వచ్చే బడ్జెట్ సమావేశాలు అమరావతిలో
- మంత్రి యనమల రామకృష్ణుడు
- జనవరికి అసెంబ్లీ భవన నిర్మాణం పూర్తి
విజయవాడ : 2017 జనవరి, ఫిబ్రవరిలో జరగనున్న అసెంబ్లీ సమావేశాలు అమరావతిలో నిర్వహించనున్నట్టు ఆర్థిక మంత్రి, అసెంబ్లీ వ్యవహారాల మంత్రి యనమల రామకృష్ణుడు తెలిపారు. నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో రాష్ట్ర అసెంబ్లీ భవనం పూర్తవుతుందని యనమల తెలిపారు. ఈనెల 8 నుంచి తాజా అసెంబ్లీ సమావేశాలను హైదరాబాద్ లో నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. తాజా సమావేశాల్లో జీఎస్టీ బిల్లుపై చర్చించడంతోపాటు, మరో రెండు ముఖ్యమైన బిల్లులను ఆమెదించనున్నట్టు ఆర్థిక మంత్రి, అసెంబ్లీ వ్యవహారాల మంత్రి యనమల రామకృష్ణుడు చెప్పారు.
జారీచేయువారు: కమిషనర్, సమాచార పౌర సంబంధాల శాఖ