Thursday - February 20, 2020
Blog Page 3

వరుస భేటీలు, ద్వైపాక్షిక చర్చలు, ఒప్పందాలు
‘చైనా కన్‌స్ట్రక్షన్ ఫోర్త్ ఇంజనీరింగ్ డివిజన్ కార్పోరేషన్ లిమిటెడ్
పవర్ చైనా, సౌత్ హ్యూటన్, షెలీకో, కెడాక్లీన ఎనర్జీ ప్రతినిధులలో భేటీ
తీరికలేకుండా గడిపిన ముఖ్యమంత్రి చంద్రబాబు

 

 

నవ్యాంధ్ర ముఖ్యమంత్రి

గుయాన్, జూన్ 29: వరుస భేటీలు. ద్వైపాక్షిక చర్చలు, సమాలోచనలు, పెట్టుబడులకు మన రాష్ట్రంలో సానుకూలాంశాలపై ప్రజెంటేషన్లు. వివిధ జిల్లాల్లో ఏఏ ప్రాజెక్టులకు చైనా కంపెనీలు ఏ రకంగా సాయం అందించవచ్చు? ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బుధవారం చైనా పర్యటన ఇదే రీతిలో సాగింది. యాన్‌లో వరల్డ్ ఎకనమిక్ ఫోరం సమావేశాల్లో ఫార్చూన్-500 కంపెనీల్లో 35 వ స్థానంలో ఉన్న ‘చైనా కన్‌స్ట్రక్షన్ ఫోర్త్ ఇంజనీరింగ్ డివిజన్ కార్పోరేషన్ లిమిటెడ్ కంపెనీ ప్రతినిధులు ప్రజెంటేషన్ ఇచ్చింది. ఈ కంపెనీ వార్షిక టర్నోవర్ 1 ట్రిలియన్ డాలర్లు. సదస్సులో చాంగ్ థాయ్ యువాన్ (Chang Tai yuan) బిల్డింగ్ మెటీరియల్స్ గ్రూపు ప్రతినిధులు ప్రెజెంటేషన్ తమ కంపెనీ నాణ్యతా ప్రమాణాలపై ప్రజెంటేషన్ ఇచ్చారు. యంత్రాల తయారీలో విశేషానుభవం ఉన్న KEDA క్లీన్ ఎనర్జీ కంపెనీ ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులకు సంసిద్ధత వ్యక్తం చేసింది. సిరామిక్స్ యంత్రాలు, భవన నిర్మాణ యంత్రాలు, క్లీన్ గ్యాస్, హైడ్రాలిక్ పంపులు, కంపెరెసర్లు, బ్లాస్టు బ్లోయర్లు తయారీలో KEDA క్లీన్ ఎనర్జీ కంపెనీకి 14 ఏళ్ళ అనుభవం ఉంది.
ఏపీ అభివృద్ధిలో ‘పవర్ చైనా’ భాగస్వామ్యం
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి సహకారం అందించటానికి పవర్ కన్‌స్ట్రక్షన్ కార్పొరేషన్ ఆఫ్ చైనా (పవర్ చైనా) ముందుకు వచ్చింది. ఆఫ్రికా, సౌత్ ఈస్ట్ ఆసియా దేశాల్లో చేపట్టిన ప్రాజెక్టులపై కంపెనీ ప్రతినిధులు లఘు చిత్రం ద్వారా సీఎం చంద్రబాబుకి వివరించారు. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలలో డ్యాములు, బ్రిడ్జిలు, రైల్వే లైన్లు, సోలార్, హైడ్రో పవర్ ప్రాజెక్టుల నిర్మాణంలో ‘పవర్ చైనా ప్రసిద్ధి చెందింది.
సీవరేజ్, ట్రీట్‌మెంట్ విభాగాల్లో అగ్రగామిగా ఉన్న సౌత్ హ్యూటన్ కంపెనీ ప్రతినిధి ముందుగా మాట్లాడుతూ తమ ప్రాధాన్యాన్ని వివరించారు. తర్వాత చైనా అల్యూమినియం ఇంటర్నేషనల్ ఇంజనీరింగ్ కంపెనీ షెలీకో (CHALIECO) ప్రతినిధులు తమ కంపెనీ ప్రత్యేకతను, పెట్టుబడుల్లో ఆసక్తిని ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తెచ్చారు.
ఈ పర్యాయం వరల్డ్ ఎకనమిక్ ఫోరం సమావేశాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రధాన ఆకర్షణగా నిలిచారు. పలువురు పారిశ్రామికవేత్తలు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుతో మాట్లాడటానికి ఉత్సాహం చూపించారు. ముఖ్యమంత్రి వెంట మంత్రులు యనమల రామకృష్ణుడు, పి. నారాయణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు డా. పరకాల ప్రభాకర్, ఎకనమిక్ డెవలప్‌మెంట్ బోర్డు సీఈఓ  జె.కృష్ణ కిశోర్, డెవలప్ మెంట్ కమిషనర్, ఎక్స్ అఫీషియో స్పెషల్ చీఫ్ సెక్రెటరీ  పి.వి రమేశ్, ముఖ్యకార్యదర్శులు  జి. సాయిప్రసాద్,  అజయ్ జైన్, పరిశ్రమల శాఖ కార్యదర్శి సాల్మన్ ఆరోకియా రాజ్, , క్యాపిటల్ సిటీ డెవలప్‌మెంట్ అండ్ మేనేజిమెంట్ కార్పొరేషన్ సీఎండీ లక్ష్మీపార్ధసారథి ఉన్నారు.

  0 1150

  ఐటీలో మేము, మౌలిక సదుపాయాల్లో మీరు
  పరస్పర సహకారానికి ముఖ్యమంత్రి చంద్రబాబు సూచన
  బౌద్ధం మన స్నేహబంధానికి వారథి: సీఎం
  గిజో ప్రావిన్స్ పార్టీతో అవగాహనా ఒప్పందం
  కాగితాలకు కాదు కార్యచరణకు దిగుదాం:
  గిజో ప్రావిన్స్ పార్టీ కార్యదర్శి Chen Miner

  chandrabaabu photos-9jpg
  గియాన్, జూన్ 29: తెలుగుదేశం పార్టీ ప్రాంతీయ పార్టీగా అవతరించి జాతీయ రాజకీయాల్లో కీలకపాత్ర పోషించిందని, ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు చెప్పారు. బుధవారం గియాన్‌లో చైనా కమ్యూనిస్టు పార్టీ గిజో ప్రావిన్స్ సెక్రటరీ Chen Miner తో ముఖ్యమంత్రి భేటీ అయ్యారు.
  ఈ సందర్భంగా చైనా కమ్యూనిస్టు పార్టీ గిజో ప్రావిన్స్ తో ఆంధ్రప్రదేశ్ కు సిస్టర్ స్టేట్ అవగాహనా ఒప్పందం కుదిరింది. ముందుగా భారత్-చైనా సౌహార్థ సంబంధాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రస్తావిస్తూ 2014లో చైనా అధ్యక్షుడి భారత్ పర్యటన, ఆ తరువాత భారత్ ప్రధానమంత్రి నరేంద్రమోడీ చైనా పర్యటన రెండు దేశాల మధ్య స్నేహ బంధాన్ని మరింత దృఢంగా మార్చిందని చెప్పారు. ‘తెలుగుదేశం పార్టీ ప్రాంతీయపార్టీ అయినప్పటికీ జాతీయ రాజకీయాల్లో ముఖ్యపాత్ర పోషిస్తున్నాం’ అని చంద్రబాబు వివరించారు.
  ‘తెలుగుదేశం పార్టీ మూడుసార్లు కేంద్రంలో ప్రభుత్వాల ఏర్పాటులో కీలక భూమిక పోషించింది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్నాం’ అని టీడీపీ జాతీయాధ్యక్షుడు చంద్రబాబు వివరించారు. ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న సహజ వనరులు, పెట్టుబడులకు అవకాశాలపై గిజో ప్రావిన్స్ పార్టీ సెక్రటరీ Chen Miner ‌కు వివరించారు. గిజో ప్రావిన్స్‌కు, ఆంధ్రప్రదేశ్‌కు ఎన్నో సారూప్యతలు వున్నాయని చంద్రబాబు తెలిపారు. ‘ఐటీ, ఫార్మా రంగాలలో గిజో ప్రావిన్సుకు సహకారం అందిస్తాం. మీరు పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పనలో మాతో భాగస్వాములు కావాలి’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రతిపాదించారు.
  ‘మీరు అమరావతి నిర్మాణంలో సహకరించండి, ఒకసారి ఇండియా వచ్చి కొత్త రాజధాని ప్రాంతాన్ని సందర్శించండి’ అని చైనా కమ్యూనిస్టు పార్టీ గిజో ప్రావిన్స్ కార్యదర్శిని కోరారు. ఈ సందర్భంగా గిజో ప్రావిన్స్, ఏపీ మధ్య సోదర సంబంధాల కోసం రెండు ప్రభుత్వాల మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. చైనా కమ్యూనిస్టు పార్టీ గిజో ప్రావిన్స్ కార్యదర్శి సన్ జిగాంగ్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు బృందం గిజో ప్రావిన్స్ సందర్శన తమకు ఎంతో సంతోషాన్ని కలిగించిందన్నారు. తమది సౌత్ వెస్ట్రన్ చైనాలో మంచి కనెక్టివిటీ వున్న ప్రావిన్స్ అన్నారు. వీలైనంత మేర పరస్పర సహకారాల్ని అంది పుచ్చుకుందామన్నారు. ఐటీలో మీ అనుభవం నుంచి తాము నేర్చుకుంటామని చెబుతూ, అత్యాధునిక, అతిపెద్ద సమాచార నిధిని కలిగివున్న ప్రోవిన్స్ తమది అన్నారు.
  వైద్య, ఔషధ రంగాలలో భారత్‌కు ఉన్న అపారమైన అనుభవాన్ని దృష్టిలో వుంచుకుని ఆంధ్రప్రదేశ్ సహకారాన్ని తాము కోరుతున్నట్లు తెలిపారు. పర్యాటక రంగంలో తాము సహకరిస్తామని, ప్రభుత్వరంగంలోని సంస్థలతో ఏపీలో పెట్టుబడులు పెట్టించడంలో పరిస్థితిని సానుకూలపరుస్తానని అన్నారు. ప్రైవేటు కంపెనీలు కూడా ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు తాము ప్రోత్సహిస్తామని భరోసా ఇచ్చారు.

  బౌద్ధం మన సాంస్కృతిక వారథి: చంద్రబాబు
  అవగాహనా ఒప్పందం తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందిస్తూ రెండు రాష్ట్రాల మధ్య ఈరోజు చేసుకున్న ఒప్పందం మన ఇరు రాష్ట్రాల సోదర సంబంధాలకు పునాది అని అభిర్ణించారు. చైనా సహా ప్రపంచమంతా బౌద్ధం వ్యాప్తి చెందింది ఆంధ్రప్రదేశ్ నుంచే నని, ఇదే చైనా, ఏపీ మధ్య సాంస్కృతిక సంబంధానికి వారథిగా నిలిచిందని చంద్రబాబు చెప్పారు.
  ఆంధ్రప్రదేశ్ లో 14 బౌద్ధ క్షేత్రాలున్నాయని గుర్తు చేశారు. చైనా దేశపు స్పీడ్, స్కిల్, స్కేల్ గురించి తమకు బాగాతెలుసునని, భారత్‌లో, ముఖ్యంగా ఏపీలో చైనాకు ఎన్నో అవకాశాలు వున్నాయని, కలసి పనిచేయడానికి నిర్మాణాత్మక ప్రణాళికలు రూపొందించుకుందామని ప్రతిపాదించారు.
  సీపీపీ గిజో ప్రావిన్స్ పార్టీ కార్యదర్శి స్పందిస్తూ తాము కలసి పనిచేయటానికి సిద్ధంగా ఉన్నామని, అవగాహన ఒప్పందాన్ని కేవలం పేపర్లకే పరిమితం చేయకుండా వాస్తవ కార్యాచరణకు ఉపక్రమిద్దామని సూచించారు. ఈ సమావేశంలో మంత్రులు  యనమల రామకృష్ణుడు, పి. నారాయణ, ప్రభుత్వ సలహాదారు డా. పరకాల ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.

  0 2022

  విజయవాడలో ముఖ్యమంత్రి నాయకత్వంలో నవ నిర్మాణ దీక్ష కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన ప్రసంగం :
  నాకు ప్రాణ సమానమైన 5 కోట్ల ప్రజానీకానికి, నవ నిర్మాణ దీక్ష తీసుకున్న ప్రతి ఒక్కరికి అభినందనలు : సీఎం చంద్రబాబు
  విభజనతో ఆర్ధికంగా కష్టాలలో కూరుకుపోయివున్నా రాష్ట్రంలో రెండో ఏడాదికే అద్భుత పురోగతి కనపడుతోంది. వృద్ధి రేటు నుంచి తలసరి ఆదాయం వరకు అన్నింటా ప్రగతి కనిపిస్తోంది.-  సీఎం.
  ఎన్ని కష్టాలు వున్నా రెండేళ్లలోనే రెండంకెల వృద్ధి సాధించాం. 2015-16లో దేశ సగటు వృద్ధి రేటు 7.6 శాతంగా ఉంటే, రాష్ట్ర వృద్ధి రేటు 10.99 శాతం వుండటం మనకే సాధ్యమైంది. – సీఎం.
  8వ తేదీన మహా సంకల్పం చెప్పుకుని ఆరోజు ఈ రెండేళ్లూ ఈ ప్రభుత్వం ఎలాంటి పనులు చేపట్టిందో తెలిపి ప్రజలకు ప్రగతి నివేదికల్ని ఇస్తాం.
  ఈ మధ్యలో 5 రోజుల పాటు వివిధ అంశాలపై సదస్సులు నిర్వహిస్తాం. 3 నుంచి 7 వ తేదీ వరకు అన్ని నియోజకవర్గ కేంద్రాలలో వివిధ అంశాలపై ఈ సదస్సులు జరుపుతాం. – సీఎం.

  0 1532
  • క్యాబినెట్ నిర్ణయాలు

  బుధవారం విజయవాడలో జరిగిన ఆంధ్రప్రదేశ్ మంత్రి మండలి సమావేశం  అనంతరం సమాచార శాఖ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి కేబినెట్ లో తీసుకున్న ప్రభుత్వ నిర్ణయాలను మీడియాకు వెల్లడించారు.

  ఏపీ కేబినెట్ నిర్ణయాలు :

  • ఈ నెల 8న ఒంగోలులో మహాసంకల్ప సభ నిర్వహణకు ఏపీ కేబినెట్ నిర్ణయించిందని తెలిపారు
  • ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పేరిట ఏపీలో ప్రారంభమైన ‘చంద్రన్న బీమా’ పథకం విధివిధానాలకు ఏపీ సర్కారు ఆమోదం తెలిపిందని మంత్రి అన్నారు. ప్రమాదంలో మరణించినా, అంగవైకల్యం ఏర్పడినా రూ. 5 లక్షల వరకూ డబ్బు అందుతుందని, ఇది పేదలకు వరప్రసాదం వంటిదని ఆయన అన్నారు. అంగవైకల్యానికి రూ. 3,62,500 వరకూ డబ్బు చేతికి అందుతుందని అన్నారు. సహజ మరణం సంభవిస్తే రూ. 30 వేలు, ప్రమాదంలో మరణిస్తే రూ. 5 లక్షలు అందుతుందని వివరించారు. 18 నుంచి 70 సంవత్సరాలున్న వారికి, నెలకు రూ. 15 వేల కన్నా తక్కువగా ఆదాయం పొందుతున్న వారికి ఇది వర్తిస్తుందని ఆయన అన్నారు. అట్టడుగు వర్గాల ప్రజల సంక్షేమం కోసం ఈ పథకాన్ని చంద్రబాబు నాయకత్వంలో రూపొందించినట్టు తెలిపారు. ఏడాదికి రూ. 170 బీమా ప్రీమియంగా చెల్లించాల్సి వుంటుందని, అందులో రూ. 150 ప్రభుత్వమే భరిస్తుందని, లబ్దిదారు నుంచి నామమాత్రపు రుసుమునే వసూలు చేస్తామని మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి వివరించారు.
  • జూన్ 10 నుంచి 20 వరకూ ఉద్యోగుల బదిలీలుంటాయన్నారు
  • మొత్తం 10వేల పోస్టులను మొదటి దశలో భర్తీ చేయాలని కేబినెట్ నిర్ణయించిందన్నారు
  • కోటి నలభై ఐదు లక్షల కుటుంబాలపై సోషియో ఎకనమిక్ డేటా సర్వే నిర్వహిస్తామన్నారు
  • జూన్ 20 నుంచి 30 వరకు, వచ్చే నెల 5 నుంచి 30 వరకు పల్స్ సర్వే జరుపుతామన్నారు
  • ప్రభుత్వోద్యోగాల కోసం కోటి ఆశ‌ల‌తో ఎదురుచూస్తోన్న‌ నిరుద్యోగుల‌కు త్వర‌లోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీపిక‌బురు అందించ‌నుందని మంత్రి వెల్లడించారు. ఉద్యోగాల జాతర ఇక మొద‌లు కానుంద‌ని చెప్పారు.
  • పోలీస్ మినహా అన్ని జాబ్ లు ఏపీపీఎస్సీ ద్వారానే భర్తీ చేయాలని నిర్ణయించామన్నారు
  • త్వరలో గ్రూప్ -1, గ్రూప్-2, గ్రూప్ -3 నోటిఫికేషన్లు వెలువడనున్నాయని అందులో భాగంగా గ్రూప్-1లో 94, గ్రూప్-2లో 750, గ్రూప్-3లో వెయ్యి పోస్టులు ఉండనున్నాయన్నారు
  • అత్యధికంగా పోలీస్ శాఖలో 6వేల ఉద్యోగాలకు ప్రకటన వెలువడనుందని తెలిపారు.
  • నవనిర్మాణ దీక్ష కోసం జొన్న విత్తుల రచించిన గీతానికి, సంగీత దర్శకులు వందేమాతరం శ్రీనివాస్ స్వరపరిచగా దాన్ని ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు.
  • ప్రభుత్వ ఎయిడెడ్ , మున్సిపల్ పాఠశాల విద్యార్థులందరికీ సైకిళ్లను పంపిణీ చేయాలని కేబినెట్ నిర్ణయించిందని మంత్రి పల్లెరఘునాథ్ రెడ్డి మీడియా సమావేశంలో వెల్లడించారు. 

  0 3231

  ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక సంచిక (తెలుగు) జూన్ 2016 వెలువడింది.  ఈ ప్రత్యేక సంచికను మీరు హోం పేజి లో ఈ-మ్యాగజైన్ ను క్లిక్ చేసి చదువుకోవచ్చు. లేదా ఈ కింది లింకు ద్వారా కూడా చదువుకోవచ్చు.

  ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక సంచిక (తెలుగు) జూన్ 2016

  0 1038

  నవ నిర్మాణ వారంపై  ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇందులో ఆయన చెప్పిన వివరాలు:
  • 3 వ తేదీ నుంచి 7 వ తేదీ వరకు అన్ని నియోజకవర్గ కేంద్రాలలో వివిధ అంశాలపై సదస్సులు నిర్వహిస్తున్నాం.
  • జూన్ 3న ‘అశాస్త్రీయ విభజన, రాష్ట్రంపై దాని ప్రభావం. విభజన తరువాత రాష్ట్రం ఎదుర్కొన్న ఇబ్బందులు’ అనే అంశంపై సదస్సు వుంటుంది.
  • జూన్ 4న ‘ప్రతికూల పరిస్థితుల్లో సైతం ప్రజలు, ప్రభుత్వం సమష్టిగా సాధించిన విజయాలు’ అనే అంశంపై సదస్సు వుంటుంది. రాజధాని భూ సమీకరణ, పట్టిసీమ ద్వారా నదుల అనుసంధానం, 24 గంటల నిరంతర విద్యుత్ సరఫరా, సీఐఐ భాగస్వామ్య సదస్సు, ఫైబర్ గ్రిడ్, పారదర్శకంగా పెన్షన్లు, ప్రజాపంపిణీ, ఇంకా అనేక విజయాలపై సదస్సులో మాట్లాడుకుందాం.
  • జూన్ 5న ‘వ్యవసాయాన్ని లాభసాటిగా చేసే దిశలో వ్యవసాయం, అనుబంధ రంగాలలో సాధించిన ప్రగతి, భవిష్యత్ కార్యాచరణ’ అనే అంశంపై సదస్సు వుంటుంది. ‘జల వనరులే జాతి సంపద’ అనే స్ఫూర్తితో ప్రాథమిక రంగ మిషన్‌, పొలం పిలుస్తోంది.., నీరు-చెట్టు, వాటర్‌గ్రిడ్ వంటి వినూత్న కార్యక్రమాల విజయాల గురించి చర్చించుకుందాం. అదేవిధంగా ప్రాధాన్య క్రమంలో సాగునీటి ప్రాజెక్టులు, భూసార పరీక్షలు, పంటకుంటలు, అంతర్గత జలరవాణా, వ్యవసాయ అనుబంధ రంగాలైన హర్టీకల్చర్, ఫిషరీస్, యానిమల్ హజ్బెండరీ వంటి అంశాలపై దృష్టిపెట్టాలి.
  • జూన్ 6న ‘పరిశ్రమలు, సేవారంగం, రెగ్యులేటరీ సెక్టారులో ప్రగతి, భవిష్యత్ కార్యాచరణ’ అనే అంశంపై సదస్సు వుంటుంది. పరిశ్రమల రంగ మిషన్, మౌలిక సదుపాయాల మిషన్, సేవారంగ మిషన్ వంటి అంశాలపై వివరంగా చర్చించుకుందాం. గ్యాస్ గ్రిడ్, రోడ్ గ్రిడ్, ఫైబర్ గ్రిడ్, విద్యుత్ గ్రిడ్ వంటి అంశాలలో మనం సాధించిన ప్రగతిని విశ్లేషించుకుందాం. అత్యధికమందికి ఉపాధి కల్పించే ఫుడ్ ప్రాసెసింగ్, పర్యాటక, ఆతిధ్య రంగాలపై దృష్టిపెడదాం.
  • జూన్ 7న ‘గత రెండేళ్లలో చేపట్టిన సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలు, విజయాలు. రానున్న కాలానికి ప్రణాళిక వ్యూహాలు’ అనే అంశంపై సదస్సు వుంటుంది. సామాజిక సాధికారత మిషన్, పరిజ్ఞాన నైపుణ్యాభివృద్ధి మిషన్, పట్టణాభివృద్ధి మిషన్‌ల గురించి చర్చించుకుందాం. అంతేగాకుండా, బడి పిలుస్తోంది, పేదరికంపై గెలుపు, స్వచ్ఛాంధ్రప్రదేశ్, స్థానిక సంస్థల బలోపేతం వంటి కార్యక్రమాల పురోగతితో పాటు విద్య, వైద్యరంగాలలో మనం తీసుకొచ్చిన ప్రగతి గురించి వివరంగా మాట్లాడుకుందాం.
  • ఈ సదస్సులలో ప్రజలంతా పాల్గొని మన సమస్యలు, మన ముందున్న సవాళ్లు, మనకున్న వనరులు ఏంటో వివరంగా చర్చించి కార్య ప్రణాళికలను సిద్ధం చేసుకోవాలి.

  • ముంపు సమస్య ఉండకూడదు
  • నదుల అనుసంధానం వేగవంతం చేయండి
  • జలవనరుల సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు

  అమరావతి, జూన్ 31 : కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేసి ఎక్కడికక్కడ నీటి నిర్వహణ చేపట్టాలని ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడు జలవనరులశాఖను ఆదేశించారు. వరద నీటి నియంత్రణ అత్యంత ముఖ్యమైన అంశంగా తీసుకోవాలని కోరారు. మంగళవారం సాయంత్రం ప్రాధాన్య సాగునీటి ప్రాజెక్టులపై జరిగిన సమావేశంలో ముఖ్యమంత్రి రాష్ట్రంలో పెండింగ్ ప్రాజెక్టుల పురోగతిని సమీక్షించారు. జల వనరుల శాఖలో పైస్థాయి నుంచి కింది స్థాయి ఉద్యోగుల వరకు అందరూ పూర్తి సామర్ధ్యంతో పనిచేసి అనుకున్న సమయానికి ప్రాజెక్టుల పనులు పూర్తయ్యేలా శ్రమించాలని అన్నారు.
  గతంలో ఇష్టానుసారం పనిచేసి కోట్లాది రూపాయిల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని, ఇకపై అలా జరగడానికి వీల్లేదని ముఖ్యమంత్రి హెచ్చరించారు. రాబోయే వర్షాకాలంలో ఎక్కడ ముంపు సమస్య ఎదురైనా ఊరుకోబోనని, సాగునీటి సంఘాల పర్యవేక్షణలో కాల్వల పెండింగ్ పనులు వెంటనే పూర్తిచేసి ముంపు సమస్య రాకుండా చూడాలని నిర్దేశించారు.
  వంశధార ప్రాజెక్టు భూసేకరణ అంశాన్ని వచ్చే మంత్రివర్గ సమావేశంలో పెట్టి చర్చించి నిర్ణయం తీసుకుంటామని సీయం చెప్పారు. తోటపల్లి బ్యారేజి ప్రాజెక్టుకు సంబంధించి 3,719 స్ట్రక్చర్స్ వర్కు ఇంకా మొదలుపెట్టాల్సి వున్నదని అధికారులు చెప్పగా, స్ట్రక్చర్స్ ప్రామాణికాలు నిర్ణయించాలని ముఖ్యమంత్రి చెప్పారు. చిన్నచిన్న నిర్మాణాలలో ఫైబర్ సొల్యూషన్స్ వంటి బెస్టు ప్రాక్టీసెస్ పరిశీలించాలని సూచించారు. మధ్యప్రదేశ్‌లో ప్రాజెక్టు నిర్మాణాల్లో వినూత్న విధానాలు అనుసరిస్తున్నారని, ప్లాస్టిక్ టెక్నాలజీని ఉపయోగించగలమా లేదా అనేది పరిశీలించాలని కోరారు. పోలవరం కుడి కాలువ పనులు ఈ ఏడాది జూన్ నాటికి పూర్తిచేసి నీళ్లివ్వాలని, ఆ కార్యక్రమాన్ని వేడుకలా నిర్వహిద్దామని అన్నారు.
  పోలవరం ఎడమ కాలువను వచ్చే ఏడాది జూన్ నాటికి పూర్తిచేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. వెలిగొండ ప్రాజెక్టుకు సంబంధించి కాంట్రాక్టరుకు ఇవ్వాల్సిన పాత బకాయిలు వెంటనే విడుదల చేయాలని చెప్పారు. రెండు టన్నెల్ నిర్మాణపనులను నిర్దేశించుకున్న సమయానికల్లా పూర్తిచేసేందుకు అవసరమైతే దేశంలోని ఉత్తమ కంపెనీల సాంకేతిక సాయాన్ని తీసుకోవాలని అన్నారు. గుండ్లకమ్మ రిజర్వాయర్ ప్రాజెక్టుకు సంబంధించిన పనుల పురోగతిని సమీక్షించిన ముఖ్యమంత్రి వచ్చే ఏడాది మార్చిలోగా పనులు పూర్తిచేయాలని ఆదేశించారు.
  జీఎన్ఎస్ఎస్ ఫేజ్ వన్ పనులు ఈ ఏడాది జులై మాసాంతానికి పూర్తవుతాయని అధికారులు చెప్పారు. పక్కా ప్రణాళికతో పనులు పూర్తిచేసి చివరి మైలురాయి వరకు నీళ్లు అందించాలని సీయం వారిని కోరారు. ముచ్చుమర్రి మొదటి పంపు ద్వారా జులై నెలాఖరుకల్లా నీళ్లివ్వాలని అన్నారు. నిర్దేశించుకున్న సమయానికి మొత్తం 16 పంపులను వినియోగంలోకి తేవాలని చెప్పారు. హంద్రీనీవా ప్రాజెక్టు ద్వారా ఈ సీజన్‌లోనే కుప్పంకు నీళ్లివ్వాలని సూచించారు. వర్షాలు పడకపోయినా మడకశిర, కుప్పం, చిత్తూరు వరకు నీళ్లిచ్చే పరిస్థితి వుండాలన్నారు.
  కొండవీటి వాగు నీటిని కృష్ణానదికి మళ్లించే లిప్టు స్కీమ్‌పై అధికారులు ఈ సమావేశంలో ప్రెజెంటేషన్ ఇచ్చారు. దీనికి సంబంధించి 50 మెగావాట్ల విద్యుత్ ఉపకేంద్రం నిర్మాణం, కొత్తతరహా పంపుల కొనుగోలుకు ముఖ్యమంత్రి అంగీకరించారు. వంశధార-నాగావళి, పెన్నా-కృష్ణా నదుల అనుసంధానాన్ని సత్వరం పూర్తిచేసి రాష్ట్రాన్ని కరువురహితంగా మార్చాలన్న ప్రభుత్వ లక్ష్యం నెరవేర్చాలని సీయం అధికారులను కోరారు. చెక్ డ్యామ్స్ నిర్మాణాన్ని సకాలంలో పూర్తిచేసి రాష్ట్రంలోని వాగుల్ని, వంకల్ని వెంటనే అనుసంధానం చేయాలని చెప్పారు. 4,500 పొక్లెయిన్లను పూర్తి సామర్ధ్యంతో పనిచేయించేలా చర్యలు తీసుకుని చెరువుల పూడికతీత పనులను పూర్తిచేయాలని సూచించారు.
  ఈ సమావేశంలో జలవనరుల శాఖ మంత్రి శ్రీ దేవినేని ఉమామహేశ్వరరావు, కార్యదర్శి శ్రీ శశిభూషణ్, ఇఎన్సీ శ్రీ వెంకటేశ్వరరావు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

  0 983
  Nava Nirmaana Deeksha

  ‘నవనిర్మాణ దీక్ష’లో ఆంధ్రప్రదేశ్‌ ప్రజలందరినీ భాగస్వాములను చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ సందర్బంగా రాష్ట్ర విభజన వల్ల ఎదుర్కొంటున్న సమస్యలు, రెండేళ్ల పాలనలో సాధించిన విజయాలు, అభివృద్ధి, భవిష్యత్తు ప్రణాళిక తదితర అంశాలపై ఐదు రోజుల పాటు చర్చలు చేపట్టనుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో ఇందుకు అవసరమైన వేదికలను సిద్ధం చేయాలని జిల్లా యంత్రాంగాలను ఆదేశిస్తూ ప్రభుత్వం ఆదివారం ఉత్వర్వులు జారీచేసింది. ఈ సందర్భంగా వివిధ చర్చనీయ అంశాలను ఖరారు చేసింది. జూన్‌ 2న విజయవాడలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రతిజ్ఞతో ‘నవనిర్మాణ దీక్ష’ ప్రారంభం కానుంది. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రజలు ఎక్కడున్నా సరిగ్గా 2వ తేదీ ఉదయం 11 గంటలకు నిల్చొని ఒక్కటిగా ప్రతిజ్ఞ జరిపేలా ఏర్పాట్లు చేయాలని అన్ని జిల్లాల అధికారులను ఆదేశించింది. ఈ సందర్భంగా ప్రజలందరికీ ముందుగానే ప్రతిజ్ఞ పత్రాలను పంపిణీ చేయాలని పేర్కొంది. ఇంటి పెద్దలు.. ఈ ప్రతిజ్ఞ పత్రాన్ని అందుకుని నిర్దేశిత సమయానికి ప్రతిజ్ఞ నిర్వహించే బాధ్యతను తీసుకోనేలా ప్రచారం చేయాలని ఉత్తర్వుల్లో సూచించారు. నవ్యాంధ్ర ప్రతిజ్ఞ కోసం అన్ని శాసనసభ నియోజకవర్గాల్లో తగిన ఏర్పాట్లు చేయడంతోపాటు వేదికల వద్ద ‘నవనిర్మాణ దీక్ష’ అంశంతో ఛాయాచిత్ర ప్రదర్శన కూడా ఏర్పాటు చేయనున్నారు.

  నవనిర్మాణ దీక్షలో చర్చించే అంశాలు ఇవే..
  జూన్‌ 3: అశాస్త్రీయంగా, ఏకపక్షంగా రాష్ట్రాన్ని విభజించడం వల్ల నవ్యాంధ్రప్రదేశ్‌ ఎదుర్కొంటున్న సమస్యలు.
  జూన్‌ 4: రెండేళ్లలో రాష్ట్రంలో ప్రజలు, పాలకులు సాధించిన విజయాలు.
  జూన్‌ 5: వ్యవసాయం, అనుబంధ రంగాల్లో సాధించిన ఫలితాలు, అభివృద్ధికి అవసరమైన భవిష్యత్తు ప్రణాళిక.
  జూన్‌ 6: పరిశ్రమలు, ప్రభుత్వ సేవలు, నియంత్రణ రంగాల అభివృద్ధికి అవసరమైన ప్రణాళిక.
  జూన్‌ 7: గత రెండేళ్లల్లో చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి చర్యలు, భవిష్యత్తు ప్రణాళిక, కార్యక్రమాలు

  STATE NEWS

  0 4334
  ‘యుఎస్‌ఐబీసీ ట్రాన్స్‌ఫోర్మెటివ్ ఛీఫ్ మినిస్టర్’ చంద్రబాబు కాలిఫోర్నియాలో మే8న ప్రదానం అమరావతి :  ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు మరో ప్రతిష్ఠాత్మకమైన అంతర్జాతీయ పురస్కారం లభించింది. యు.ఎస్. ఇండియా బిజినెస్ కౌన్సిల్...