Tuesday - January 28, 2020
Backward Class, Minorities, Social Welfare

 

ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు
ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు

-బీసీల ఆర్దికాభ్యున్నతే మా ప్రధాన లక్ష్యం

– ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు
నవ్యాంధ్ర లో తమ ప్రభుత్వం   వెనుకబడిన వర్గాల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని  దేశ చరిత్రలోనే తొలిసారిగా ఉప ప్రణాళికను అమలు చేస్తోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు.   వెనుకబడిన వర్గాల కోసం అమలవుతున్న  వివిధ సంక్షేమ పథకాలు, ఉపప్రణాళిక  అమలు తీరుపై మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులతో ఉన్నత స్థాయిలో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీసీల అభ్యున్నతికోసం  గతంలో  ఏ ప్రభుత్వం చేయలేని కార్యక్రమాలను తెలుగుదేశం ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు.
‘మన పనితీరుపై  ప్రజల్లో సంతృప్తి శాతం పెరిగేలా కృషి  చేయాలి.  వినూత్న ఆలోచనలతో పనిచేయాలి. ఖర్చు చేసే ప్రతిపైసాతో ప్రయోజనం చేకూరాలి. కులవృత్తుల వారికి రుణాలు ఇస్తున్నాం. వృత్తి నైపుణ్యం పెంపొందించి వారి ఆర్ధిక స్థితిగతులు మెరుగుపడేందుకు తోడ్పడదాం. కేంద్రప్రభుత్వ పథకాలను ఉపయోగించి బీసీలకు మరింత అండగా నిలుద్దాం. వెనుకడిన తరగతులలో రజకులు, మత్స్యకారుల సంక్షేమానికి ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది, రానున్న రోజులలో మత్స్యశాఖ ద్వారానే అధిక ఆదాయం లభిస్తుంది’అని అన్నారు.
‘ వ్యవసాయ అనుబంధ పరిశ్రమలలో మత్స్యశాఖను ఒక గ్రోత్ ఇంజన్‌గా గుర్తించి ప్రత్యేకంగా దృష్టి పెట్టాం. ఇప్పుడిప్పుడే ఫలితాలు వస్తున్నాయి. ప్రతిసామాజిక వర్గం అభివృద్ధి సాధించాలన్నదే తెలుగుదేశం ప్రభుత్వ ధ్యేయం.
కాపులకు రిజర్వేషన్లు కల్పించి, రుణాలివ్వటం వల్ల బీసీలకు అన్యాయం జరుగుతుందని భావించరాదు. తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకురావటంలో బీసీల పాత్ర చిరస్మరణీయం. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీరామారావు బీసీలకు రాజకీయ గుర్తింపు తీసుకొచ్చారు. ఆయన విధానాలను మన ప్రభుత్వం ముందుకు తీసుకెళుతోంది. బీసీల సంక్షేమానికి ఎక్కడా రాజీపడే ప్రసక్తిలేదు’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వివరించారు.
‘రానున్న కాలంలో వెనుకబడిన తరగతుల వారికోసం ఇంకా ఏంచేస్తే బాగుంటుంది, వినూత్న పథకాలతో వారిని ఆర్ధికంగా వారి జీవన స్థితిగతులను ఎలా మెరుగుపర్చవచ్చో సూచించాలని, ఒక కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని మంత్రులు, అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. సంక్షేమం, అభివృద్థి తనకు సమప్రాధాన్యాలని స్పష్టంచేశారు. అంతకుముందు ఉపముఖ్యమంత్రి కేయీ కృష్ణ మూర్తి మాట్లాడుతూ వెనుకబడిన వర్గాల సంక్షేమానికి ఇస్తున్న రుణాలను 33 డిపార్టుమెంట్ల నుంచి బ్యాలెన్స్ చేస్తున్నామన్నారు. దరఖాస్తు చేసిన అర్హులందరికీ రుణాలు పంపిణీ అయ్యేలా చర్యలు తీసుకుంటామన్నారు. బీసీ సంక్షేమ శాఖ మంత్రి శ్రీ కొల్లు రవీంద్ర మాట్లాడుతూ బీసీల ఉపాధికి అగ్రప్రాధాన్యమిస్తున్నట్లు, 13 జిల్లాలలో రుణమేళాలు నిర్వహించి 126.79 కోట్లు పంపిణీ చేశామని తెలిపారు. ప్రభుత్వం బీసీలకు ఇస్తున్న రుణాలు సద్వినియోగపడేలా మార్గదర్శనం చేయాలని అధికారులను కోరారు. చీఫ్ విప్ కాల్వ శ్రీనివాసులు మాట్లాడుతూ వ్యవసాయ రంగంలో ప్రత్యేకించి ఉద్యాన పంటల సాగులో ఎస్.సి, ఎస్.టి కార్పోరేషన్లు రైతాంగానికి రుణాలిచ్చి, పెద్ద పెద్ద వ్యవసాయ క్షేత్రాల నిర్వహణకు సహాయపడుతున్నాయని, అవి మంచి ఫలితాలను ఇస్తున్నాయని అన్నారు.
అటువంటి వినూత్న పథకాలకు బీసీ కార్పోరేషన్ రూపకల్పన చేయాలని కాల్వ శ్రీనివాసులు కోరారు. పైలెట్ ప్రాజెక్టుగా అమలు చేద్దామని సూచించారు. ఈ అంశాన్ని పరిశీలించాలని మంత్రి కొల్లు రవీంద్ర అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ విప్ కూన రవికుమార్ మాట్లాడుతూ కాపులకు ఇస్తున్న రుణాలకంటే, అత్యధిక సంఖ్యలో ఉన్న బీసీలకు ఇచ్చే రుణాలు ఎక్కువ శాతం ఉండాలని సూచించారు.
ఉపముఖ్యమంత్రి కేయీ కృష్ణమూర్తి, బి.సి సంక్షేమ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, కార్మిక మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, గృహనిర్మాణ శాఖ మంత్రి శ్రీమతి కిమిడి మృణాళిని, చీఫ్ విప్ కాల్వ శ్రీనివాసులు, విప్‌లు కాగిత వెంకటరావు, కూన రవికుమార్,ఎమ్మెల్యేలు కాగిత వెంకటరావు, బి.కె.పార్ధసారథి, గోవింద సత్యనారాయణ, కొండబాబు శంకర్ యాదవ్, పిల్లి అనంతలక్ష్మి, బండారు సత్యనారాయణమూర్తి, పివిజిఆర్ నాయుడు, ఎమ్మెల్సీలు తిప్పేస్వామి, బుద్ధా వెంకన్న, బీసీ కార్పోరేషన్ చైర్మన్ రంగనాయకులు, బిసి సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
బీసీ ఉపప్రణాళిక అమలుకు రూ. 8,832.15 కోట్లు

వెనుకబడిన వర్గాల  కోసం ఉప ప్రణాళిక  అమలు చేయడానికి   ప్రభుత్వం ఈ ఏడాది  రూ. 8,832.15 కోట్లు కేటయించింది. గత ఏడాది కంటే ఇది 33% ఎక్కువ. గత ఏడాది బిసి సబ్ ప్లాన్ అమలులో భాగంగా 10 లక్షలమంది బీసీ, ఈబీసీ విద్యార్ధులకు ట్యూషన్ ఫీజు రీఇంబర్స్ మెంట్, స్కాలర్ షిప్‌లు చెల్లించారు. స్కాలర్ షిప్‌లకు, ఫీజు బకాయిల చెల్లిపునకు రూ.2,683 కోట్లు చెల్లించారు. 2013-14లో ఫీజు బకాయిల చెల్లింపు రూ. 1,020 కోట్లు ఉండగా, 2014-15 కు వచ్చేసరికి ఇది రూ. 1,663 కోట్లకు చేరింది. ఈ ఏడాది రూ.1,894 కోట్లకు గాను ఫీజు బకాయిలకింద ఇప్పటిదాకా రూ. 1,792 కోట్లు చెల్లించారు. 2016-17 బిసి ఉప ప్రణాళికలో 500 మంది బీసీ విద్యార్ధులకు ‘ఎన్టీఆర్ విదేశీ విద్యార్జన పథకం’ అమలు. ఇందుకోసం రూ.69.11 కోట్లు కేటాయించారు.
బిసి సంక్షేమ పథకాల అమలుకు బడ్జెట్ కేటాయింపులు
బీసీ విద్యార్ధులకు పోస్ట్ మెట్రిక్ స్కాలర్ షిప్: రూ. 475 కోట్లు. బీసీ విద్యార్ధులకు ఫీజు రీయింబర్స్ మెంట్ : రూ. 993 కోట్లు. ఈబీసీ విద్యార్ధులకు ఫీజు రీయింబర్స్ మెంట్ కోసం: రూ. 632 కోట్లు. బీసీ వెల్ఫేర్ హాస్టళ్లకు: రూ. 282 కోట్లు. బిసి స్టడీ సర్కిళ్లు, బాలబాలికల హాస్టళ్ల నిర్వహణకు: రూ.82 కోట్లు. బీసీ రెసిడెన్షియల్ స్కూళ్ల నిర్వహణకు రూ.249 కోట్లు. మహాత్మా జ్యోతిబా ఫూలే బీసీ విద్యానిధికి: రూ.69 కోట్లు. హాస్టళ్లు, స్కూలు భవనాల నిర్మాణానికి: రూ. 90 కోట్లు. వెనుకబడిన తరగతులకు సామాజిక భవనాల నిర్మాణం కోసం: రూ.31.5 కోట్లు. ఏపీ బీసీ ఫైనాన్స్ కార్పోరేషన్ ద్వారా: మార్జిన్ మనీ: రూ. 176 కోట్లు. బీసీ అభ్యుదయ యోజన: రూ.33 కోట్లు. బిసి ఫెడరేషన్స్: రూ.195.47 కోట్లు. దోభీఘాట్ల నిర్మాణానికి: రూ. 20 కోట్లు.

అంబేద్కర్ జయంతికి స్వగృహ సంకల్పం

ఆరోజు పెద్దేత్తున  శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు
కార్యదర్శుల సమీక్షా  సమావేశంలో ముఖ్య మంత్రి

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు

చంద్రబాబు
రాజ్యాంగ నిర్మాత డా. బి.ఆర్ అంబేద్కర్ జయంతిని స్వగృహ సంకల్ప దినోత్సవంగా పరిగణిస్తూ నవ్యాంధ్ర లో 5.80 లక్షల  గృహాల నిర్మాణానికి శ్రీ కారం చుట్టాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిర్ణయించారు. అంబేద్కర్ జయంతిని  కేవలం ఉత్సవానికే పరిమితం కాబోవటం లేదని పేదల కోసం ఇప్పటికే నిర్మించిన గృహాలకు ప్రారంభోత్సవాలు, నిర్మించబోయే గృహాలకు శంకుస్థాపనలు చేపత్తాలని అధికారులను ఆయన ఆదేశించారు. ఇలా మొత్తం 5.80 లక్షల గృహాలను ఒకేరోజు ఈ కార్యక్రమంలో చేర్చారు. తద్వారా యావత్ దేశం దృష్టినీ ఆకర్షించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అభిప్రాయపడ్డారు.

శనివారం సచివాలయంలో నిర్వహించిన కార్యదర్శులు, విభాగాధిపతుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 2022 నాటికి ప్రతిఒక్కరికీ ఇల్లు అనే సంకల్పంలో భాగంగా ఈ కార్యక్రమమని వివరించారు. రాష్ట్ర ఉజ్వల భవిష్యత్తుకోసం ఇప్పటికే నిర్దేశించిన 15% వృద్ధిరేటును సాధించేందుకు నిరంతరం శ్రమించాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. ఎంత శాతం అభివృద్ధి చెందితే అంతగా పెట్టుబడులు పెట్టాల్సి ఉందన్నారు. అధికారులు సానుకూల దృక్పథంతో పనిచేస్తేనే ఉత్తమ ఫలితాలు సాధ్యమని స్పష్టం చేశారు. ‘కొన్ని శాఖల వద్ద నిధులు లేవు. అయినా నిధులు లేవని పనిచేయటం మానవద్దు. కన్వర్జెన్స్ ద్వారా ప్రాధాన్యతా క్రమంలో నిధులను కేటాయిస్తాం. గతంలో ఇంతే చేసి ఆర్ధిక సంక్షోభాన్ని సమర్ధంగా తట్టుకోగలిగాం’ అని చంద్రబాబు గుర్తు చేశారు. ప్రాధాన్యతా క్రమంలో పనిచేస్తేనే సుస్థిర అభివృద్ధి సాధ్యమన్నారు .

వృద్ధిరేటులో ఏఏ రాష్ట్రాలు మనకంటే ముందున్నాయో సమీక్షించి, వాటి వృద్ధి రేటును అధిగమించటానికి మనమేం చేయాలో వ్యూహరచన చేయాలని ముఖ్యమంత్రి కోరారు. ‘తెలుగుదేశం ప్రభుత్వం నవ్యాంధ్రరాష్ట్రంలో అధికారంలోకి వచ్చినప్పుడు రాష్ట్ర రెవెన్యూ లోటు రూ.16,000 కోట్లు ఉంది. కేంద్రం రూ.2,300 కోట్లు ఇచ్చింది. పక్కా ప్రణాళిక, వ్యూహరచనతో పరిపాలన సాగించాం. ప్రాధాన్యతాక్రమంలో పనులు చేపట్టడంతో ఫలితాలు వచ్చాయి. ఫలితాలు రాకుండా పరిపాలించటం నిష్ఫలం. విద్యుత్ లోటును అధిగమించటం దగ్గర నుంచి మిగులు విద్యుచ్ఛక్తిని ఉత్పత్తి చేస్తున్నాం” అని చంద్రబాబు అన్నారు.

” ఉద్యానపంటల సాగుకు, మైక్రో ఇరిగేషన్ కు ఎంతో ప్రాధాన్యత ఇచ్చి ముందుకు సాగుతున్నాం. పంటసంజీవని కింద పదిలక్షల సేద్యపుకుంటలను తవ్వటం ద్వారా ప్రతిఎకరానికీ నీరందించాలని సంకల్పించాం. రైతులు పండించే దాదాపు 40 పంటల వివరాలు, వాటి మార్కెటింగ్ వివరాలు, ఏఏ ప్రాంతాలలో రేట్లుంటాయో లాంటి ఉపయోగపడే పరిజ్ఞానంతో యాప్ రూపొందించండి. లేదా ఆన్ లైన్ లో సమాచారం ఉంచి ఎప్పటికి అప్పుడు అప్ డేట్ చేయాలి. సాంకేతిక పరిజ్ఞానాన్ని పూర్తిస్థాయిలో వినియోగించుకున్న నాడే వేగవంతమైన అభివృద్ధి సాధ్యం’ అని చంద్రబాబు కార్యదర్శులు, విభాగాధిపతుల సమావేశంలో దిశానిర్దేశం చేశారు.
వ్యవసాయ రంగానికి అనుబంధ రంగాలైన కోళ్లు, మత్స్య, పశుసంవర్ధక, పాడి పరిశ్రమల రంగాలు వృద్ధిరేటు పెంపునకు దోహదపడతాయన్నారు. జలసంరక్షణకు చేపట్టిన నీరు-చెట్టు కార్యక్రమం చిత్తూరు జిల్లాలో సత్ఫలితాలను ఇచ్చిందని గుర్తు చేశారు. ఈ ఏడాది అనంతపురం జిల్లాలో వేరుశనగ దిగుబడులు అద్భుతంగా ఉన్నాయని చంద్రబాబు తెలిపారు. కాంగ్రెస్ విచక్షణారహితంగా రాష్ట్రాన్ని విభజించిందని, ఈ విభజన గాయం మాని, రాష్ట్రం సుస్థిర, సమగ్ర అభివృద్ధి సాధించాలంటే పదిహేను సంవత్సరాలు  మనమంతా సమష్టిగా కష్టపడాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.

‘ఐదు కోట్లమంది ఆంధ్రప్రదేశ్ ప్రజల భవిష్యత్తుకు దిశానిర్దేశం చేసేది ఇక్కడ సమావేశమైన 140 విభాగాధిపతులే. ఏ మంచిపని తలపెట్టినా కొన్ని శక్తుల కారణంగా వ్యతిరేక ప్రచారం జరుగుతోంది. ప్రజల్ని చైతన్యవంతుల్ని చేయటం ద్వారా ఇటువంటి దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలి‘అని చంద్రబాబు కార్యదర్శలకు, విభాగాధిపతులకు పిలుపునిచ్చారు. గత ఏడాది రాష్ట్రంలో లోటు బడ్జెట్ ను పూడ్చటానికి కేంద్రం ఇచ్చిన నిధులు రూ.2,300 కోట్లు మాత్రమేనని, అయినా కన్వర్జెన్స్ తో ఎక్కడా లోటు రాకుండా చూసుకున్నట్లు, ప్రణాళికాబద్ధంగా ఆలోచన చేయటం అవసరమన్నారు.
‘ఇప్పుడు జాతీయ ఉపాధి హామీ పథకం (నరేగా) నిధులున్నాయి. సద్వినియోగపర్చుకుని అభివృద్ధి చేద్దాం’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. రాష్ట్రం సంక్షోభంలో ఉన్నప్పుడు భేషజాలు వదిలిపెట్టి కలసికట్టుగా పనిచేయాలన్నారు. టెక్నాలజీని పూర్తిస్థాయిలో వినియోగించుకుని కష్టపడి పనిచేస్తే రాష్ట్రాభివృద్ధిని ఏ శక్తులూ అడ్డుకోలేవని చంద్రబాబు అన్నారు.

ఈ సమీక్షలో ఉపముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, చింతకాయల అయ్యన్నపాత్రుడు, బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, మంత్రులు గంటా శ్రీనివాసరావు, ప్రత్తిపాటి పుల్లారావు, పి. నారాయణ, కింజరాపు అచ్చెన్నాయుడు, దేవినేని ఉమామహేశ్వరరావు, పల్లె రఘునాథరెడ్డి, రావెల కిశోర్ బాబు, పరిటాల సునీత, కామినేని శ్రీనివాస్, కొల్లురవీంద్ర, పీతల సుజాత, శిద్ధారాఘవరావు, ప్రభుత్వ ప్రధానకార్యదర్శి శ్రీ ఎస్పీ టక్కర్ ప్రభ్రుతులు హాజరయ్యారు.

సాంఘిక సంక్షేమ శాఖ సమీక్షలో తాజాగా తీసుకున్న నిర్ణయాలు
• అమరావతిలో 15 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించ తలపెట్టిన ‘అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్’లో దేశం గర్వించేస్థాయిలో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు
• పశ్చిమగోదావరి జిల్లా వట్లూరులో టీచర్ ట్రైనింగ్ సెంటర్ నిర్మాణం

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు

• ఉపాధ్యాయుల పనితీరు, సాధించిన ఫలితాలు ఆధారంగా పదోన్నతులు, బదిలీలు
• 71 రెసిడెన్షియల్ స్కూళ్లలో సీట్ల సంఖ్యను 640 నుంచి 960కి పెంచడం
• 20 రెసిడెన్షియల్ స్కూళ్లలో సీట్ల సంఖ్యను 1280కి పెంచడం
• రెసిడెన్షియల్ స్కూళ్లలో సేవలను పీపీపీ పద్ధతిలో చేపట్టడం
• రెసిడెన్షియల్ స్కూళ్లలో సీసీ కెమేరాలు, ఎల్ఈడీ బల్బుల ఏర్పాటు
• రెసిడెన్షియల్ స్కూళ్లలో వైఫై సౌకర్యం, ఎలక్ట్రానిక్ క్లాస్ రూమ్‌ల నిర్వహణ, డిజిటల్ ఎడ్యుకేషన్, ఆన్‌లైన్ టీచింగ్
• బ్యాక్‌లాగ్ పోస్టుల భర్తీ
• యోగా, కూచిపూడి టీచర్లను ఔట్‌సోర్సింగ్ ద్వారా నియమించడం
• విద్యార్ధుల్లో ఉన్నత విలువలు, నాయకత్వ లక్షణాలు పెంపొందించేలా కొత్త సబ్జెక్ట్
• ప్రతీ విద్యార్ధి డేటాను ఆధార్‌తో అనుసంధానించడం
• కొత్తగా అంబేద్కర్ విజ్నాన కేంద్రాలు (గంధాలయాలు) ఏర్పాటు
• బ్యాంకింగ్, ఐటీ, ఐటీఈఎస్‌లో నిరుద్యోగ యువతకు శిక్షణ
• ఏడాదికి 20 వేల మంది ఎస్సీ యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ

minister pullarao2016-17 వ్యవసాయ బడ్జెట్‌ రూ.16,250.58 కోట్లు

2016-17 ఆర్ధిక సంవత్సరానికి సంబంధించి   రూ.16,250.58 కోట్లుతో నవ్యాంధ్ర  వ్యవసాయ బడ్జెట్‌ను గురువారం వ్యవసాయశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు  శాసనసభలో ప్రత్యేకంగా ప్రవేశపెట్టారు. వ్యవసాయాన్ని తక్కువ వ్యయంతో లాభసాటిగా మార్చడం, రాష్ట్రాన్ని కరవు రహితంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని వివరించారు.  రైతును  రాజుగా చేయడమే ప్రభుత్వ ధ్యేయమన్నారు.  ముఖ్యమంత్రి  చంద్రన్న స్వప్నం లాభసాటి వ్యవసాయమన్నారు.

తమ ప్రభుత్వం వ్యవసాయ రుణమాఫీ హామీని నెరవేర్చినట్లు చెప్పారు. రుణ ఉపశమన అర్హత వున్న రైతులందరికీ రుణమాఫీ వర్తింపచేశామన్నారు.  పాడి పరిశ్రమ ఉత్పాదకత పెరుగుతోందని పుల్లారావు అన్నారు. ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్ ద్వారా రైతులకు ప్రోత్సాహించానున్నాట్లు తెలిపారు. అధునాతన సాంకేతికతతో వ్యవసాయంలో ఉత్పాదకత పెంచాలన్నదే తమ ప్రధాన లక్ష్యం అన్నారు. వచ్చే ఖరీఫ్ సీజన్‌లో పూర్తిస్థాయిలో  సాగునీరు అందిస్తామని మంత్రి ప్రకటించారు.

ఏపీ శాసనసభలో 2016-17 వ్యవసాయ బడ్జెట్‌ను వ్యవసాయశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ప్రవేశపెట్టారు. వ్యవసాయాన్ని తక్కువ వ్యయంతో లాభసాటిగా మార్చడం, రాష్ట్రాన్ని కరవు రహితంగా తీర్చిదిద్దడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని వివరించారు.

వ్యవసాయ బడ్జెట్‌లో ముఖ్యాంశాలు
* 2016-17 వ్యవసాయ బడ్జెట్‌ రూ.16,250.58 కోట్లు
* వ్యవసాయ శాఖ ప్రణాళిక వ్యయం రూ.1,311 కోట్లు
* వ్యవసాయశాఖ ప్రణాళికేతర వ్యయం రూ.4,474 కోట్లు
* ఉచిత విద్యుత్‌కు రూ.3వేల కోట్లు
* ఉపాధి హామీకి రూ.5,094 కోట్లు
* రైతు బజార్లు, ఉద్యాన యాంత్రీకరణకు రూ.102 కోట్లు
* సమీకృత ఉద్యాన అభివృద్ధి మిషన్‌కు రూ.95 కోట్లు
* తుంపర సేద్యానికి రూ.369కోట్లు
* ఆయిల్‌ఫాం మినీ మిషన్‌కు రూ.55 కోట్లు
* పట్టు పరిశ్రమలో ప్రణాళికేతర వ్యయం రూ.125 కోట్లు
* వడ్డీలేని రుణాలకు రూ.177 కోట్లు
* వాతావరణ ఆధారిత బీమా పథకానికి రూ.344కోట్లు
* శ్రీవెంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయానికి రూ.139కోట్లు
* సూక్ష్మ పోషకాల సరఫరాలకు రూ.80కోట్లు
* సేంద్రీయ, సహజ వ్యవసాయం కోసం రూ.68.67 కోట్లు
* వ్యవసాయ యాంత్రీకరణ కోసం రూ.161.25కోట్లు
* సమగ్ర కరవు నివారణ చర్యలకు రూ.50కోట్లు
* వ్యవసాయ శాఖలో క్షేత్రస్థాయి సిబ్బంది సామర్ధ్యం పెంపు, విస్తరణ కార్యక్రమాలకు రూ.61.71కోట్లు

కాపుల నేతగా కొనసాగుతున్న ముద్రగడ పద్మనాభం, మళ్లీ 11నుంచి దీక్షకు పూనుకుంటానంటూ సీఎంను, ప్రభుత్వాన్ని బ్లాక్ మెయిల్ రాజకీయాలకు తలపడటం పట్ల సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. సీఎంకు ముద్రగడ రాసిన లేఖలో ఆయన వాడిన పదజాలం, ఆయన వ్యక్తిత్వాన్ని పతనపు అంచులవైపుకు తీసుకువెళ్తోంది. కాపులను ధ్రరిద్రులుగా చిత్రికరిస్తూనే…వారిని ఉగ్రవాదులుగా ముద్ర వేసి అరెస్ట్ చేయాలని సవాల్ చేయడం దుర్మార్గం. ముద్రగడ ఎవరి ఆలోచనలతో ఈ దిగజారుడుతనానికి పాల్పడుతున్నారో అర్ధమవుతుంది.ఒక పక్క కాపులనే కించపరుస్తూ,వారికే నేతని చెప్పుకోవడం ముద్రగడకే చెల్లింది. రాష్ట్ర ముఖ్యమంత్రిని ఉద్దేశించి ఆయన చేసిన ఆరోపణలు, విమర్శలు పూర్తిగా అసంధర్భమైనవి. ప్రధాన విపక్ష నేత జగన్ తో చేతులు కలిపి జగన్ రాజకీయ ప్రయోజనాలకోసమే ముద్రగడ తాపత్రయ పడుతున్నట్లు విమర్శలు వస్తున్నాయి.
ఈ ప్రశ్నలకు సమాధానం ఇవ్వగలరా?

-ముద్రగడ ఈ దిగువ ప్రశ్నలకు జవాబు చెబితే సంతోషిస్తాం -“కాపు”లను “ధరిద్రపు”జాతి అనే హక్కు ఎవరిచ్చారు?- కాపులను కించ పరిచే మీకు, పోరాడే అర్హత ఎక్కడ ఉంది? – కాపుల సమస్యను పక్కదారి పట్టించాలని కంకణం కట్టుకున్నారా?- ఒక సీనియర్ నేతగా రాష్ట్ర ముఖ్యమంత్రికి లేఖ రాసే విధానం ఇదేనా?- రాజకీయ లభ్ధి కోసమే మీరు “దీక్ష విరమణ”ధర్మానికి విరుద్ధంగా అసభ్య పదజాలం, -అసంధర్భ వ్యాఖ్యలతో సీఎంకు లేఖ రాయడం ఎంతవరకు ధర్మం? మీరు దీక్ష విరమించి ఇంక పూర్తిగా ఒక్క నెలరోజులైనా కాకమునుపే ప్రధాన ప్రతిపక్ష నేత వైఖరిని ప్రోత్సహిస్తూ అనైతికంగా లేఖ సంధించడం ఎంత వరకు సబబు? -మీరు కాపుల విస్తృత ప్రయోజనాలకంటే జగన్ రాజకీయ లభ్ధి కోసమే అత్యుత్సాహ పడుతున్నట్లుగా మీ లేఖలోని సారాంశాన్ని చూస్తే మీకు అనిపించడంలేదా? – మీరు చేపట్టిన ఉధ్యమం ఏంటి? ఇప్పుడు మీరు చేస్తున్నదేంటి? – నిజంగానే మీకు కాపులపై ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా, ఈ రకమైన అనైతిక పద్ధతిలో లేఖ రాసి వుండేవారు కాదు. ఇన్నాళ్లూ రాజకీయంగా అజ్ఞాతంలో ఉన్న మీరు ఇప్పుడు అర్ధాంతరంగా కాపు జాతి గుర్తుకొచ్చి, -“కాపుల” ముసుగులో నాటకాలకు, బ్లాక్ మెయిల్ రాజకీయాలకు పాల్పడుతున్నారన్న నిజాన్ని గ్రహించలేని అజ్ఞానులు ప్రజలు అనుకుంటున్నారా? – మీ లేఖలో పదే పదే కాపులను “ధరిద్రపు”జాతి అంటూ ఆజాతిని కించపరిచి ఎంత పెద్ద తప్పు చేస్తున్నారో గ్రహించారా? – సామాజికంగా, ఆర్ధికంగా, రాజకీయంగా వెనుకబాటు తనంతో ఉన్నా… కాపులు ఇంతవరకు ఆత్మాభిమానంతోనే గౌరవంగా జీవిస్తున్నా వాస్తవం మీకు తెలియదా? -ఆత్మగౌరవంతో జీవిస్తున్న కాపులను ధరిద్రులుగా చిత్రీకరించి, వారిని అవమానించే అధికారం మీకెవరిచ్చారు? -అక్కడితో ఆగకుండా కాపులను ఏకంగా “ఉగ్రవాదుల”తో పోల్చి, వారిపై మరింత బురదచల్లడం ఎంతవరకు సమంజసం? ధమ్ము, ధైర్యం, చీము నెత్తురు ఉంటే కాపులను ఉగ్రవాదులుగా ముద్రవేసి వారిని జైళ్లో పెట్టమని సవాల్ చేయడం దుర్మార్గపు చర్య కాదా? ఇతరులకు లేని కొత్త కొత్త ఆలోచనలకు, చిన్నచూపుకు మీరు ఎందుకు తెరలేపుతున్నట్లు? కాపుల సమస్యకు ఉగ్రవాదులను ముడిపెట్టడం మీ నీతిమాలిన ఆలోచన కాదా? ఇంతకీ మీరు కాపులపై ప్రేమతో ఇదంతా చేస్తున్నట్టా? లేక వారిని సమస్యలనుంచి విముక్తులను చేయకూడదనా?
కాపుల రిజర్వేషన్ల కోసం తనొక్కరే పోరాడుతున్నట్లు ప్రచారం చేసుకొంటూ, పరోక్షంగా కాపులను “ధరిద్రులు”గా ముద్రవేయాలనుకోవడం తగునా? ప్రభుత్వం ఇచ్చిన హామీలతో హఠాత్తుగా దీక్ష విరమించిన మీకు, ఆ హామీల అమలుకు కొంత సమయం పడుతుందన్న వాస్తవాన్ని మీరు ఎందుకు విస్మరిస్తున్నారు? మీ లేఖలో కాపుల ప్రయోజనాలకంటే… మీ రాజకీయ లభ్దికే అమిత ప్రాధాన్యం ఇచ్చిన మాట నిజంకాదా? -సీఎంను ఉద్దేశించి మీరు అసంధర్భ ప్రేలాపనలు చేయడంలో విపక్ష నేత జగన్ సహకారం ఉందని అనుమానించడం తప్పా? జగన తరహాలోనే మీరూ పయనిస్తున్నది నిజం కాదా? -1984 నుంచి చంద్రబాబు నేరాల చిట్టా విప్పుతానంటూ సీఎంను బ్లాక్ మెయిల్ చేయడం దేనికి సంకేతం? ఎంటీఆర్ ను పదవి నుంచి దించారని చంద్రబాబును ఆ లేఖలో విమర్సించే ముందు, అదే చంద్రబాబును 1999 ఎన్నికల్లో ప్రజలు చంద్రబాబుకు బ్రహ్మరధం పట్టిన విషయం తెలియదా? ఆనాడు టీడీపీలో అంతర్గతంగా నెలకొన్న సమస్యలకు ప్రజాస్వామ్య విధానంలోనే కొత్తనేతను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఆ ఘటనను ప్రజలంతా ఆమోదించారు. గనుకనే మళ్లీ చంద్రబాబునే సీఎం గద్దెలో కూర్చోబెట్టారు. చీటికీ, మాటికీ వెన్నుపోటు ముసుగులో రాజకీయం చేస్తున్న రాజకీయ నేతలంతా ఈ వాస్తవాన్ని ఆత్మపరిశీలన చేసుకుంటే మంచిది. ముద్రగడగారూ….కాపుల సమస్యకూ, ఆనాటి సన్నివేశాన్ని అడ్డం పెట్టి ఎవర్ని, ఎంతకాలం బ్లాక్ మెయిల్ చేస్తారు?
తక్షణం ప్రభుత్వం ఇచ్చే హామీలు అమలు చేయకపోతే ఈ నెల 11వ, తేదీ నుంచి మళ్లీ దీక్షకు దిగుతానని సీఎంను బెదిరిస్తే సమస్య పరిస్కారం కాదుకదా….మరింత జటిలమయ్యే ప్రమాదం ఉంటుంది. కాపు జాతికి మీరొక్కరే “జాతిపిత” అయిపొవాలని కలలు కనడంలో తప్పేమీలేదు. కానీ ఆ కలలను సాకారం చేసుకోవాలంటే తొలుత మీ దురాలోచనలకు స్వస్తి పలికితే మంచిది. కాపులను ధరిద్రులుగా తూలనాడినందుకు, ఉగ్రవాదులను చేయమని కించ పరిచినందుకు తొలుత బేషరతుగా క్షమాపణలు చెబితే మంచిది. అలాగే సీఎం చంద్రబాబును మీ ఇస్ఠానుసారంగా తూలనాడతాన్ని మీ విజ్ఞతకే వదిలేస్తున్నా. ఇప్పటికైనా మీరు కాపుల సమస్యను మీ రాజకీయ ప్రయోజనాలకోసం వాడుకోకుండా పోరాడితే అందరూ ఆహ్వానిస్తారు. అంతేగాని మీరు చిటికీ మాటికీ దీక్ష ముసుగులో బ్లాక్ మెయిల్ చేసి దీక్షలో కూర్చుంటే ఎవ్వరూ పట్టించుకోరు. కాపులకు రిజర్వేషన్లు కల్పించాలని టీడీపీ ఎన్నికల మేనుఫెస్టోలోనే పొందుపరిచింది. అందుకే దశలవారీగా కాపులకు ఇచ్చే హామీలన్ని సీఎం చంద్రబాబు పరిష్కరిస్తున్నారు. టీడీపీ ప్రభుత్వంలో కాపులకు పెద్దపీట వేసారు. అనేక ఉన్నత పదవులు కట్టబెట్టారు. ఇది అబద్ధమా? ముద్రగడ గారూ… కాపులనే మీరు కించపరిస్తే మీ ఉధ్యమం సఫలీకృతం కాదు.

In review meeting on welfare programs held here in Vijayawada, Chief Minister Chandrababu Naidu said the focus of the departments should be on generating economic activity than merely restricting themselves to spending the sanctioned budgets.

Stating that welfare activities will only have impact when there is public satisfaction and creates a visible impact. “We are spending nearly Rs. 14,200 crore on welfare activities in the state. There should be visible impact and better publicity campaigns to propagate the message to benificiaries,” the Chief Minister added.

“Our focus should be on three things: 1) Create study circles, 2) Skill upgradation by tying up with APSSDC and 3) Ensure placements of the students who have undergone training,” the Chief Minister explained.

This, according to the Chief Minister, can be done by synchornizing all the data on beneficiaries through Aadhar linkage (with bio-metric data of individuals). “This way, you can streamline the system, save money and ensure efficiency,” he added.

Offer monthly scholarships to students by simulataneously conducting quarterly exams to assess their performance, the Chief Minister said, adding that the department should analyse the results and link it to teachers’ performance. “This will bring in accountability among students and help the department.”

“Common exams in residential schools could be held. Exams halls can have cameras through which students can be monitoring from central monitoring station. All residential schools should have wifi and make the tests online,” he said, adding that teachers too should be trained.

“The department can use government infrastructure that is non-functional and convert them into training centres for teachers,” he added.

He said, ultimately, welfare hostels should be converted into residential schools. Currently, 20% of them have been converted into residential schools.

The aim of the government in welfare activities, according to the Chief Minister is to generate economy activity in order to empower the beneficiaries. “Analyse the success rate and failures of last year’s economic activities from the money spent on welfare schemes. See what’s making progress and what the government ought to do to boost certain activities,” he added.

Minister Ravella Kishore Babu, Kollu Ravindra, Principal Secretary (Finance) P.V. Ramesh, Joint Secretary to CM Padhyumna, heads of departments of SC, ST Welfare, BC and Minority Welfare departments, and other officials were present.

In order to create a skilled workforce in the state, Chief Minister Chandrababu Naidu suggested training people of the BC community in crafts and age-old community-based professions.

In a review meeting on BC welfare at Camp Office in Vijayawada today, the Chief Minister highlighted the need to revive traditional arts & crafts as well as community-based professions to life through skill development programs. “The acquired skills will eventually help people from the communities to earn money,” he added.

During the meeting, the Chief Minister directed officials to come up with an action plan in this regard.

The Chief Minister elaborately discussed the BC sub-plan and said that nearly 16, 25, 719 people of AP are beneficiaries under the sub-plan.

Meanwhile, the Chief Minister was informed that Aadarana scheme was launched to empower community-based professions. “This scheme must be implemented so that every person is benefited,” he added.

The Chief Minister said that BC Finance Corporation must come forward to provide financial assistance for the workers. He further added that the department must periodically review how rural development, agriculture, horticulture, fisheries, education and various departments spending funds for BC welfare.

In order to ensure the schemes reach the right beneficiaries, the Chief Minister suggested linking their details to Aadhar number.

Further, the Chief Minister responded positively to officials’ suggestion of outsourcing welfare officers and staff for B.C. welfare hostels. He also suggested that B.C. hostels must be transformed into residential schools in a phased manner.

In the 13 study circles in the state, the Chief Minister said that the state government aims to train 13,000 students for the academic year 2015-16. “These centres will identify potential students and train them for competitive exams and civil services,” he added.

In a major boost to the government’s Flagship ‘Smart Village-Smart Ward’ program, the Tata Trusts has signed an Memorandum of Understanding (MoU) with the Government of Andhra Pradesh to develop 264 villages in Vijayawada constituency to work in bamboo cultivation, fisheries, health and nutrition and village development.

In an interaction with industrialists of the Andhra Pradesh Chambers of Commerce and Industry Federation in Vijayawada today, Chief Minister Chandrababu Naidu said that Chairman Emiretus of Tata Group Ratan Tata’s credibility, simplicity adds value to this social program.

“Ratan Tata is a symbol of India and its industrial might. He has shown how to carry out ethical and moral business. This has made his Group sustainable,” he added.

Not only is Tata fuelling the start-up ecosystem, he is promoting and encouraging entrepreneurs and ideas that excite him, the Chief Minister said, adding “Tata is driving India’s start-up growth.”

This is the first time such a huge number of villages are being developed by a single institution/ Trust in Andhra Pradesh. “This will set an example in the country as it will be menotored by Industry Titan Ratan Tata. I’m impressed with the background work and research Tata Trust has done on these villages,” the Chief Minister said.

Later, the Chief Minister asked Tata to visit Andhra Pradesh often and mentor entrepreneurs in the state. “He has given ideas about social responsibility, industrial growth, health and sanitation.”

Speaking at the event, Tata said: “I’m here to support the MoU signing with the state to undertake various social projects.”

Elaborating his conversation with the Chief Minister, Tata said “I will advise him (Chandrababu Naidu) on bringing new industries and ideas to Andhra Pradesh. At the end of my career, I realize that money cant buy one thing… and, that is to create an excitement in your life. At this point of time, to be associated with Chandrababu Naidu (who has knowledge) is what creates that excitement within me. The new state will have every bit of support that I can personally give.”

In an interactive session with industrialists, Tata said shared his views on the start-up ecosystem and about the way he chooses to support-start-ups in the country. “The kind of start-ups that excite me are those which do not emulate start-ups in the US or anywhere in the world. Successful start-ups are those which strike a chord within India and overseas as well as reflect the confidence investors have in them,” he told in response to a question from a young entrepreneur.

Explaining his views on the technologies that need attention in India on being asked by a woman entrepreneur, Tata said applications of technology that meet energy challenges, issues of clean and safe drinking water and health are the issues India needs to look at.

Member of Parliament Kesineni Srinivas is the person to bring the proposal to Ratan Tata to endorse Tata Trusts’ initiative of developing 264 villages in Vijayawada constituency.

To increase efficiency of claim settlement process and increase the penetration of insurance for unorganised workers in the state, Chief Minister Chandrababu Naidu said a call centre will be entrusted with verification and monitoring of claims.

“Set up a call centre that will monitor the penetration and seek/verify data of families. The Labour Department also has been asked to create a wing exclusively to monitor the scheme,” the Chief Minister said during a review meeting on labour policies in Vijayawada today.

Under the Transport drivers insurance scheme, the Chief Minister said that the call centre can collect data on their children from drivers and the government can offer scholarships to the children of those who have registered under the scheme.

The call centre will be connected with the control room which will continuously take interventions and remedial steps as soon as they receive complaints/grievances from beneficiaries.

The Chief Minister has directed the department to also come up with an action plan on welfare programs such as housing scheme and skill upgradation programs for organised and unorganised sector.

Of the total 2 crore unorganised workers in the state, data of 71.6% of workers have been registered under the Unorganised Workers Social Security Scheme launched by the Chief Minister in May this year.

Expressing dissatisfaction over the penetration of insurance in the last 4 months, the Chief Minister said that settlement process has to be quickened in the way it was settled for the victims of Dowleswaram accident (within a week) which claimed the lives of 3 drivers among others.

On the other hand, the Chief Minister also directed officials to ensure that insurance cover for natural death be Rs 1.5 lakh and for accident death be given Rs 3 lakh by integrating the state scheme with National Family Benefit Scheme.

STATE NEWS

0 4290
‘యుఎస్‌ఐబీసీ ట్రాన్స్‌ఫోర్మెటివ్ ఛీఫ్ మినిస్టర్’ చంద్రబాబు కాలిఫోర్నియాలో మే8న ప్రదానం అమరావతి :  ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు మరో ప్రతిష్ఠాత్మకమైన అంతర్జాతీయ పురస్కారం లభించింది. యు.ఎస్. ఇండియా బిజినెస్ కౌన్సిల్...