కల్పించాలని నిర్ణయించారు. కొండారెడ్డి బురుజు ప్రాంతాన్ని విద్యుత్ వెలుగులతో సుందరీకరించాలని, చంద్రగిరి ఫోర్టులో మరిన్ని ఆకర్షణీయమైన అంశాలను చేర్చి పర్యాటకుల్ని ఆకట్టుకోవాలని నిర్ణయించారు. రాష్ట్రంలోని ప్రతి నగరం, పట్టణ ప్రాంతాలలో ఎమ్యూజ్‌మెంట్ జోన్స్, ఎంటర్‌టైన్‌మెంట్ పార్కుల్ని ఏర్పాటుచేయడానికి  ముఖ్యమంత్రి చంద్రబాబు  కార్యాచరణ చేపట్టారు.

 

NO COMMENTS

Leave a Reply