నవ్యాంధ్ర ప్రతిజ్ఞ కు అంతా సిద్ధం

నవ్యాంధ్ర ప్రతిజ్ఞ కు అంతా సిద్ధం

0 953
Nava Nirmaana Deeksha

‘నవనిర్మాణ దీక్ష’లో ఆంధ్రప్రదేశ్‌ ప్రజలందరినీ భాగస్వాములను చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ సందర్బంగా రాష్ట్ర విభజన వల్ల ఎదుర్కొంటున్న సమస్యలు, రెండేళ్ల పాలనలో సాధించిన విజయాలు, అభివృద్ధి, భవిష్యత్తు ప్రణాళిక తదితర అంశాలపై ఐదు రోజుల పాటు చర్చలు చేపట్టనుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో ఇందుకు అవసరమైన వేదికలను సిద్ధం చేయాలని జిల్లా యంత్రాంగాలను ఆదేశిస్తూ ప్రభుత్వం ఆదివారం ఉత్వర్వులు జారీచేసింది. ఈ సందర్భంగా వివిధ చర్చనీయ అంశాలను ఖరారు చేసింది. జూన్‌ 2న విజయవాడలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రతిజ్ఞతో ‘నవనిర్మాణ దీక్ష’ ప్రారంభం కానుంది. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రజలు ఎక్కడున్నా సరిగ్గా 2వ తేదీ ఉదయం 11 గంటలకు నిల్చొని ఒక్కటిగా ప్రతిజ్ఞ జరిపేలా ఏర్పాట్లు చేయాలని అన్ని జిల్లాల అధికారులను ఆదేశించింది. ఈ సందర్భంగా ప్రజలందరికీ ముందుగానే ప్రతిజ్ఞ పత్రాలను పంపిణీ చేయాలని పేర్కొంది. ఇంటి పెద్దలు.. ఈ ప్రతిజ్ఞ పత్రాన్ని అందుకుని నిర్దేశిత సమయానికి ప్రతిజ్ఞ నిర్వహించే బాధ్యతను తీసుకోనేలా ప్రచారం చేయాలని ఉత్తర్వుల్లో సూచించారు. నవ్యాంధ్ర ప్రతిజ్ఞ కోసం అన్ని శాసనసభ నియోజకవర్గాల్లో తగిన ఏర్పాట్లు చేయడంతోపాటు వేదికల వద్ద ‘నవనిర్మాణ దీక్ష’ అంశంతో ఛాయాచిత్ర ప్రదర్శన కూడా ఏర్పాటు చేయనున్నారు.

నవనిర్మాణ దీక్షలో చర్చించే అంశాలు ఇవే..
జూన్‌ 3: అశాస్త్రీయంగా, ఏకపక్షంగా రాష్ట్రాన్ని విభజించడం వల్ల నవ్యాంధ్రప్రదేశ్‌ ఎదుర్కొంటున్న సమస్యలు.
జూన్‌ 4: రెండేళ్లలో రాష్ట్రంలో ప్రజలు, పాలకులు సాధించిన విజయాలు.
జూన్‌ 5: వ్యవసాయం, అనుబంధ రంగాల్లో సాధించిన ఫలితాలు, అభివృద్ధికి అవసరమైన భవిష్యత్తు ప్రణాళిక.
జూన్‌ 6: పరిశ్రమలు, ప్రభుత్వ సేవలు, నియంత్రణ రంగాల అభివృద్ధికి అవసరమైన ప్రణాళిక.
జూన్‌ 7: గత రెండేళ్లల్లో చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి చర్యలు, భవిష్యత్తు ప్రణాళిక, కార్యక్రమాలు

NO COMMENTS

Leave a Reply