Friday - November 16, 2018
Blog Page 2

    0 510

     

    రెవిన్యూ లోటు నుంచి ఏపీ బయటపడాలంటే ప్రత్యేక హోదానే మందని రాష్ట్ర ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు స్పష్టం చేశారు. ప్రస్తుతం రెవిన్యూ లోటు 3 వేల కోట్లుగా ఉండగా అది 2016-17 నాటికి 10 వేల కోట్లకు చేరుకుంటుందని యనమల చెప్పారు. వెలగపూడిలో నిర్మించిన నూతన సచివాలయం నుంచి మంత్రి మీడియాతో మాట్లాడారు. తాజా రెవిన్యూ 46,051 కోట్లు కాగా… ఖర్చు రూ. 49051 కోట్లుగా ఉందని… దీంతో లోటు రూ. 3000  కోట్లుగా తేలిందని మంత్రి చెప్పారు.

    వాణిజ్యపన్నులు, రవాణా శాఖ మినహా మిగతా శాఖలన్నీ ఆదాయం భారీగా తగ్గిందని మంత్రి చెప్పారు. వాణిజ్య పన్నుల శాఖ మాత్రం పది శాతం వృద్ధి సాధించిందని మంత్రి తెలిపారు. స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ, ఎక్సైజ్ శాఖలోనూ పరిస్థితి రాబడి ఆశించిన మేర రాలేదని మంత్రి తెలిపారు. రెండు శాఖలలో లక్ష్యాల మేరకు వృద్ధి రేటు నమోదు కాకపోవడంపై విశ్లేషించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. పన్నేతర ఆదాయంలోనూ సమస్యలు ఎదురైనట్టు మంత్రి వివరించారు. గనులు, భూగర్భ వనరుల శాఖలతోపాటు మరో రెండు శాఖలు మైనస్ వృద్ధిని సాధించాయని యనమల పేర్కొన్నారు.

    ఈ నేపథ్యంలో రెవిన్యూ లోటును భర్తీ చేయాల్సిన బాధ్యత కేంద్రానికి ఉందని యనమల తెలిపారు. కేంద్రం 2014-15 రెవిన్యూ లోటును విడుదల చేయాల్సి ఉందని మంత్రి చెప్పారు. క్లిష్టపరిస్థితుల్లో ఉన్న ఆర్థిక వ్యవస్థ గాడిలో పడాలంటే కేంద్రం ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని మంత్రి చెప్పారు. తాజా కరువు నేపథ్యంలో నీటి వనరుల శాఖ, మున్సిపల్ శాఖలు పంటలను కాపాడేందుకు    రూ. 7 వేల కోట్లు అదనంగా కేటాయించాల్సిన అవసరం ఉందని మంత్రి పేర్కొన్నారు.

    ఖర్చును సర్దుబాటు చేసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడూ ఓవర్ డ్రాఫ్ట్ యోచనకు వెళ్లలేదని మంత్రి స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం 3.5% ఎఫ్.డి.ఆర్ తీసుకునేందుకు అనుమతిస్తే ప్రభుత్వానికి రూ. 2 వేల కోట్ల రుణం మంజూరు అవుతుందని మంత్రి వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం రుణమాఫీ కింద రూ. 7 వేల కోట్లు చెల్లించని… మిగతా మొత్తానికి రుణవిమోచన పత్రాలను పంపిణీ చేసినట్టు మంత్రి పేర్కొన్నారు. శుక్రవారం నూతన సచివాలయ భవనంలో పర్యాటక సాధికారిత కమిటీ భేటీ అవుతుందని… కొత్త పర్యాటక ప్రాజెక్టులపై మంత్రుల కమిటీ నిర్ణయం తీసుకుంటుందని యనమల పేర్కొన్నారు. శనివారం రాష్ట్రంలోని అన్ని యూనివర్శిటీలకు సంబంధించిన సమావేశం జరుగుతుందని తెలిపారు.

    జారీ చేయువారు: కమిషనర్, సమాచార పౌర సంబంధాల శాఖ, విజయవాడ

     

    0 957
    • మంత్రి యనమల రామకృష్ణుడు
    • జనవరికి అసెంబ్లీ భవన నిర్మాణం పూర్తి

    విజయవాడ :  2017 జనవరి, ఫిబ్రవరిలో జరగనున్న అసెంబ్లీ సమావేశాలు అమరావతిలో నిర్వహించనున్నట్టు ఆర్థిక మంత్రి, అసెంబ్లీ వ్యవహారాల మంత్రి యనమల రామకృష్ణుడు తెలిపారు. నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో రాష్ట్ర అసెంబ్లీ భవనం పూర్తవుతుందని యనమల తెలిపారు. ఈనెల 8 నుంచి తాజా అసెంబ్లీ సమావేశాలను హైదరాబాద్ లో నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. తాజా సమావేశాల్లో జీఎస్టీ బిల్లుపై చర్చించడంతోపాటు,  మరో రెండు ముఖ్యమైన బిల్లులను ఆమెదించనున్నట్టు ఆర్థిక మంత్రి, అసెంబ్లీ వ్యవహారాల మంత్రి యనమల రామకృష్ణుడు చెప్పారు.

     

     

     

     

    జారీచేయువారు:  కమిషనర్, సమాచార పౌర సంబంధాల శాఖ

    0 1102

    పట్టణ గృహనిర్మాణంతో జీడీపీ వృద్ధి

    • బలహీనవర్గాలకు గృహనిర్మాణంలో పెద్దపీట
    • పట్టణ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున గృహనిర్మాణ ప్రాజెక్టులు
    • ఎల్&టీ, ఎల్ఈపీఎల్ ల పవర్ పాయింట్ ప్రజెంటేషన్
    • వివరాలు వెల్లడించిన ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు

    పట్టణ గృహ నిర్మాణ రంగాన్ని పెద్ద ఎత్తున ప్రోత్సహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో గృహ నిర్మాణ ప్రాజెక్టులను అనుమతించడం ద్వారా జీడీపీ వృద్ధి సాధ్యమవుతుందని ప్రభుత్వం భావిస్తోంది. నూతన సచివాలయంలో గృహనిర్మాణం, ఆర్థికశాఖ పనితీరు, రాబడి, ఖర్చు,  రైతులు, మహిళా సాధికారిత అంశాలపై చర్చించింది. రాష్ట్రంలో పట్టణ గృహ నిర్మాణాన్ని మెరుగుపరచడంతోపాటు, బలహీనవర్గాల వారికి గృహ సముదాయల కోసం పట్టణ మౌలిక సదుపాయాల కల్పన చేయాలని సర్కారు భావిస్తోంది.

    గ్రామీణ-పట్టణ జనాభా 50-50 శాతంగా ఉండటం వల్ల వృద్ధి రేటు పెరిగేందుకు అవకాశం ఉంటుందని ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు వివరించారు. సేవల రంగంలో 50 శాతం వృద్ధి పెరగడం వల్ల ఆర్థిక వ్యవస్థ పురోగమిస్తుందన్నారు. పట్టణ జనాభా పెరగడం వల్ల వృద్ధి రేటు పెరుగుతుందని మంత్రి పేర్కొన్నారు. 2016-17 నాటికి వృద్ధి లక్ష్యం 15 శాతంగా నిర్దేశించుకున్నట్టు మంత్రి తెలిపారు. 2016-17 ప్రధమార్థంలో వృద్ధి రేటు 12.99శాతంగా ఉండగా… గత ఏడాది వృద్ధి రేటు 10.99 శాతంగా ఉందని వివరించారు.

    ప్రైవేటు భాగస్వామ్య పక్షాలతో కలిసి పట్టణ గృహ నిర్మాణాన్ని పటిష్టపరచాలన్న యోచనలో ఉన్నట్టు మంత్రి తెలిపారు. బలహీనవర్గాలకు ఇళ్ల నిర్మాణానికి ప్రాధాన్యత ఇస్తూనే… అదే సమయంలో ఎల్.ఐ.జి., ఎం.ఐ.జీ, హెచ్.ఐ.జీ ఇళ్ల నిర్మాణాన్ని ప్రొత్సహిస్తామని తెలిపారు. ఇళ్ల నిర్మాణం కోసం ఏపీఐఐసీ నుంచి భూసేకరిస్తామని మంత్రి పేర్కొన్నారు.

    పట్టణ గృహనిర్మాణానికి సంబంధించి ఎల్&టీ, ఎల్ఈపీఎల్ తోపాటు పలు కంపెనీలు పావర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చాయి. ఇక వ్యవసాయ వృద్ధి రేటు 22 శాతంగా ఉందని… వృద్ధి రేటు పెంచేందుకు వ్యవసాయంలో నాణ్యత పెంచాల్సిన అవసరం ఉందని ప్రభుత్వం భావిస్తోంది. 15 శాతం వృద్ధి సాధించిన తర్వాత స్థిరమైన అభివృద్ధి సాధించుకోవాల్సి ఉంటుందని ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు చెప్పారు.

     

    జారీ చేయువారు: కమిషనర్, సమాచార పౌర సంబంధాల శాఖ, విజయవాడ

    0 1109

     

    • ప్రతి ఏడూ 3వేల హెక్టార్ల అదనపు సాగు లక్ష్యం
    • పర్యావరణ పరిరక్షణకు ప్రత్యేక చర్యలు

    విజయవాడ : పర్యావరణ పరిరక్షణలో భాగంగా రాష్ట్రంలో అడవుల విస్తీర్ణం, అటవీ ఉత్పత్తులు పెంచడానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. రాష్ట్రంలో 65,814 కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న అటవీ ప్రాంతంలో గొప్ప వృక్ష జాతులు, జంతువులు ఉన్నాయి. ఈ ప్రాంతాన్ని పరిరక్షించుకుంటూ మానవ నిర్మిత అడవుల పెంపకానికి ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది.  వాణిజ్య అటవీ ఉత్పత్తులు పెంచడానికి, దేశీయ, పారిశ్రామిక అవసరాలు తీర్చడానికి 25 ఏళ్ల క్రితం ఏర్పాటైన  ఏపీ ఫారెస్ట్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ (ఏపీఎఫ్ ఢీసీ)82,380 హెక్టార్లలో తోటలను పెంచుతోంది. ఏడాదికేడాది ఆ విస్తీర్ణాన్ని పెంచుకుంటూ పోతోంది. ప్రధానంగా ఈ కార్పోరేషన్  యూకలిప్టస్, వెదురు, టేకు, జీడి, కాఫీ, మిరియాలు, ఎర్రచందనం, ఔషద మొక్కలను పెంచుతోంది.  ఒక క్రమ పద్దతిలో ఏడాదికేడాది మానవ నిర్మిత అడవీ ప్రాంత విస్తీర్ణాన్ని పెంచుకుంటూ పోతోంది.  ఈ ఆర్థిక సంవత్సరం మొదలుకొని మూడేళ్లపాటు 2018-19 వరకు ప్రతి ఏడాది 3,300 హెక్టార్ల విస్తీర్ణంలో తోటలను పెంచుకుంటూ పోవాలని యాక్షన్ ప్లాన్ రూపొందించింది. రెండు వేల హెక్టార్లలో యూకలిప్టస్ మొక్కలు,  200 హెక్టార్లలో వెదురు మొక్కలు, వంద హెక్టార్లలో టేకు మొక్కలు చొప్పున ప్రతి ఏడాది అదనంగా సాగు చేయాలని కార్పోరేషన్ నిర్ణయించింది.

    ఉభయ గోదావరి, నెల్లూరు జిల్లాలలో యూకలిప్టస్, వెదురు, జీడి తోటలను  ఎక్కువగా పెంచుతున్నారు.  విశాఖ జిల్లాలో మిరియాలు, కాఫీ తోటలను పెంచుతున్నారు. తూర్పుగోదావరి, కర్నూలు జిల్లాలలో ఔషద మొక్కలను పెంచుతున్నారు. చిత్తూరు, కడప, కర్నూలు, నెల్లూరు జిల్లాలలో ఎర్రచందనం చెట్లను పెంచుతారు.   రాష్ట్రంలో ఫర్నీచర్ పరిశ్రమకు అవసరమైన కలపను సరఫరా చేయడంలో ఈ కార్పోరేషన్ కీలక పాత్ర పోషిస్తోంది. కలపను, ఇతర అటవీ ఉత్పత్తులను ఇది మార్కెటింగ్ చేస్తుంది. అలాగే అటవీ ప్రాంతంలో మొక్కలు నాటడంతోపాటు ఉత్పాదక పెంచడానికి, గిరిజనులకు, ఇతర స్థానిక ప్రజలకు ఉపాధి కల్పించడానికి  ఇది కృషి చేస్తోంది.

    పర్యావరణ పరిరక్షణతోపాటు సహజసిద్ధ ప్రకృతి సౌందర్యాలను తిలకించేవిధంగా అటవీ పర్యాటక ప్రాంతాలను  ప్రభుత్వం అభివృద్ధి చేస్తోంది.   అలాగే అక్కడి గిరిజనులు,  గ్రామీణ ప్రాంతవాసుల  సంక్షేమం కోసం కూడా ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటోంది.

     

    జారీ చేసినవారు : కమిషనర్, సమాచార, పౌరసంబంధాల శాఖ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం

     

    0 699
    • టెలీ కాన్ఫరెన్స్ లో ముఖ్యమంత్రి చంద్రబాబు

     

    నీళ్లులేక పంట ఎండిపోవడమనేది ఇకపై మనరాష్ట్రంలో జరగ కూడదని ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు అన్నారు. డ్రైస్పెల్ మిటిగేషన్ పై గురువారం అనంతపురం నుంచి వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాయలసీమలో వర్షాభావ పరిస్థితిని ఆరురోజుల్లో అదుపులోకి తెచ్చామని, సకాలంలో రక్షక తడులిచ్చి పంటలు కాపాడామన్నారు. అవసరాన్ని బట్టి ఆయా ప్రాంతాలలో మరో రెండు, మూడు తడులివ్వాలని ఆదేశించారు.
    రెయిన్ గన్ టెక్నాలజీ ద్వారా వ్యవసాయ రంగంలో నూతన శకం ప్రారంభించామని , పంటకుంటలు, ట్యాంకర్లు, ఆయిల్ ఇంజిన్లు, రెయిన్ గన్స్ ద్వారా రక్షక తడులు ఇచ్చి పంటలు కాపాడటం దేశంలోనే సరికొత్త చరిత్రగా ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. పంటలు కాపాడటంలో అన్ని శాఖలు సమన్వయంగా పనిచేయడం శుభ పరిణామం అంటూ దీనిని లాజికల్ గా ముందుకు తీసుకెళ్లాలన్నారు. దేశ,విదేశాలలో దీనిని ఒక రోల్ మోడల్ గా తీసుకుంటారని అభిప్రాయబడ్డారు.
    వర్షాభావంలోనూ పంట కాపాడుకునే ధీమా, ధైర్యం రైతులకు వచ్చింది:
    పంట పెడితే వర్షాలు లేకున్నా కాపాడుకోవచ్చనే ధీమా, ధైర్యం రైతుల్లో వచ్చింది, ఇందుకు కారకులైన అందరికీ ముఖ్యమంత్రి చంద్రబాబు అభినందనలు తెలిపారు. ఇది నిజంగా అద్భుతమని ప్రశంసించారు. పర్యటనల్లో తాను ఎక్కడకెళ్లినా రైతుల కళ్లల్లో ఆనందం చూస్తున్నానని, తనకు చాలా సంతోషంగా ఉందని అన్నారు. ఎండిపోతున్న పంటలను కాపాడటం చూసి అందరూ ఆశ్చర్యపోయారని, మీడియా కూడా ఆశ్చర్యపోయిందని తెలిపారు. ప్రతిపక్షాల వాళ్లు కూడా ఇకపై నోరు తెరవలేరంటూ, వర్షాభావాన్ని సమర్ధంగా ఎదుర్కొన్నందుకు మీడియా వాళ్లు తనకు ధన్యవాదాలు చెప్పడం గొప్ప విషయం గా పేర్కొన్నారు.
    రేపటికల్లా తొలిదశ ఆపరేషన్ పూర్తి:
    డ్రైస్పెల్ మిటిగేషన్ తొలిదశ ఆపరేషన్ పూర్తిచేశామని రేపటికల్లా కర్నూలులో ప్రకటిస్తాననని ముఖ్యమంత్రి తెలిపారు. రాయలసీమ నాలుగు జిల్లాలను ఒకదాని తర్వాత మరొకటి ‘‘స్ట్రెస్ ఫ్రీ’’ గా ప్రకటిస్తామన్నారు. డ్రైస్పెల్ మిటిగేషన్, స్ట్రెస్ మేనేజిమెంట్ లో అన్నీశాఖలూ ఒక టీముగా పనిచేసి, అధ్భుత ఫలితాలు సాధించారంటూ, ఈ కృషిలో భాగస్వాములైన అందరికీ అభినందనలు తెలిపారు. ఈ టీం స్పిరిట్ ను భవిష్యత్తులో కూడా కొన సాగించాలన్నారు. ఉత్పాదన పడిపోకుండా ఈవిధంగా రక్షక తడులిచ్చి పంటలు కాపాడటం గొప్ప విషయం అంటూ, ఇతర దేశాలకు కూడా ఇదొక నమూనాగా చెప్పారు.
    పంటబీమా పథకంలో మార్పులు రావాలి:
    బ్యాంకర్లతో, ఇన్సూరెన్స్ అధికారులతో ఈరోజు సమావేశం అవుతున్నట్లుగా ముఖ్యమంత్రి ప్రకటించారు. పంటబీమా పథకంలో సమూల మార్పులు తీసుకురావాల్సి ఉందంటూ, రైతులకు లాభదాయకంగా ఉండేలా పంటబీమా విధానం ఉండాలన్నారు. కాంట్రాక్టర్ లోపం వల్లనే పంటలు కాపాడటంలో 15రోజులు వెనుకబడ్డామని, ఎక్విప్ మెంట్ సమకూర్చుకోవడంలో కొంత జాప్యం జరిగిందని అంటూ, భవిష్యత్తులో స్ట్రెస్ మేనేజిమెంట్ లో ఈలోపాలు జరగరాదని ముఖ్యమంత్రి హెచ్చరించారు. బాధల్లో ఉన్నప్పుడు తప్పులు ఎక్కువ చేస్తారని, అదే భరోసాగా ఉంటే తప్పులు అనేవి జరగవు అనేదానికి ప్రస్తుతం అనుసరించిన స్ట్రెస్ మిటిగేషన్ ఆపరేషన్ ఒక ఉదాహరణగా పేర్కొన్నారు.
    అక్యురసీ, ప్రిడిక్షన్ ఇన్ అడ్వాన్స్ రెండూ అతిప్రధానమైనవి:
    అనంతపురం, కర్నూలు,చిత్తూరు, కడప, ప్రకాశం జిల్లాలలో వర్షాలు పడటం శుభపరిణామం అంటూ, అయితే భవిష్యత్తులో స్ట్రెస్ మేనేజిమెంట్ లో మరింత అప్రమత్తంగా ఉండాలన్నారు. వర్షపాతం ముందస్తు అంచనాల్లో ఖచ్చితత్వం ఉండాలని, ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, అక్యురసీ, ప్రిడిక్షన్ ఇన్ అడ్వాన్స్ రెండూ అతి ప్రధానమైనవిగా పేర్కొన్నారు. స్ట్రెస్ ఉన్న ప్రాంతాలలో 100% నాణ్యమైన విద్యుత్ ను 24గంటలు సరఫరా చేయాలని ఆదేశించారు. విద్యుత్ శాఖ అధికారులు, సిబ్బంది ఏమాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించ రాదన్నారు.వ్యవసాయం, అనుబంధ రంగాలు, జలవనరులు, విద్యుత్, రెవిన్యూ, ప్లానింగ్ శాఖల అధికారులంతా కలిసి కూర్చుని స్ట్రెస్ మేనేజిమెంట్ పై ఇప్పటివరకు ప్రభుత్వం చేసినదానిని అధ్యయనం చేయాలన్నారు.భవిష్యత్తులో ఇంకా మెరుగైన నిర్వహణకు కార్యాచరణ ప్రణాళిక సిధ్ధంచేయాలన్నారు.
    ఈ టెలీ కాన్ఫరెన్స్ లో వివిధ శాఖల ఉన్నతాధికారులు ధనుంజయరెడ్డి, సంజయ్ గుప్తా,అజయ్ జైన్, శశిభూషణ్, జిల్లాల కలెక్టర్లు, దాదాపు 3వేల మంది అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

    0 375

     

    • CM seeks central govt share in dry spell mitigation programme to protect crops
    • Govt adopts innovative and best practices to save crops in Rayalaseema

    Vijayawada, August 30:The Andhra Pradesh Govt has adopted a novel idea under dry spell mitigation programme to save the standing crops in  Rayalaseema region. Instead of seeking drought relief funds from central govt, the government has been making efforts to save the crops using the services of students.

     

    Chief Minister N Chandrababu Naidu appealed students to come forwards to operate rain guns in drought prone areas to provide one wetting to save standing crops. He said 13,334 rains guns will be used to protect the crops. In addition tankers and fire tenders were also pressed into service under dry spell mitigation programme. He said another 15,000 rain guns will be reaching the state from Maharashtra by tomorrow.

    Speaking to media persons in Vijayawada on Tuesday, the CM said the central government should come forward to share the responsibility to protect the interests of farmers who are caught under debt trap with the prevailing drought conditions.

    The CM said with the initiative of state government the ground water table increased by 2.5 metres which comes around 230 tmc due to farm ponds. He said digging of 64000 farm ponds completed and another 3.5 lakh farm ponds are under progress.

    He said of the six lakh hectares in drought hit Anantapur district, the government is trying to provide water for one wetting using rain guns and sprinklers and other available water sources to save standing crops.

    The CM said 21 IAS officers, 80 Group I officers and 1200 MPDOs were pressed into service to continuously monitor the situation and to protect the crops.

    He said that the government has been using best and innovative practices to protect the crops. He said that the bankers and insurance companies also should come forward to extend an helping hand to farmers at the time of crisis. He said that the government would bear 80 per cent of cost for protecting the crops and the farmers have to bear 20 per cent of cost.

    The Chief Minister said that he is proceeding to Anantapur tonight and camp there for three days to monitor the  situation from control room. He said that the government is planning to conduct a study to protect the farmers during drought conditions. He sought geo tagging of crops to monitor the condition of crops.

     

    Issued by:  Commissioner, I&PR, AP Govt.

     

     

    Vijayawada, August 31: Farmers heaved a sigh of relief as Chief

    Minister N Chandrababu Naidu personally monitoring dry spell mitigation

    programme by camping in Anantapur. In addition the present rainfall

    brought solace to farmers as it help to save the standing crops in 36.92

    lakh acres in Rayalaseema region.

    Though 68.48 per cent excess rainfall was recorded during June

    registering 158.80 mm rain fall against 93.70 mm average rain fall deficit

    rain fall recorded in both July and August months. In July 121.80 mm

    rain fall was recorded against 151.30 mm with 19.50 per cent deficit rain

    fall and in August 88.30 mm rain fall recorded against 158.90 mm

    registering 44.43 per cent deficit rain fall.

    Nellore district registerd -43.30 per cent deficit rain fall and

    Srikakularm -27.80 per cent deficit rainfall. Of the total 670 mandals

    deficit rain fall recorded in 210 mandals. Chief Minister N Chandrababu

    Naidu pressed into service officials and rain guns to save the standing

    crops. The state government has been using the services of students

    and using rain guns and other available water resources to save the

    crops. Speaking to media persons in Vijayawada on Wednesday,

    Minister for Water Resources Devineni Umamaheswara Rao said that

    the Krishna river has been receiving good inflows and the officials

    released 11,600 cusecs from Prakasam barrage. He said 7,792 cusecs

    water released to canals. He said that the inflow at Prakasam barrage

    stands at 19,392 cusecs and the water level reached 12 ft after a gap of

    one year. He said that the officials are releasing water to Krishna

    Eastern and Western delta as per the demand of farmers. He said that

    the water level at Pulichintala project stands at 14.3 ft. He said 12.5 tmc

    of Godavari water was used for Krishna delta through Pattiseema

    project. The Minister said that the flood levels at several dams on

    Krishna river are increasing and there would be no deficit for water

    supply to farmers.

    Issued by: Commissioner, I&PR, AP Govt.

    0 1019
    drinks production plant in China

    విజయవాడ :  వ్యవసాయరంగంలో అగ్రస్థానంలో ఉంటున్న ఆంధ్రప్రదేశ్.. ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో కూడా అగ్రగామి కావాలనుకుంటోంది. 974 కిలోమీటర్ల తీరప్రాంతం, పోర్టులు, ఎయిర్ పోర్టులు, మెగా పారిశ్రామిక కారిడార్లు, మౌలిక వసతులు, నిరంతర విద్యుత్, పుష్కలమైన నీటి, ఖనిజ వనరులు, నైపుణ్యం కలిగిన యువత, వ్యవసాయరంగంలో అద్భుత ప్రగతి.. వెరసి.. ఫుడ్ ప్రాసెసింగ్ రంగానికి తిరుగులేని బలమని భావిస్తోంది చంద్రబాబు ప్రభుత్వం.

     

    ఉన్న వనరులను సద్వినియోగం చేసుకుని.. ఫుడ్ ప్రాసెసింగ్ రంగానికి తగిన చేయూతనిస్తే.. ఐదు వేల కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడులను ఆకర్షించి.. 50 వేల మందికి పైగా యువతకు ఉద్యోగావకాశాలిప్పించొచ్చని భావిస్తోంది.

    పంటల ఉత్పత్తిలో తిరుగులేదు..

    వ్యవసాయంలో మన రైతులు తిరుగులేని మొనగాళ్లు. ఉద్యానవన పంట ఉత్పత్తుల్లోనూ వారికి సాటి లేదు. వరి, మొక్కజొన్న, చెరకు, వేరుశెనగ వంటి వ్యవసాయోత్పత్తులే కాదు.. అరటి, మామిడి, కొబ్బరి, బొప్పాయి, జామ, నిమ్మ, జీడి, దానిమ్మ, టొమాటొ, ఉల్లి, క్యారెట్, నూనె గింజల ఉత్పత్తిలో దేశంలోనే మొదటి ఐదు స్థానాల్లో ఉంటున్నాం మనం. కానీ పంటలు చేతికొచ్చే సరికి.. వాటికి గిట్టుబాటు ధర లభించక, నిల్వ చేసుకునేందుకు కోల్డ్ స్టోరీజీలు లేక నానా ఇబ్బందులు పడుతోంది మన రైతాంగం. వ్యవసాయరంగం ప్రత్యక్షంగానో, పరోక్షంగానో దాదాపు 70 లక్షల కుటుంబాలకు ఉపాధి కల్పిస్తుంటే.. ఆహార పరిశ్రమ మరో 10 లక్షల కుటుంబాలకు ఉపాధి చూపిస్తుందని అంచనా. మన రాష్ట్రంలో దాదాపు రెండు లక్షల మెట్రిక్ టన్నుల ఆహార పంటల ఉత్పత్తి జరుగుతోంది. ఇందులో దాదాపు 40 లక్షల టన్నుల ఉత్పత్తుల్ని ప్రాసెసింగ్ చేసే అవకాశాలున్నాయని అంచనా. వీటికి తగ్గ స్థాయిలో ప్రాసెసింగ్ యూనిట్లు లేకపోతే.. ఈ పంట ఉత్పత్తుల్ని నేల పాల్జేయాల్సిందే.

    ఈ సమస్యల పరిష్కారానికి ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో పెట్టుబడులు ఆహ్వానించడమే సరైన మార్గంగా నిర్ణయించింది ప్రభుత్వం. ఆహార ధాన్యాలు, పాలు, పండ్లు, కూరగాయలు, పౌల్ట్రీ, ఆక్వా ఉత్పత్తులకు మంచి ధర లభించేందుకు మెగా ఫుడ్ పార్కులు ఏర్పాటు చేయాలని భావిస్తోంది. రైతు ఉత్పత్తిదారుల సంఘాలు ఏర్పాటు చేసి.. వారి ఉత్పత్తులను నేరుగా ఈ ఫుడ్ పార్కులకు సరఫరా చేయించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. జిల్లాకు ఒక్కో ఫుడ్ పార్క్, శీతలీకరణ గోదాముల నిర్మాణం చేపడుతోంది. ఇవి పూర్తయితే.. రైతులు తమ ఉత్పత్తులను నేరుగా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లకు తరలించి.. గిట్టుబాటు ధర సొంతం చేసుకోవచ్చు.

    పెట్టుబడుల వెల్లువ

    చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేళ్లలోనే.. ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో భారీ ఎత్తున పెట్టుబడులను ఆకర్షించింది. పెప్సి కో, క్యాడ్ బరీ, కెల్లాగ్, బ్రిటానియా, గోద్రేజ్ లాంటి బడా సంస్థలతో పాటు, చిన్నా చితకా సంస్థలు మరో డజను వరకు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టి పరిశ్రమలు స్థాపించాయి. దాదాపు 15 వేల మంది రాష్ట్ర యువతకు ఉద్యోగావకాశాలు కల్పించాయి. ప్రభుత్వం ఇస్తున్నప్రోత్సాహం కారణంగా.. ఇప్పటికీ ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో పెట్టుబడులకు పారిశ్రామికవేత్తలు సై అంటున్నారు. వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టి.. రాష్ట్రంలోని వ్యవసాయోత్పత్తులను స్థానిక అవసరాలకే కాకుండా.. విదేశాలకు ఎగుమతి చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. క్రితం ఏడాది దేశ వ్యాప్తంగా జరిగిన ప్రాసెస్డ్ ఫుడ్ ఎగుమతులు 26 వేల కోట్ల రూపాయలైతే.. వాటిలో మన వాటా 20 శాతానికి పైమాటే. ఈ రంగానికి మరింత ప్రోత్సాహాన్నందిస్తే.. ఎగుమతుల మొత్తం భారీగా పెరిగే అవకాశాలున్నాయని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహంతో మరో 35 సంస్థలు.. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చాయి. దాదాపు 700 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టబోతున్నాయి. ఈ సంస్థలు నిర్మించే పరిశ్రమల్లో దాదాపు 10 వేల మంది యువతకు ఉద్యోగావకాశాలు కల్పించడానికి కూడా సిద్ధంగా ఉన్నాయి.

      0 482
      • ఈ గవర్నెస్, ఐటీలో ముందున్న ఏపీ
      • ఐటీ నిపుణులకు కొదవలేదు
      • ఐటీకి అనుకూలమైన రాష్ట్రం
      • మల్టీనేషనల్ కంపెనీల ఆసక్తి

      విజయవాడ :  ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఐటీ పరిశ్రమలకు భారీగా రాయితీలు ప్రకటిచడంతో దేశంలోని పలు ప్రముఖ సంస్థలతోపాటు మల్టీనేషనల్ కంపెనీలు కూడా రాష్ట్రంలో తమ కేంపస్ లను ప్రారంభించడానికి  ఆసక్తి చూపుతున్నాయి. ఇప్పటికే ఈ గవర్నెస్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, నూతన ఆవిష్కరణల విషయంలో ఏపీ ముందున్న విషయం తెలిసిందే. దానికి తోడు ఐటీ ఇండస్ట్రీకి కావలసిన మానవ వనరుల(ఐటీ నిపుణులు)కు ఇక్కడ కొదవలేదు. మౌలిక సదుపాయాలు, తగిన ప్రోత్సాహకాలతో గుడ్ గవర్నెస్ అందించే విధంగా ప్రభుత్వం సమర్థవంతమైన ఐటీ పాలసీని రూపొందించింది. దానిని పఠిష్టంగా అమలు చేయడానికి తగిన చర్యలు తీసుకుంటోంది.

      ఐటీ పరిశ్రమల స్థాపనకు అనుకూలమైన రాష్ట్రం

      ఐటీ పరిశ్రమ అభివృద్ధి చెందడానికి కావలసిన అన్ని సౌకర్యాలు రాష్ట్రంలో ఉన్నాయి. రాష్ట్రంలో 200 ఇంజనీరింగ్ కాలేజీలతోపాటు ఐటీ, కంప్యూటర్ సైన్స్ స్పెషలైజేషన్ తో విద్యార్థులకు శిక్షణ ఇచ్చే ట్రైనింగ్ ఇన్ స్టిట్యూషన్స్ పెద్ద సంఖ్యలో ఉన్నాయి. దాంతో ఆధునిక సాంకేతిక అంశాలతో కూడిన ఉన్నత విద్యతోపాటు ఈ పరిశ్రమకు కావలసిన ఒక ప్రత్యేకమైన వాతావరణం ఏర్పడింది. దీనికి తోడు ప్రత్యేక రాయితీలు, ప్రోత్సాహకాలతో కూడిన ఐటీ పాలసీ-2014-2020ని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.

      టెక్నాలజీలో వస్తున్న మార్పులకు అనుగుణంగా ఐటీ పరిశ్రమకు ఉపయోగపడే విధంగా  సిలబస్ లో మార్పులు చేయాలని ప్రభుత్వం విశ్వవిద్యాలయాలకు సలహా ఇచ్చింది. ఈ రంగంలో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు తయారయ్యేవిధంగా కొత్త కోర్సులను ప్రవేశపెట్టమని సూచించింది. గుర్తించిన ఆన్ లైన్ కోర్సులు విజయవంతంగా పూర్తి చేసిన విద్యార్థులకు క్రెడిట్స్ కూడా ఇవ్వమని సలహా ఇచ్చింది. తగిన ఫ్యాకల్టీని సమకూర్చుకోవడానికి ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలని చెప్పింది. విదేశీ విశ్వవిద్యాలయాలు, పెద్ద పెద్ద ఐటీ కంపెనీల సహకారంతో ప్రారంభించే ఐటీ ఇన్ స్టిట్యూట్స్ కు ప్రభుత్వం తగిన సహకారం అందిస్తుంది. సాఫ్టవేర్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్ డిగ్రీ చదివే విద్యార్థులకు నాలుగవ సంవత్సరంలో సంబంధిత పరిశ్రమలలో ఇంటర్మ్ షిప్ చేయడం తప్పనిసరి చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ విషయంలో పరిశ్రమల సహకారం తీసుకోవాలని సూచన చేసింది. ఐటీ పరిశ్రమ వృద్ధిలో ‘ఇన్నొవేషన్’ కీలక పాత్ర పోషిస్తుంది. కొత్త తరహా ఉత్పత్తుల ద్వారానే ఈ పరిశ్రమ అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంది. దీనిని గుర్తించిన ప్రభుత్వం ఇందుకు సంబంధించిన ప్రణాళికలు రూపొందిస్తోంది.

      ఆర్థికేతర ప్రోత్సాహకాలు

      ఈ పరిశ్రమ రాష్ట్రంలో త్వరితగతిన అభివృద్ధి చెందాలన్న లక్ష్యంతో పారిశ్రామికవేత్తల సౌలభ్యం కోసం ప్రభుత్వం అనేక మినహాయింపులు ఇచ్చింది. ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ పరిశ్రమకు ఏపీ కాలుష్య నియంత్రణ చట్ట పరిధి నుంచి మినహాయించారు. ఈ పరిశ్రమను ఫ్యాక్టరీస్, మెటర్నిటీ బెన్షిట్, ఏపీ షాప్స్ అండ్ ఎస్టాబ్లష్ మెంట్, కాంక్ట్రాక్ట్ లేబర్, పేమెంట్ ఆఫ్ వేజెస్, మినిమమ్ వేజెస్, ఎంప్టాయిమెంట్ క్ఛ్సేంజెస్ చట్టాల నుంచి మినహాయించారు.   అలాగే ఐటీ యూనిట్లు సూచించిన ఫార్మేట్ లో  స్వీయ ధృవీకరణ పత్రాలు సమర్పించుకునే అవకాశం ప్రభుత్వం కల్పించింది. మహిళా ఉద్యోగుల భద్రతకు, రక్షణకు తగిన ముందు జాగ్రత్త చర్యలు తీసుకొని నైట్ షిఫ్ట్ తోపాటు మూడు షిఫ్ట్ లలో పని చేయించుకోవడానికి అవకాశం కల్పించారు. ఐటీ, ఐటీఇఎస్ యూనిట్లను, కంపెనీలను, ప్రమాదకరం కాని హార్డ్ వేర్ ఉత్పత్తి యూనిట్లను ఏపీ ఎసెన్సియల్ సర్వీసెస్ మెయింట్ నెన్స్ యాక్ట్ కింద తప్పనిసరి సర్వీసులుగా ప్రభుత్వం ప్రకటించింది.

      కంపెనీ పేరు ప్రతిష్టలు, ఆ కంపెనీ పెట్టే పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు తదితర అంశాల ఆధారంగా ప్రభుత్వం భూమిని కేటాయిస్తుంది. కనీసం వంద మంది ఐటీ నిపుణులకు ఉపాధి కల్పించే యూనిట్ కు మాత్రమే భూమిని కేటాయిస్తారు. 500 మంది ఐటీ నిపుణులకు ఉపాధి కల్పిస్తే ఒక ఎకరా వరకు రిబేటుపై భూమిని కేటాయించే అవకాశం ఉంది.  కంపెనీ ప్రతిపాదించే అంశాల ఆధారంగా ప్రభుత్వం నియమించే కమిటీ భూమి కేటాయింపు అర్హతలను నిర్ధారిస్తుంది. కంపెనీని ఎప్పటిలోపల ప్రారంభించేది, ఎంతమందికి ఉపాధి కల్పించేది, ఎంత పెట్టుబడి పెట్టేది అన్ని వివరాలు ఒప్పందంలో ఉంటాయి. ఆ ఒప్పంద పత్రాలపై ఆ కంపెనీ అధికార ప్రతినిధి సంతకం చేస్తారు. ఉపాధి కల్పన ఆధారంగా ఐటీ లేఅవుట్స్, ఐటీ టవర్స్ లో మరో ఐటీ కంపెనీకి సబ్ లీజింగ్ ఇవ్వడానికి కూడా అనుమతిస్తారు.

      ఆర్థిక ప్రోత్సాహకాలు

      ఐటీ పరిశ్రమకు సంబంధించి అన్ని రకాల మొదటి  సేల్ డీడ్ లు, లీజ్ డీడ్ లకు చెల్లించే రిజిస్ట్రేషన్ ఫీజు, స్టాంప్ డ్యూటీ, ట్రాన్స్ ఫర్ డ్యూటీ వంద శాతం రీఇంబర్స్ మెంట్ ఉంటుంది. రెండవ సారి అయితే 50 శాతం రీయింబర్స్ మెంట్ ఉంటుంది. ఎంఎస్ఎంఇ (మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ ప్రైజెస్) కింద స్థాపించే ఐటీ యూనిట్స్ కు విద్యుత్ బిల్లు చెల్లింపులో 25 శాతం సబ్సిడీ ఉంటుంది.  యూనిట్ వాణిజ్య కార్యకలాపాలు మొదలు పెట్టినప్పటి నుంచి మూడు సంవత్సరాలు గానీ, రూ.30 లక్షల రూపాయల వరకు గాని ఏది ముందైతే అప్పటి వరకు ఈ సబ్సిడీ వర్తిస్తుంది. అదే ఎస్సీ,ఎస్టీ మహిళా పారిశ్రామికవేత్తలు స్థాపించే ఐటీ యూనిట్లకు 50 శాతం సబ్సిడీ ఇస్తారు. అయిదు సంవత్సారాల వరకు గానీ లేదా రూ.50 లక్షల రూపాయల వరకు గానీ ఏదీ ముందేతే అప్పటి వరకు సబ్సిడీ ఇస్తారు. ఎలక్ట్రిసిటీ డ్యూటీ, ఇండస్ట్రియల్ టారిఫ్ నుంచి కూడా కొత్త ఐటీ, ఐటీఈఎస్ యూనిట్స్ కు 5 సంవత్సరాల వరకు వంద శాతం మినహాయింపు ఇస్తారు. ఐటీ కంపెనీ ప్రధాన కార్యాలయం ఏపీలో ఉంటే ఆ కంపెనీ పేటెంట్ (మేథోసంపత్తి హక్కు) కోసం ఖర్చు చేసే మొత్తాన్ని రీయింబర్స్ చేస్తారు. అయితే దేశీయంగా అయితే రూ. 5 లక్షల వరకు, అంతర్జాతీయంగా అయితే రూ.10 వరకు పరిమితి విధించారు. క్వాలీటీ సర్టిఫికేషన్స్ పొందటానికి అయ్యే ఖర్చులో కూడా ఐటీ యూనిట్స్ కొన్ని పరిమితులకు లోబడి 20 శాతం వరకు రీఇంబర్స్ మెంట్ పొందవచ్చు. ఐటీ పరిశ్రమకు ఉపయోగపడే పరిశోధనలు, మార్కెటింగ్ సర్వేలు వంటి వాటిని నిర్వహించే  ఐటీ ఎక్స్ పోర్ట్ అసోసియేషన్స్, ఐటీఎస్ఏపీ, నాస్కామ్(ఎన్ఏఎస్ఎస్ సీఓఎం), ఇఎల్ఐఏపీ, ఎస్ టీపీఐ, ఐఇజీ వంటి ఏ ఇతర సంస్థలకైనా ప్రభుత్వం పూర్తి సహాయ సహకారాలను అందిస్తుంది. ఈ పరిశ్రమకు సంబంధించి జాతీయ, అంతర్జాతీయ సదస్సులు, ఎగ్జిబిషన్స్ వంటివాటిని ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది. అంతే కాకుండా సందర్భానుసారం రోడ్డు షోలు, ఇతర ప్రచార కార్యక్రమాలను ప్రభుత్వమే చేపడుతుంది.

      మెగా ప్రాజెక్ట్స్ కు అదనపు ప్రోత్సాహకాలు

      ఐటీ పరిశ్రమలో పెద్ద పెద్ద మెగా ప్రాజెక్టుకు అదనపు ప్రోత్సాహకాలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. అత్యధికంగా పెట్టుబడి పెట్టి, అయిదు సంవత్సారాల లోపు అయిదు వేల మందికి ఉపాధి కల్పించేవారికి ఇటువంటి ప్రోత్సాహకాలు ఇస్తారు. పరిశ్రమ పెట్టడానికి స్థలాన్ని లేక భవనాన్ని లీజుకు లేక అద్దెకు తీసుకుంటే కొన్ని నిబంధనలకు లోబడి మూడు సంవత్సరాల పాటు అద్దె సబ్సిడీ ఇస్తారు. అలాగే మెగా ఐటీ ప్రాజెక్టులకు పది శాతం ఇన్ వెస్ట్ మెంట్ సబ్సిడీ కూడా ఇస్తారు.

      ఇవే కాకుండా ఎంఎస్ఎంఇ ఐటీ యూనిట్స్ కు ప్రభుత్వం అదనపు ప్రోత్సాహకాలను ప్రకటించింది. కొన్ని నిబంధనలకు లోబడి  అద్దె సబ్సిడీ 50 శాతం, మార్కెట్ డెవలప్ మెంట్ కు చేసే ఖర్చులో 50 శాతం రీఇంబర్స్ మెంట్ ఇస్తారు. ఎస్సీ, ఎస్టీలు, మహిళా పారిశ్రామికవేత్తలకు ఇంకా అనేక రాయితీలను ప్రభుత్వం ప్రకటించింది.  మార్కెట్ డెవలప్ మెంట్ కు చేసే ఖర్చు వారికి వంద శాతం రీయింబర్స్ మెంట్ చేస్తారు. నిర్వహించిన వాణిజ్య కార్యకలాపాల ఆధారంగా వారికి గ్రాంట్ కూడా ఇస్తారు. వడ్డీ సబ్సిడీ ఇస్తారు.  కేటాయించే భూములు, భవనాలలో కొంత భాగాన్ని వారికి రిజర్వు చేశారు.

      ఇన్ని రకాలుగా ప్రభుత్వం ఆర్థిక, ఆర్థికేతర సహాయ సహకారాలు ప్రకటించడంతోపాటు  సింగిల్ విండో విధానం ద్వారా ఐటీ ప్రాజెక్టులకు కూడా కావలసిన పత్రాలు అన్నీ సక్రమంగా ఉంటే 21 రోజులలో అనుమతి ఇస్తారు. ఈ అవకాశాలను దృష్టిలోపెట్టుకుని రాష్ట్రంలో మెగా ఐటీ ప్రాజెక్టులు, యూనిట్ల స్థాపనకు అధిక మంది ప్రాధాన్యత ఇస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కల్పించే సౌకర్యాలతో రాబోయే రెండు మూడేళ్లలోనే ఐటీ ఇండస్ట్రీ విస్తృత స్థాయిలో విస్తరించి లక్షల మంది ఐటీ నిపుణులకు ఉపాధి లభించే అవకాం ఉంది.

       

      జారీ చేసినవారు : కమిషనర్, సమాచార, పౌరసంబంధాల శాఖ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.

       

      STATE NEWS

      0 2280
      ‘యుఎస్‌ఐబీసీ ట్రాన్స్‌ఫోర్మెటివ్ ఛీఫ్ మినిస్టర్’ చంద్రబాబు కాలిఫోర్నియాలో మే8న ప్రదానం అమరావతి :  ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు మరో ప్రతిష్ఠాత్మకమైన అంతర్జాతీయ పురస్కారం లభించింది. యు.ఎస్. ఇండియా బిజినెస్ కౌన్సిల్...