పంటరక్షక తడులలో మిషన్-1 పూర్తి

పంటరక్షక తడులలో మిషన్-1 పూర్తి

పంటరక్షక తడులలో మిషన్-1 పూర్తి
4 లక్షల ఎకరాలకు తడులు
ఇక డ్రోన్ల ద్వారా హాంద్రీ-నీవా, గండికోట పనుల పరిశీలన

రెండేళ్లలో 4 విజయాలు సాధించాం
టెలికాన్ఫరెన్స్ లో ముఖ్యమంత్రి చంద్రబాబు
పంటరక్షక తడుల కార్యక్రమంలో మిషన్-1 పూర్తయ్యిందని నవ్యాంధ్ర ముఖ్యమంత్రి  నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. మొత్తం 4 లక్షల ఎకరాలకు పంటరక్షక తడులను ఇచ్చినట్లు వివరించారు. రాష్ట్రంలో కరవు పరిస్థితుల నివారణపై శుక్రవారం అనంతపురం నుంచి అధికారులు, సిబ్బంది, ప్రజాప్రతినిధులతో ఆయన టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.
రక్షకతడులిచ్చి పంటలు కాపాడటంతో ప్రభుత్వ ప్రతిష్ట పెరిగిందని, అధికార యంత్రాంగం గౌరవం ఇనుమడించిందని చంద్రబాబు వివరించారు. రాయలసీమ నాలుగు జిల్లాలలో పంటలు ఎండిపోకుండా కాపాడటంలో రాత్రింబవళ్లు కృషిచేసిన అధికారులు, సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు.
‘పంటరక్షక తడులు మిషన్-1’ ను శుక్రవారంతో పూర్తిచేస్తున్నట్లు ప్రకటిస్తూ.. ఒక బృందంగా సమన్వయంతో పనిచేసి విజయం సాధించామని, ఈ కృషిలో భాగస్వాములైన అందరికీ అభినందనలు తెలిపారు.
టెక్నాలజీతో వైపరీత్యాలను ఎదుర్కోవచ్చు
తరతరాలుగా కరవుతో సతమతమవుతున్న రాయలసీమ రైతులకు రెయిన్ గన్స్ ద్వారా ఒకదారి చూపామన్నారు. వర్షాభావాన్ని కూడా టెక్నాలజీ ద్వారా ఎదుర్కోవచ్చనే భరోసా రైతుల్లో నింపామన్నారు. కరవులో ఏమీ చేయలేమనే నిస్సహాయ పరిస్థితి నుంచి రైతాంగాన్ని బయటవేశామని, ఏదైనా చేయగలమనే విశ్వాసం కలిగించామని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు.
పంటలు కాపాడినందుకు త్వరలో సత్కారం
పంటలు ఎండిపోకుండా కాపాడటంలో సహకరించిన అధికారులు, సిబ్బంది, స్వచ్ఛంద సంస్థల సభ్యులకు త్వరలోనే అభినందన సత్కారం ఉంటుందని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. ప్రకృతి వైపరీత్యాలను కూడా టెక్నాలజీ ద్వారా సమర్ధంగా ఎదుర్కొనడం గొప్పవిషయంగా పేర్కొన్నారు.
అన్ని శాఖల అధికారులు, సిబ్బంది అందరూ సహకరిస్తేనే, కష్టపడితేనే ఇది సాధ్యం అయ్యిందన్నారు. అవసరాన్ని బట్టి రెయిన్ గన్ టెక్నాలజీని ఇతర జిల్లాలకు విస్తరించి వర్షపాత అంతరాయాల నుంచి పంటలు ఎండకుండా కాపాడాలని సీఎం సూచించారు.
4 లక్షల ఎకరాల్లో పంటలకు రక్షక తడులు
రక్షక తడులు మిషన్ వన్ కింద రాయలసీమ నాలుగు జిల్లాలలో ఇప్పటివరకు 3,27,008 ఎకరాలలో పంటలను కాపాడామని ముఖ్యమంత్రి తెలిపారు. గుంటూరు, ప్రకాశం, శ్రీకాకుళం జిల్లాలను కూడా కలిపితే 3,74,800 ఎకరాలలో పంటలకు రక్షకతడులు ఇచ్చామన్నారు. శుక్రవారం మరో 25వేల ఎకరాలకు రక్షకతడులు ఇస్తున్నారని, దీంతో కలిపి గత వారం రోజులుగా మొత్తం 4లక్షల ఎకరాలలో పంటలకు రక్షక తడులు ఇచ్చినట్లు అవుతుందని చెప్పారు.

దేశానికే ఆదర్శం
ఒక మంచి ఆలోచన ప్రపంచాన్నే మార్చేస్తుందనడానికి పంట రక్షక తడులే ఉదాహరణ అని ముఖ్యమంత్రి చంద్రబాబు

నవ్యాంధ్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు
నవ్యాంధ్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు

అన్నారు. నిన్నటి ఆలోచన, నేటి ఆచరణ, రేపటి భరోసాకు బాటలు వేస్తుందన్నారు. ‘పంటలు కాపాడటంలో అందరూ సహకరించారు, అందరూ కష్టపడ్డారు, అందుకే విజయం సాధించారు’ అని ప్రశంసించారు. ‘డ్రైస్పెల్ మిటిగేషన్’ పై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుసరించిన విధానాలకు దేశవిదేశాల్లో ప్రశంసలు లభిస్తున్నాయని, ఆంధ్రప్రదేశ్‌లో అనుసరించిన రెయిన్ గన్ టెక్నాలజీ విధానం ఇతర రాష్ట్రాలకు మార్గదర్శకమని అన్నారు.
డ్రోన్ల ద్వారా హంద్రి-నీవా, గండికోట పనుల పర్యవేక్షణ
రెయిన్ గన్స్ ద్వారా తాత్కాలిక పరిష్కారం చూపామని, ఇకపై శాశ్వత పరిష్కార మార్గాలపై అధికార యంత్రాంగం దృష్టి పెట్టాలన్నారు. ఇప్పటివరకు చేసిన పనులన్నీ డాక్యుమెంటేషన్ చేయాలన్నారు, సమాచారం ప్రజలకు తెలియజేయాలని,కేంద్రానికి నివేదిక పంపాలని సూచించారు. హంద్రీ-నీవా, గండికోట రిజర్వాయర్ పనులను డ్రోన్ల ద్వారా ఎప్పటికప్పుడు పరిశీలిస్తామని, జాప్యం జరగకుండా చర్యలు తీసుకుంటామని అన్నారు.
సమష్టితత్వంతోనే నాలుగు విజయాలు
సమష్టితత్వం, పరస్పర సమన్వయంతో ఈ రెండేళ్లలో నాలుగు గొప్పవిజయాలు సాధించామని ముఖ్యమంత్రి తెలిపారు. 1)హుద్ హద్ తుపాన్,2) గోదావరి పుష్కరాలు, 3)కృష్ణా పుష్కరాలు,4) పంట రక్షక తడులు మిషన్ వన్ లో వివిధ శాఖల సమన్వయంతో, ప్రజా సహకారంతో విజయం సాధించామన్నారు.

నూరు శాతం సంతృప్తి
మూడింటిలో ప్రజలలో 95% సంతృప్తిరాగా, పంట రక్షకతడులు అందించడంలో మాత్రం 100% సంతృప్తి వచ్చిందన్నారు. వ్యవసాయ శాస్త్రవేత్తలు, వాతావరణ నిపుణులు రేపటినుంచి వర్షాభావ పరిస్థితులను ముందస్తుగా విశ్లేషించాలని, ‘రియల్ టైమ్ అనాలిసిస్’ చేయాలని ఆదేశించారు. మండలాలలో అదనపు రెయిన్ గేజ్ లను నెలకొల్పే అంశం పరిశీలించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కోరారు. ప్రస్తుతం ఉన్న ‘రెయిన్ గేజ్’ లు సక్రమంగా పనిచేస్తోంది లేనిది ఎప్పటికప్పుడు తనిఖీలు చేయాలన్నారు.

NO COMMENTS

Leave a Reply