మైనారిటీ సంక్షేమ నిధులు స‌ద్వినియోగం కావాలి

మైనారిటీ సంక్షేమ నిధులు స‌ద్వినియోగం కావాలి

0 1029
Speaker Kodela

స‌భాప‌తి డాక్ట‌ర్ కోడెల శివ‌ప్ర‌సాద రావు

  • ఐటిఐకు త‌క్ష‌ణం టెండ‌ర్లు పిల‌వండి
  • కేంద్ర నిధులు స‌మ‌కూరేలా కార్యచ‌ర‌ణ‌

మైనారిటీ అభివృద్ధి కోసం కేంద్ర రాష్ట్ర ప్ర‌భుత్వాలు అంధిస్తున్న నిధుల‌ను స‌ద్వినియోగం చేసుకుని, అయా వ‌ర్గాల ఉన్న‌తికి తోడ్ప‌డాల‌ని రాష్ట్ర శాస‌న‌ స‌భాప‌తి డాక్ట‌ర్ కోడెల శివ‌ప్ర‌సాద రావు అన్నారు. మైనారిటీల సంక్షేమం కోసం రాష్ట్ర ప‌భుత్వం పెద్ద ఎత్తున నిధులు  వ్యయం చేస్తుంద‌ని,అధికారులు త‌మ వంతుగా స్ప‌ష్ట‌మైన కార్యాచ‌ర‌ణ‌తో ముంద‌డుగు వేస్తే వారు ఎదుర్కుంటున్న స‌మ‌స్య‌ల‌కు శాశ్వ‌త ప‌రిష్కారం ల‌భిస్తుంద‌న్నారు. శ‌నివారం త‌న ఛాంబ‌ర్‌లో మైనారిటీ సంక్షేమ శాఖ అధికారుల‌తో స‌భాప‌తి భేటీ అయ్యారు. ప్ర‌త్యేకించి గుంటూరు జిల్లా న‌ర‌స‌రావు పేట, స‌త్తెనప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గాల‌లో ఈ శాఖ త‌రుపున చేప‌డుతున్న‌ప‌నుల పరోగ‌తిని స‌భాప‌తి స‌మీక్షించారు.

నిధుల‌తో పాటు, అన్ని ర‌కాల అనుమ‌తులు ఉన్న‌ప్ప‌టికీ టెండ‌ర్ల ప్ర‌క్రియ ప‌రంగా జ‌రుగుతున్న ఆల‌స్యంపై స‌భాప‌తి అధికారుల‌ను ప్ర‌శ్నించారు. ప్ర‌త్యేకించి న‌ర‌సారావు పేట‌లో నిర్మించ‌త‌ల‌చిన మైనారిటీ ఐటిఐ, వంద ప‌డ‌క‌ల వ‌స‌తిగృహం నిర్మాణంకు అవ‌స‌ర‌మైన టెండ‌ర్లు త‌క్ష‌ణ‌మే పిల‌వాల‌ని అదేశించారు. వివిధ పాఠ‌శాల‌ల్లో ఈ నిధుల నుండి నిర్మించ ప్ర‌తిపాదించిన అద‌న‌పు త‌ర‌గ‌తి గ‌దుల గురించి డాక్ట‌ర్ కోడెల ఆరా తీసారు. ప‌నుల ప్రారంభ‌మైన చోట వేగంగా ప‌నులు సాగాల‌ని, వ‌ర్షాలు ప్రారంభం అయితే ప‌నులు సాగ‌వ‌ని, ప్ర‌స్తుత వేస‌వి సీజ‌న్‌లో పూర్తి స్ధాయిలో ప‌నులు జ‌ర‌గాల‌ని స్ప‌ష్టం చేసారు.

నిధులు ఉన్న‌ప్ప‌టికీ స్ధ‌లం కేటాయింపు లేక పెండింగ్‌లో  ఉన్న వంద ప‌డ‌క‌ల బాలిక‌ల వ‌స‌తి గృహం నిర్మాణంపై తాను క‌లెక్ట‌ర్‌తో మాట్లాడ‌తాన‌ని, వెంట‌నే స్ధ‌లం కేటాయిస్తార‌ని అధికారుల‌కు తెలిపారు. ఈ నేప‌ధ్యంలో మైనారిటీ సంక్షేమ శాఖ క‌మీష‌న‌ర్ మ‌హ్మ‌ద్ ఇక్బాల్ మాట్లాడుతూ న‌ర‌స‌రావు పేటలో త‌మ శాఖ త‌రుపున చేప‌ట్ట‌ద‌ల‌చిన అద‌న‌పు ప‌నుల కోసం రూ. 300 ల‌క్ష‌ల విలువైన ప్ర‌తిసాద‌న‌లు సిద్దం చేసామ‌ని, ప్ర‌భుత్వం నుండి ప‌రిపాల‌నా ప‌ర‌మైన అనుమ‌తులు వ‌చ్చిన వెంట‌నే ప్ర‌ణాళికా బ‌ద్దంగా ముందుకు వెళ‌తామ‌ని తెలిపారు. గుంటూరు జిల్లాలో దుల్హ‌న్ ప‌ధ‌కం అములు తీరుతెన్నుల గురించి ఆ శాఖ డిప్యూటి డైరెక్ట‌ర్ సుమ‌తీ కుమారి స‌భాప‌తి దృష్టికి తీసుకు వ‌చ్చారు. అద‌న‌పు కార్య‌ద‌ర్శి విధ్యాధ‌ర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నుండి కొన్ని అంశాల‌లో క్లారిఫికేష‌న్ రావ‌ల‌సి ఉంద‌న్నారు.

NO COMMENTS

Leave a Reply