రెవిన్యూ లోటు కు ప్రత్యేక హోదానే మందు : ఆర్థిక మంత్రి యనమల

  0 765

   

  రెవిన్యూ లోటు నుంచి ఏపీ బయటపడాలంటే ప్రత్యేక హోదానే మందని రాష్ట్ర ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు స్పష్టం చేశారు. ప్రస్తుతం రెవిన్యూ లోటు 3 వేల కోట్లుగా ఉండగా అది 2016-17 నాటికి 10 వేల కోట్లకు చేరుకుంటుందని యనమల చెప్పారు. వెలగపూడిలో నిర్మించిన నూతన సచివాలయం నుంచి మంత్రి మీడియాతో మాట్లాడారు. తాజా రెవిన్యూ 46,051 కోట్లు కాగా… ఖర్చు రూ. 49051 కోట్లుగా ఉందని… దీంతో లోటు రూ. 3000  కోట్లుగా తేలిందని మంత్రి చెప్పారు.

  వాణిజ్యపన్నులు, రవాణా శాఖ మినహా మిగతా శాఖలన్నీ ఆదాయం భారీగా తగ్గిందని మంత్రి చెప్పారు. వాణిజ్య పన్నుల శాఖ మాత్రం పది శాతం వృద్ధి సాధించిందని మంత్రి తెలిపారు. స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ, ఎక్సైజ్ శాఖలోనూ పరిస్థితి రాబడి ఆశించిన మేర రాలేదని మంత్రి తెలిపారు. రెండు శాఖలలో లక్ష్యాల మేరకు వృద్ధి రేటు నమోదు కాకపోవడంపై విశ్లేషించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. పన్నేతర ఆదాయంలోనూ సమస్యలు ఎదురైనట్టు మంత్రి వివరించారు. గనులు, భూగర్భ వనరుల శాఖలతోపాటు మరో రెండు శాఖలు మైనస్ వృద్ధిని సాధించాయని యనమల పేర్కొన్నారు.

  ఈ నేపథ్యంలో రెవిన్యూ లోటును భర్తీ చేయాల్సిన బాధ్యత కేంద్రానికి ఉందని యనమల తెలిపారు. కేంద్రం 2014-15 రెవిన్యూ లోటును విడుదల చేయాల్సి ఉందని మంత్రి చెప్పారు. క్లిష్టపరిస్థితుల్లో ఉన్న ఆర్థిక వ్యవస్థ గాడిలో పడాలంటే కేంద్రం ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని మంత్రి చెప్పారు. తాజా కరువు నేపథ్యంలో నీటి వనరుల శాఖ, మున్సిపల్ శాఖలు పంటలను కాపాడేందుకు    రూ. 7 వేల కోట్లు అదనంగా కేటాయించాల్సిన అవసరం ఉందని మంత్రి పేర్కొన్నారు.

  ఖర్చును సర్దుబాటు చేసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడూ ఓవర్ డ్రాఫ్ట్ యోచనకు వెళ్లలేదని మంత్రి స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం 3.5% ఎఫ్.డి.ఆర్ తీసుకునేందుకు అనుమతిస్తే ప్రభుత్వానికి రూ. 2 వేల కోట్ల రుణం మంజూరు అవుతుందని మంత్రి వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం రుణమాఫీ కింద రూ. 7 వేల కోట్లు చెల్లించని… మిగతా మొత్తానికి రుణవిమోచన పత్రాలను పంపిణీ చేసినట్టు మంత్రి పేర్కొన్నారు. శుక్రవారం నూతన సచివాలయ భవనంలో పర్యాటక సాధికారిత కమిటీ భేటీ అవుతుందని… కొత్త పర్యాటక ప్రాజెక్టులపై మంత్రుల కమిటీ నిర్ణయం తీసుకుంటుందని యనమల పేర్కొన్నారు. శనివారం రాష్ట్రంలోని అన్ని యూనివర్శిటీలకు సంబంధించిన సమావేశం జరుగుతుందని తెలిపారు.

  జారీ చేయువారు: కమిషనర్, సమాచార పౌర సంబంధాల శాఖ, విజయవాడ

   

  NO COMMENTS

  Leave a Reply