ఎండిపోతున్న పైర్లను కాపాడటం తక్షణావసరం

ఎండిపోతున్న పైర్లను కాపాడటం తక్షణావసరం

వర్షాలు పడని ప్రాంతాల్లో యుద్ధప్రాతిపదికన పంటతడి
ట్యాంకర్లు, రెయిన్ గన్స్‌ను పూర్తిస్థాయిలో వినియోగించాలి
అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు టెలికాన్ఫరెన్స్
ఎండిపోతున్న వేరు శనగతో సహా, ఇతర ప్ర్దానమైన పంటలను కాపాడేందుకు యుద్ధప్రాతిపదికన పంటతడి

అందించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి  నారా చంద్రబాబు నాయుడు అధికారులను  ఆదేశించారు. అనంతపురం నుంచి ఆయన ఇటీవల  క్షేత్రస్థాయిలో జలవనరులు, వ్యవసాయం, రెవెన్యూ శాఖల అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.
వర్షాలు పడటం ఎంతో సంతోషించదగ్గ అంశమని, అయితే అంతమాత్రాన  ఉదాశీన వైఖరి తగదని, వర్షాలు లేని ప్రాంతాల్లో పంట ఎండిపోకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. ఎకరం పంటకూడా ఎండిపోకుండా కరవుపై చేస్తున్న యుద్ధంలో ఇది తొలిఅంకమేనని, ముందుముందు ఒకవేళ కరవు పరిస్థితులు ఏర్పడిన పక్షంలో ఇప్పుడు కరవును ఎదుర్కొన్న విధానం ఆదర్శం అవుతుందని ముఖ్యమంత్రి అన్నారు.

“పంట సంజీవని”ని  తేలిగ్గా తీసుకోవద్దు

‘పంటసంజీవని’ని తేలిగ్గా తీసుకోవద్దని తాను మొదటి నుంచి చెబుతున్నానని, ఇప్పుడు కష్టకాలంలో రైతాంగానికి ‘పంటసంజీవని’పై భరోసా ఏర్పడిందని, రెయిన్ గన్స్ పై విశ్వాసం కుదిరిందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఎండిపోతున్న పంటలను ‘పంటసంజీవని’ ద్వారా కాపాడుతున్న అంశంపై రైతాంగంలో అవగాహన అవసరమని చెప్పారు.
ఇందుకు వ్యవసాయ శాఖ సిబ్బంది అవిశ్రాంతంగా పనిచేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కోరారు. పంటలు ఎండకుండా, భూమిలో తడి ఇంకిపోకుండా ప్రభుత్వం చేయగలిగిన స్థాయిలో పనిచేస్తున్నదని, స్వచ్ఛంద సంస్థలు కరవునివారణలో భాగస్వాములు కావాలని

రైతన్నలతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు
రైతన్నలతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు

చంద్రబాబు పిలుపునిచ్చారు. విశ్వవిద్యాలయాల ప్రొఫెసర్లు, ఇంజనీరింగ్ విద్యార్ధులు క్షేత్ర స్థాయి పర్యటనకు వెళ్లాలని, రైతాంగంలో చైతన్యం తీసుకురావాలి, కరవు నివారణ చర్యలై అధ్యయనం చేసి తగిన సూచనలు చేయవచ్చని సీఎం చెప్పారు. వివిధ జిల్లాలలో వినియోగించిన రెయిన్ గన్స్, ట్యాంకర్లు, ఆయిల్ ఇంజన్ల సంఖ్యపై ప్రతిరోజూ రియల్ టైమ్ సమాచారం ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. వర్షపాత అంతరాయాలపై ప్రభుత్వం అన్నిచర్యలు తీసుకుందన్న భావన రైతుల్లో రావాలని అన్నారు. పనిలో వేగం వుండాలని, ఫలితం రాబట్టాలని, సకాలంలో సమాచారం అందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కోరారు.

NO COMMENTS

Leave a Reply