పట్టణ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున గృహనిర్మాణ ప్రాజెక్టులు

పట్టణ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున గృహనిర్మాణ ప్రాజెక్టులు

0 1982

పట్టణ గృహనిర్మాణంతో జీడీపీ వృద్ధి

  • బలహీనవర్గాలకు గృహనిర్మాణంలో పెద్దపీట
  • పట్టణ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున గృహనిర్మాణ ప్రాజెక్టులు
  • ఎల్&టీ, ఎల్ఈపీఎల్ ల పవర్ పాయింట్ ప్రజెంటేషన్
  • వివరాలు వెల్లడించిన ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు

పట్టణ గృహ నిర్మాణ రంగాన్ని పెద్ద ఎత్తున ప్రోత్సహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో గృహ నిర్మాణ ప్రాజెక్టులను అనుమతించడం ద్వారా జీడీపీ వృద్ధి సాధ్యమవుతుందని ప్రభుత్వం భావిస్తోంది. నూతన సచివాలయంలో గృహనిర్మాణం, ఆర్థికశాఖ పనితీరు, రాబడి, ఖర్చు,  రైతులు, మహిళా సాధికారిత అంశాలపై చర్చించింది. రాష్ట్రంలో పట్టణ గృహ నిర్మాణాన్ని మెరుగుపరచడంతోపాటు, బలహీనవర్గాల వారికి గృహ సముదాయల కోసం పట్టణ మౌలిక సదుపాయాల కల్పన చేయాలని సర్కారు భావిస్తోంది.

గ్రామీణ-పట్టణ జనాభా 50-50 శాతంగా ఉండటం వల్ల వృద్ధి రేటు పెరిగేందుకు అవకాశం ఉంటుందని ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు వివరించారు. సేవల రంగంలో 50 శాతం వృద్ధి పెరగడం వల్ల ఆర్థిక వ్యవస్థ పురోగమిస్తుందన్నారు. పట్టణ జనాభా పెరగడం వల్ల వృద్ధి రేటు పెరుగుతుందని మంత్రి పేర్కొన్నారు. 2016-17 నాటికి వృద్ధి లక్ష్యం 15 శాతంగా నిర్దేశించుకున్నట్టు మంత్రి తెలిపారు. 2016-17 ప్రధమార్థంలో వృద్ధి రేటు 12.99శాతంగా ఉండగా… గత ఏడాది వృద్ధి రేటు 10.99 శాతంగా ఉందని వివరించారు.

ప్రైవేటు భాగస్వామ్య పక్షాలతో కలిసి పట్టణ గృహ నిర్మాణాన్ని పటిష్టపరచాలన్న యోచనలో ఉన్నట్టు మంత్రి తెలిపారు. బలహీనవర్గాలకు ఇళ్ల నిర్మాణానికి ప్రాధాన్యత ఇస్తూనే… అదే సమయంలో ఎల్.ఐ.జి., ఎం.ఐ.జీ, హెచ్.ఐ.జీ ఇళ్ల నిర్మాణాన్ని ప్రొత్సహిస్తామని తెలిపారు. ఇళ్ల నిర్మాణం కోసం ఏపీఐఐసీ నుంచి భూసేకరిస్తామని మంత్రి పేర్కొన్నారు.

పట్టణ గృహనిర్మాణానికి సంబంధించి ఎల్&టీ, ఎల్ఈపీఎల్ తోపాటు పలు కంపెనీలు పావర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చాయి. ఇక వ్యవసాయ వృద్ధి రేటు 22 శాతంగా ఉందని… వృద్ధి రేటు పెంచేందుకు వ్యవసాయంలో నాణ్యత పెంచాల్సిన అవసరం ఉందని ప్రభుత్వం భావిస్తోంది. 15 శాతం వృద్ధి సాధించిన తర్వాత స్థిరమైన అభివృద్ధి సాధించుకోవాల్సి ఉంటుందని ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు చెప్పారు.

 

జారీ చేయువారు: కమిషనర్, సమాచార పౌర సంబంధాల శాఖ, విజయవాడ

NO COMMENTS

Leave a Reply