వరుస భేటీలు, ద్వైపాక్షిక చర్చలు, ఒప్పందాలు

వరుస భేటీలు, ద్వైపాక్షిక చర్చలు, ఒప్పందాలు

వరుస భేటీలు, ద్వైపాక్షిక చర్చలు, ఒప్పందాలు
‘చైనా కన్‌స్ట్రక్షన్ ఫోర్త్ ఇంజనీరింగ్ డివిజన్ కార్పోరేషన్ లిమిటెడ్
పవర్ చైనా, సౌత్ హ్యూటన్, షెలీకో, కెడాక్లీన ఎనర్జీ ప్రతినిధులలో భేటీ
తీరికలేకుండా గడిపిన ముఖ్యమంత్రి చంద్రబాబు

 

 

నవ్యాంధ్ర ముఖ్యమంత్రి

గుయాన్, జూన్ 29: వరుస భేటీలు. ద్వైపాక్షిక చర్చలు, సమాలోచనలు, పెట్టుబడులకు మన రాష్ట్రంలో సానుకూలాంశాలపై ప్రజెంటేషన్లు. వివిధ జిల్లాల్లో ఏఏ ప్రాజెక్టులకు చైనా కంపెనీలు ఏ రకంగా సాయం అందించవచ్చు? ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బుధవారం చైనా పర్యటన ఇదే రీతిలో సాగింది. యాన్‌లో వరల్డ్ ఎకనమిక్ ఫోరం సమావేశాల్లో ఫార్చూన్-500 కంపెనీల్లో 35 వ స్థానంలో ఉన్న ‘చైనా కన్‌స్ట్రక్షన్ ఫోర్త్ ఇంజనీరింగ్ డివిజన్ కార్పోరేషన్ లిమిటెడ్ కంపెనీ ప్రతినిధులు ప్రజెంటేషన్ ఇచ్చింది. ఈ కంపెనీ వార్షిక టర్నోవర్ 1 ట్రిలియన్ డాలర్లు. సదస్సులో చాంగ్ థాయ్ యువాన్ (Chang Tai yuan) బిల్డింగ్ మెటీరియల్స్ గ్రూపు ప్రతినిధులు ప్రెజెంటేషన్ తమ కంపెనీ నాణ్యతా ప్రమాణాలపై ప్రజెంటేషన్ ఇచ్చారు. యంత్రాల తయారీలో విశేషానుభవం ఉన్న KEDA క్లీన్ ఎనర్జీ కంపెనీ ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులకు సంసిద్ధత వ్యక్తం చేసింది. సిరామిక్స్ యంత్రాలు, భవన నిర్మాణ యంత్రాలు, క్లీన్ గ్యాస్, హైడ్రాలిక్ పంపులు, కంపెరెసర్లు, బ్లాస్టు బ్లోయర్లు తయారీలో KEDA క్లీన్ ఎనర్జీ కంపెనీకి 14 ఏళ్ళ అనుభవం ఉంది.
ఏపీ అభివృద్ధిలో ‘పవర్ చైనా’ భాగస్వామ్యం
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి సహకారం అందించటానికి పవర్ కన్‌స్ట్రక్షన్ కార్పొరేషన్ ఆఫ్ చైనా (పవర్ చైనా) ముందుకు వచ్చింది. ఆఫ్రికా, సౌత్ ఈస్ట్ ఆసియా దేశాల్లో చేపట్టిన ప్రాజెక్టులపై కంపెనీ ప్రతినిధులు లఘు చిత్రం ద్వారా సీఎం చంద్రబాబుకి వివరించారు. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలలో డ్యాములు, బ్రిడ్జిలు, రైల్వే లైన్లు, సోలార్, హైడ్రో పవర్ ప్రాజెక్టుల నిర్మాణంలో ‘పవర్ చైనా ప్రసిద్ధి చెందింది.
సీవరేజ్, ట్రీట్‌మెంట్ విభాగాల్లో అగ్రగామిగా ఉన్న సౌత్ హ్యూటన్ కంపెనీ ప్రతినిధి ముందుగా మాట్లాడుతూ తమ ప్రాధాన్యాన్ని వివరించారు. తర్వాత చైనా అల్యూమినియం ఇంటర్నేషనల్ ఇంజనీరింగ్ కంపెనీ షెలీకో (CHALIECO) ప్రతినిధులు తమ కంపెనీ ప్రత్యేకతను, పెట్టుబడుల్లో ఆసక్తిని ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తెచ్చారు.
ఈ పర్యాయం వరల్డ్ ఎకనమిక్ ఫోరం సమావేశాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రధాన ఆకర్షణగా నిలిచారు. పలువురు పారిశ్రామికవేత్తలు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుతో మాట్లాడటానికి ఉత్సాహం చూపించారు. ముఖ్యమంత్రి వెంట మంత్రులు యనమల రామకృష్ణుడు, పి. నారాయణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు డా. పరకాల ప్రభాకర్, ఎకనమిక్ డెవలప్‌మెంట్ బోర్డు సీఈఓ  జె.కృష్ణ కిశోర్, డెవలప్ మెంట్ కమిషనర్, ఎక్స్ అఫీషియో స్పెషల్ చీఫ్ సెక్రెటరీ  పి.వి రమేశ్, ముఖ్యకార్యదర్శులు  జి. సాయిప్రసాద్,  అజయ్ జైన్, పరిశ్రమల శాఖ కార్యదర్శి సాల్మన్ ఆరోకియా రాజ్, , క్యాపిటల్ సిటీ డెవలప్‌మెంట్ అండ్ మేనేజిమెంట్ కార్పొరేషన్ సీఎండీ లక్ష్మీపార్ధసారథి ఉన్నారు.

NO COMMENTS

Leave a Reply