నవ నిర్మాణ వారం ఇలా ఉంటుంది…

నవ నిర్మాణ వారం ఇలా ఉంటుంది…

0 1016

నవ నిర్మాణ వారంపై  ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇందులో ఆయన చెప్పిన వివరాలు:
• 3 వ తేదీ నుంచి 7 వ తేదీ వరకు అన్ని నియోజకవర్గ కేంద్రాలలో వివిధ అంశాలపై సదస్సులు నిర్వహిస్తున్నాం.
• జూన్ 3న ‘అశాస్త్రీయ విభజన, రాష్ట్రంపై దాని ప్రభావం. విభజన తరువాత రాష్ట్రం ఎదుర్కొన్న ఇబ్బందులు’ అనే అంశంపై సదస్సు వుంటుంది.
• జూన్ 4న ‘ప్రతికూల పరిస్థితుల్లో సైతం ప్రజలు, ప్రభుత్వం సమష్టిగా సాధించిన విజయాలు’ అనే అంశంపై సదస్సు వుంటుంది. రాజధాని భూ సమీకరణ, పట్టిసీమ ద్వారా నదుల అనుసంధానం, 24 గంటల నిరంతర విద్యుత్ సరఫరా, సీఐఐ భాగస్వామ్య సదస్సు, ఫైబర్ గ్రిడ్, పారదర్శకంగా పెన్షన్లు, ప్రజాపంపిణీ, ఇంకా అనేక విజయాలపై సదస్సులో మాట్లాడుకుందాం.
• జూన్ 5న ‘వ్యవసాయాన్ని లాభసాటిగా చేసే దిశలో వ్యవసాయం, అనుబంధ రంగాలలో సాధించిన ప్రగతి, భవిష్యత్ కార్యాచరణ’ అనే అంశంపై సదస్సు వుంటుంది. ‘జల వనరులే జాతి సంపద’ అనే స్ఫూర్తితో ప్రాథమిక రంగ మిషన్‌, పొలం పిలుస్తోంది.., నీరు-చెట్టు, వాటర్‌గ్రిడ్ వంటి వినూత్న కార్యక్రమాల విజయాల గురించి చర్చించుకుందాం. అదేవిధంగా ప్రాధాన్య క్రమంలో సాగునీటి ప్రాజెక్టులు, భూసార పరీక్షలు, పంటకుంటలు, అంతర్గత జలరవాణా, వ్యవసాయ అనుబంధ రంగాలైన హర్టీకల్చర్, ఫిషరీస్, యానిమల్ హజ్బెండరీ వంటి అంశాలపై దృష్టిపెట్టాలి.
• జూన్ 6న ‘పరిశ్రమలు, సేవారంగం, రెగ్యులేటరీ సెక్టారులో ప్రగతి, భవిష్యత్ కార్యాచరణ’ అనే అంశంపై సదస్సు వుంటుంది. పరిశ్రమల రంగ మిషన్, మౌలిక సదుపాయాల మిషన్, సేవారంగ మిషన్ వంటి అంశాలపై వివరంగా చర్చించుకుందాం. గ్యాస్ గ్రిడ్, రోడ్ గ్రిడ్, ఫైబర్ గ్రిడ్, విద్యుత్ గ్రిడ్ వంటి అంశాలలో మనం సాధించిన ప్రగతిని విశ్లేషించుకుందాం. అత్యధికమందికి ఉపాధి కల్పించే ఫుడ్ ప్రాసెసింగ్, పర్యాటక, ఆతిధ్య రంగాలపై దృష్టిపెడదాం.
• జూన్ 7న ‘గత రెండేళ్లలో చేపట్టిన సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలు, విజయాలు. రానున్న కాలానికి ప్రణాళిక వ్యూహాలు’ అనే అంశంపై సదస్సు వుంటుంది. సామాజిక సాధికారత మిషన్, పరిజ్ఞాన నైపుణ్యాభివృద్ధి మిషన్, పట్టణాభివృద్ధి మిషన్‌ల గురించి చర్చించుకుందాం. అంతేగాకుండా, బడి పిలుస్తోంది, పేదరికంపై గెలుపు, స్వచ్ఛాంధ్రప్రదేశ్, స్థానిక సంస్థల బలోపేతం వంటి కార్యక్రమాల పురోగతితో పాటు విద్య, వైద్యరంగాలలో మనం తీసుకొచ్చిన ప్రగతి గురించి వివరంగా మాట్లాడుకుందాం.
• ఈ సదస్సులలో ప్రజలంతా పాల్గొని మన సమస్యలు, మన ముందున్న సవాళ్లు, మనకున్న వనరులు ఏంటో వివరంగా చర్చించి కార్య ప్రణాళికలను సిద్ధం చేసుకోవాలి.

NO COMMENTS

Leave a Reply