నీళ్లులేక పంటలు ఎండిపోవడం జరగరాదు – ముఖ్యమంత్రి

నీళ్లులేక పంటలు ఎండిపోవడం జరగరాదు – ముఖ్యమంత్రి

0 1319
  • టెలీ కాన్ఫరెన్స్ లో ముఖ్యమంత్రి చంద్రబాబు

 

నీళ్లులేక పంట ఎండిపోవడమనేది ఇకపై మనరాష్ట్రంలో జరగ కూడదని ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు అన్నారు. డ్రైస్పెల్ మిటిగేషన్ పై గురువారం అనంతపురం నుంచి వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాయలసీమలో వర్షాభావ పరిస్థితిని ఆరురోజుల్లో అదుపులోకి తెచ్చామని, సకాలంలో రక్షక తడులిచ్చి పంటలు కాపాడామన్నారు. అవసరాన్ని బట్టి ఆయా ప్రాంతాలలో మరో రెండు, మూడు తడులివ్వాలని ఆదేశించారు.
రెయిన్ గన్ టెక్నాలజీ ద్వారా వ్యవసాయ రంగంలో నూతన శకం ప్రారంభించామని , పంటకుంటలు, ట్యాంకర్లు, ఆయిల్ ఇంజిన్లు, రెయిన్ గన్స్ ద్వారా రక్షక తడులు ఇచ్చి పంటలు కాపాడటం దేశంలోనే సరికొత్త చరిత్రగా ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. పంటలు కాపాడటంలో అన్ని శాఖలు సమన్వయంగా పనిచేయడం శుభ పరిణామం అంటూ దీనిని లాజికల్ గా ముందుకు తీసుకెళ్లాలన్నారు. దేశ,విదేశాలలో దీనిని ఒక రోల్ మోడల్ గా తీసుకుంటారని అభిప్రాయబడ్డారు.
వర్షాభావంలోనూ పంట కాపాడుకునే ధీమా, ధైర్యం రైతులకు వచ్చింది:
పంట పెడితే వర్షాలు లేకున్నా కాపాడుకోవచ్చనే ధీమా, ధైర్యం రైతుల్లో వచ్చింది, ఇందుకు కారకులైన అందరికీ ముఖ్యమంత్రి చంద్రబాబు అభినందనలు తెలిపారు. ఇది నిజంగా అద్భుతమని ప్రశంసించారు. పర్యటనల్లో తాను ఎక్కడకెళ్లినా రైతుల కళ్లల్లో ఆనందం చూస్తున్నానని, తనకు చాలా సంతోషంగా ఉందని అన్నారు. ఎండిపోతున్న పంటలను కాపాడటం చూసి అందరూ ఆశ్చర్యపోయారని, మీడియా కూడా ఆశ్చర్యపోయిందని తెలిపారు. ప్రతిపక్షాల వాళ్లు కూడా ఇకపై నోరు తెరవలేరంటూ, వర్షాభావాన్ని సమర్ధంగా ఎదుర్కొన్నందుకు మీడియా వాళ్లు తనకు ధన్యవాదాలు చెప్పడం గొప్ప విషయం గా పేర్కొన్నారు.
రేపటికల్లా తొలిదశ ఆపరేషన్ పూర్తి:
డ్రైస్పెల్ మిటిగేషన్ తొలిదశ ఆపరేషన్ పూర్తిచేశామని రేపటికల్లా కర్నూలులో ప్రకటిస్తాననని ముఖ్యమంత్రి తెలిపారు. రాయలసీమ నాలుగు జిల్లాలను ఒకదాని తర్వాత మరొకటి ‘‘స్ట్రెస్ ఫ్రీ’’ గా ప్రకటిస్తామన్నారు. డ్రైస్పెల్ మిటిగేషన్, స్ట్రెస్ మేనేజిమెంట్ లో అన్నీశాఖలూ ఒక టీముగా పనిచేసి, అధ్భుత ఫలితాలు సాధించారంటూ, ఈ కృషిలో భాగస్వాములైన అందరికీ అభినందనలు తెలిపారు. ఈ టీం స్పిరిట్ ను భవిష్యత్తులో కూడా కొన సాగించాలన్నారు. ఉత్పాదన పడిపోకుండా ఈవిధంగా రక్షక తడులిచ్చి పంటలు కాపాడటం గొప్ప విషయం అంటూ, ఇతర దేశాలకు కూడా ఇదొక నమూనాగా చెప్పారు.
పంటబీమా పథకంలో మార్పులు రావాలి:
బ్యాంకర్లతో, ఇన్సూరెన్స్ అధికారులతో ఈరోజు సమావేశం అవుతున్నట్లుగా ముఖ్యమంత్రి ప్రకటించారు. పంటబీమా పథకంలో సమూల మార్పులు తీసుకురావాల్సి ఉందంటూ, రైతులకు లాభదాయకంగా ఉండేలా పంటబీమా విధానం ఉండాలన్నారు. కాంట్రాక్టర్ లోపం వల్లనే పంటలు కాపాడటంలో 15రోజులు వెనుకబడ్డామని, ఎక్విప్ మెంట్ సమకూర్చుకోవడంలో కొంత జాప్యం జరిగిందని అంటూ, భవిష్యత్తులో స్ట్రెస్ మేనేజిమెంట్ లో ఈలోపాలు జరగరాదని ముఖ్యమంత్రి హెచ్చరించారు. బాధల్లో ఉన్నప్పుడు తప్పులు ఎక్కువ చేస్తారని, అదే భరోసాగా ఉంటే తప్పులు అనేవి జరగవు అనేదానికి ప్రస్తుతం అనుసరించిన స్ట్రెస్ మిటిగేషన్ ఆపరేషన్ ఒక ఉదాహరణగా పేర్కొన్నారు.
అక్యురసీ, ప్రిడిక్షన్ ఇన్ అడ్వాన్స్ రెండూ అతిప్రధానమైనవి:
అనంతపురం, కర్నూలు,చిత్తూరు, కడప, ప్రకాశం జిల్లాలలో వర్షాలు పడటం శుభపరిణామం అంటూ, అయితే భవిష్యత్తులో స్ట్రెస్ మేనేజిమెంట్ లో మరింత అప్రమత్తంగా ఉండాలన్నారు. వర్షపాతం ముందస్తు అంచనాల్లో ఖచ్చితత్వం ఉండాలని, ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, అక్యురసీ, ప్రిడిక్షన్ ఇన్ అడ్వాన్స్ రెండూ అతి ప్రధానమైనవిగా పేర్కొన్నారు. స్ట్రెస్ ఉన్న ప్రాంతాలలో 100% నాణ్యమైన విద్యుత్ ను 24గంటలు సరఫరా చేయాలని ఆదేశించారు. విద్యుత్ శాఖ అధికారులు, సిబ్బంది ఏమాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించ రాదన్నారు.వ్యవసాయం, అనుబంధ రంగాలు, జలవనరులు, విద్యుత్, రెవిన్యూ, ప్లానింగ్ శాఖల అధికారులంతా కలిసి కూర్చుని స్ట్రెస్ మేనేజిమెంట్ పై ఇప్పటివరకు ప్రభుత్వం చేసినదానిని అధ్యయనం చేయాలన్నారు.భవిష్యత్తులో ఇంకా మెరుగైన నిర్వహణకు కార్యాచరణ ప్రణాళిక సిధ్ధంచేయాలన్నారు.
ఈ టెలీ కాన్ఫరెన్స్ లో వివిధ శాఖల ఉన్నతాధికారులు ధనుంజయరెడ్డి, సంజయ్ గుప్తా,అజయ్ జైన్, శశిభూషణ్, జిల్లాల కలెక్టర్లు, దాదాపు 3వేల మంది అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

NO COMMENTS

Leave a Reply