పంటలబీమా పథకంలో మార్పులు రావాలి

  0 1305

  పంటలబీమా పథకంలో మార్పులు రావాలి

  ముఖ్యమంత్రి చంద్రబాబు 

  ముఖ్యమంత్రి నారా చంద్ర బాబు నాయుడు
  ముఖ్యమంత్రి నారా చంద్ర బాబు నాయుడు

   

  పంటలబీమా పథకంలో సమూల మార్పులు తీసుకురావాల్సి ఉందని నవ్యాంధ్ర ముఖ్యమంత్రి  నారా  చంద్రబాబు నాయుడు  అన్నారు. పంటబీమా విధానం రైతులకు లాభదాయకంగా ఉండేలా తీర్చిదిద్దాల్సి ఉంద న్నారు. కాంట్రాక్టర్ లోపం వల్లనే పంటలు కాపాడటంలో 15రోజులు వెనుకబడ్డామని, పరికరాలను సమకూర్చుకోవడంలో కొంత జాప్యం జరిగిందని అంటూ, భవిష్యత్తులో పంటలకు ఆరుతడి నిర్వహణలో (స్ట్రెస్ మేనేజిమెంట్)లో ఈలోపాలు జరగకూడదని ముఖ్యమంత్రి హెచ్చరించారు.
  అక్యురసీ, ప్రిడిక్షన్ ఇన్ అడ్వాన్స్ రెండూ అత్యంత ప్రధానం
  అనంతపురం, కర్నూలు,చిత్తూరు, కడప, ప్రకాశం జిల్లాలలో వర్షాలు పడటం శుభపరిణామమని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. అయితే భవిష్యత్తులో పంటలకు ఆరుతడి నిర్వహణలో మరింత అప్రమత్తంగా ఉండాలని చంద్రబాబు అన్నారు. వర్షపాతం ముందస్తు అంచనాల్లో కచ్చితత్వం ఉండాలని, ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, ‘అక్యురసీ’, ‘ప్రిడిక్షన్ ఇన్ అడ్వాన్స్’ రెండూ అతి ప్రధానమైనవిగా వివరించారు. వర్షాభావంతో తేమ ఆరిపోయిన పైర్లు ఉన్న ప్రాంతాలలో 100% నాణ్యమైన విద్యుత్ ను 24 గంటలు సరఫరా చేయాలని ఆదేశించారు.
  విద్యుత్ శాఖాధికారులు, సిబ్బంది ఏమాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించరాదన్నారు. వ్యవసాయం, అనుబంధ రంగాలు, జలవనరులు, విద్యుత్, రెవిన్యూ, ప్లానింగ్ శాఖల అధికారులంతా కలిసి కూర్చుని ఆరుతడి పండల నిర్వహణపై ప్రభుత్వ కృషిని అధ్యయనం చేయలని సీఎం సూచించారు. భవిష్యత్తులో ఇంకా మెరుగైన నిర్వహణకు కార్యాచరణ ప్రణాళిక సిధ్ధంచేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కోరారు.

  NO COMMENTS

  Leave a Reply